శ్రీనివాస్.పి.బి , Srinivas.P.B
- ======================================================
- పి.బి.శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్) దక్షిన భారతదేసపు నేపధ్య గాయకుడు. తెలుగు , కన్నడ , తమిళభాషలలో ఎన్నో పాటలు పాడేరు . ఈయనకు ఎనిమిది భాషలు వచ్చును . ఉరుదు ,ఇంగ్లిష్ బాగా మాట్లాడగలడు . గజల్స్ చాల వ్రాసారు.
- పేరు : ప్రతివాది భయంకర శ్రీనివాస్ .
- నిక్ నేమ్ : పి.బి.యస్.
- పుట్టిన తేది : 22 సెప్టెంబర్ 1930,
- పుట్టిన ఊరు : కాకినాడ ,
- నివాసము : చెన్నై .
- భార్య : జానకి (80 సం.లు),
- పిల్లలు : నలుగురు కుమారులు --ఫణీందర్ , విజయ్ , నందకిషోర్ , రాజగొఫాల్ , ఒక కుమార్తె =లత .
- తెలుగు లో మొదటి చిత్రం "జాతక ఫలం"(1954)
- మరణం : ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇవాళ14-04-2013 ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. శ్రీనివాస్ పూర్తిపేరు ప్రతివాద భయంకర శ్రీనివాస్. ఆయన స్వస్థలం కాకినాడ. సెప్టెంబర్ 22 1930లో ఆయన జన్మించారు. శ్రీనివాస్ సుమారు రెండు వందల చిత్రాలకు పాటలు పాడారు. కన్నడ తమిళ చిత్రాల్లో ఎక్కువ పాటలు పాడారు. తెలుగులో కాంతారావుకు కన్నడంలో రాజ్‌కుమార్‌కు ఎక్కువ పాటలు పాడారు. ఆయన పాట పాడిన మొదటి చిత్రం జాతక ఫలం. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కలైమామణి పురస్కారం ఇచ్చి సత్కరించింది.
- మాధవపెద్ది సత్యం అవార్డు /శివ ఫౌండేషన్
- ది వొకేషనల్ ఏక్ష్కెల్లెన్కె అవార్డు (for his fifty years of dedication to music)
- విద్వత్ శిరోమణి పురస్కారం
- గోరంత దీపం ,
- సేతా కల్యాణం ,
- చెల్లెలు కాపురం ,
- సంపూర్ణ రామాయణం
- సప్త స్వరాలు ,
- సాక్షి ,
- లేత మనసులు ,
- గుడి గంటలు,
- ప్రేమించి చూడు ,
- తేనే మనసులు ,
- బొబ్బిలి యుద్ధం ,
- డా. చక్రవర్తి,
- మంచి మనిషి ,
- లవ కుస ,
- చదువుకున్న అమ్మాయిలు.
ఆయన గాత్ర మాధుర్యాన్ని గుర్తించిన నిర్మాత నాగేంద్రరావ్ పీబీఎస్‌కు సినిమాలో పాడే అవకాశం కల్పించారు. అలా ప్రేమపాశంతో ఆయన సినీ గళప్రస్థానం ఆరంభమైంది. అందులో పి.సుశీలతో కలిసి తొలిపాట పాడారు. కన్నడంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, తమిళంలో జెమినీ గణేశన్ సినిమాల్లో ఆయన ఎక్కువగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో దాదాపు 3 వేలకుపైగా పాటలు పాడారు. ఆయన కేవలం గాయకుడే కాదు. మంచి గేయ రచయిత కూడా. ఆకలిరాజ్యం సినిమా హిందీలో 'తూహైరాజా..' లాంటి జనాదరణ పొందిన పాటలు ఆయన రాశారు. ఉర్దూలో గజల్స్ రచనా చేశారు. ఆంగ్లంలో కొన్ని కవితలు కూడా రాశారు. నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపినప్పుడు ఆయన ఆంగ్లంలో రాసిన కవిత ఆర్మ్‌స్ట్రాంగ్‌ను సైతం మెప్పించింది. చిత్రసీమలో ఆయన ఒకప్పుడు అగ్రశ్రేణి గాయకుడిగా రాణించారు. తమిళ చిత్రసీమలో ఆయన ఆరాధ్య గాయకుడిగా వెలుగొందారు. ఎంతోమంది తమిళ సినీ గీతాభిమానులు ఆయన సొంతం. వెంకటేశ్వర సుప్రభాతం, ముకుందమాల, శ్రీమల్లికార్జున స్తోత్రం లాంటి భక్తి పాటలు ఆలపించారు. గాత్రం గంభీరంగా ఉన్నా మాధుర్యం మిళితమై సమ్మోహనపరచడం పీబీఎస్ ప్రత్యేకత. తమిళనాడు ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'కలైమామణి' బిరుదుతో సత్కరించింది.
'కట్టు'తప్పని 'పాట'సారి: సినిమా రంగంలో ఎంతోమంది కళాకారులు, గాయకులు ఉన్నా పీబీ శ్రీనివాస్‌ది ప్రత్యేక శైలి. కేవలం గాత్రంలోనే కాదు. ఆయన ఆహార్యం కూడా అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. తెలుగుతనం ఉట్టిపడే పంచెకట్టు, అందమైన తలపాగ, నుదుటిపై నిలువు నామం ఆయన ప్రత్యేకం. చొక్కా జేబులో ఎప్పుడూ రంగురంగుల పెన్నులు మిలమిల మెరుస్తుంటాయి. ఎంతటి సభలోనైనా పీబీఎస్‌ను ఈ శైలి ఇట్టే ప్రత్యేకంగా నిలిపేది. కేవలం సభల్లోనే కాదు సాధారణంగా ఉన్నప్పుడూ ఇదే ఆహార్యం. చెన్నై మౌంట్‌రోడ్డులోని అమెరికన్ కాన్సులేట్ ఎదురుగా ఇటీవల వరకు ఉడ్‌ల్యాండ్స్ హోటల్ ఉండేది. ఓ రకంగా చెప్పాలంటే ఆయనకు అదే కాలక్షేప ప్రాంతం, ఓ రకంగా ఆయన కేరాఫ్ అడ్రస్. ఆయనకు అక్కడ ప్రత్యేకంగా ఒక టేబుల్ ఉండేది. అక్కడే ఆయన కూర్చొని పాటలు రాసుకుంటూ కనిపించేవారు.
- =================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog