దాశరథి కృష్ణమాచార్య , Dasaradhi Krishnamacharya
పరిచయం :
- ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...దాశరధి కృష్ణమాచార్య.
- తరతరాలు గా 'బూజు పట్టిన భావాలను తరిమిగొట్టి ' కోటి రత్నాల వీణ' కు మధుర పదాలు అర్పించిన పొట్టి తట్టి కవి , ఈయ న పూర్తి పేరు దాశరధి కృష్ణమాచార్య . అన్నపూర్ణా వారి " ఇద్దరు మిత్రులు" తో సిని కవి జీవితం ప్రారంభించి , సిని పరిశ్రమలోని చిన్న వర్కర్ సయితం తన మిత్రుడన్నట్లుగా నడుచుకొన్న సహృదయుడు .
- తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు . పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.
- పుట్టిన తేది : 1925 జూలై 22 న
- పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో . ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లామధిరలో గడిచింది.
- చదువు : ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనేపద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు.
- ఉద్యోగం : ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలోదాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.
- మరణము : 05 నవంబర్ 1987 .
- కవితా సంపుటాలు
- అగ్నిధార
- మహాంధ్రోదయం
- 'రుద్రవీణ ఓ
- 'మార్పు నా తీర్పు
- 'ఆలోచనాలోచనాలు o
- ధ్వజమెత్తిన ప్రజ
- కవితా పుష్పకం: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
- తిమిరంతో సమరం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
- అభ్యుదయ కవిగా నిజాం దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన దాశరథి కృష్ణమాచార్య, లలిత గేయకవిగా లబ్ద ప్రతిష్టులైన తర్వాతనే ‘వాగ్దానం (1961)’ ద్వారా సినీరంగంలో ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ కవిగా నియమింపబడిన దాశరథి, సినీగేయ రచన కూడా చేయడం వల్ల దాని విలువ పెరిగింది.భాషాభావ సౌందర్యాలకు సమ ప్రాధాన్యమిచ్చిన సినీకవి. ఉర్దూ పదాల మేళవింపు ద్వారా తెలుగు పాటకు అదనపు అందాల్ని తెచ్చారు. భక్తి పాటలు, వీణ పాటలు, అనుబంధ గీతాలు, కవాలీ పాటలు ఆయన ప్రత్యేకత. ఇద్దరు మిత్రులు, లేత మనసులు, మూగమనసులు, రంగుల రాట్నం, గూడుపుఠాణి, బుద్ధిమంతుడు లాంటి చిత్రాలకు సుమారు 600 పాటల్ని రాశారు.
- తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..
- ఎవరు కాకతి ! ఎవరు రుద్రమ !
- ఎవరు రాయలు ! ఎవరు సింగన !
- అంతా నేనే ! అన్నీ నేనే !
- అలుగు నేనే ! పులుగు నేనే !
- వెలుగు నేనే ! తెలుగు నేనే !
- ఓ నిజాము పిశాచమా, కానరాడు
- నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
- తీగలను తెంపి అగ్నిలో దింపినావు
- నా తెలంగాణ కోటి రతనాల వీణ
- ఆంధ్ర రాష్ట్రము వచ్చె
- మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ
- పొలిమేర చేరపిలిచె
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog