

మనిషి మూడు అడుగుల రెండు అంగుళాలు మాత్రమే . అలంటి వారిని చుస్తే పిల్లలు , పెద్దలు అనే తేడా లేకుండా మరుగుజ్జోడు రోయ్ అంటు ఎగతాళి చేస్తుతారు . అయితే అలంటి హేళనలు అతన్ని కుంగ దియలేదు . చదువులో తనకు చేతనైనంత వరకు ప్రయత్నించాడు . తను అనుకున్నది సాధించాడు . విధి కుడా అనుకులించి తనను ప్రేమించే జీవన సహచరి దొరుకింది . భర్తను చేయి పట్టి నడిపించింది . వారి సంసార నౌక నేటికి సాగిపోతూనే వుండి హర్దికంగా (ఆర్ధికంగా కాదు )సాఫీగా.
ఇది ఒక కోణం , మరో కోణం లోకి తొంగి చుస్తే బ్రతకడానికి సరిపడా ఆదాయం లేదు . ఉండటానికి గుడు లేదు . నలభై సంవస్తరాలు నటుడుగా కొనసాగినా కేవలం కిర్తిమాత్రం మిగిలింది .
- పేరు : గట్టు , వీరయ్య . పొట్టిగా ఉండడము వలన పొట్టి వీరయ్య అంటారు.
- జీవనాధారం : పబ్లిక్ టెలిఫోన్ . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి వెయ్యి రూపాయలు, యన్. ఎఫ్.డి. సి . నుండి౧౦౦౦/- . వైజాగ్ జగదాంబ థియేటర్ ఓనర్ ౫౦౦/ వస్తున్నాయి.
- కుటుంబము : భార్య . ఇద్దరు ఆడ పిల్లలు .(పెళ్ళిళ్ళు అయ్యిపోయాయి)
- నివాసము : మద్రాస్ లో కృష్ణ నగర్ ఏరియా లోని ఇందిరానగర్ నుండి హైదరాబాద్ వచ్చేసారు.
- సొంత ఊరు : నల్గొండ జిల్లా , సూర్య పేట తాలూకా లోని పనిగిరి. అమ్మ నానా లకు ఇద్దరు సంతానం లో అక్కమాములు గానే ఉంటుంది.
- మొదటి సినిమా : అగ్గిదొర, టాటా మనవడు. సుమారు ౩౦౦ సినిమాలు చేసారు.