కె.వి.రెడ్డి , Reddy K V








పరిచయం :
  • కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి (K.V.Reddy, Kadiri Venkata Reddy) తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించు కొన్నారు . కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావు పాత్రలు. అంతేకాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభక లాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది 
ప్రొఫైల్ :
  • పేరు : కె.వి.రెడ్డి ,
  • పుట్టిన ఊరు : అనంతపురం జిల్లా తాడిపత్రి .
  • పుట్టిన తేది : 1912 వ సంవత్సరం జూలై 1 న జన్మించాడు.
పని చేసిన సినిమాలు : దర్శకత్వం వహించినవి .>
  • 1. భక్త పోతన (1942)
  • 2. యోగి వేమన (1947)
  • 3. గుణసుందరి కథ (1949)
  • 4. పాతాళభైరవి (1951)
  • 5. పెద్దమనుషులు (1954)
  • 6. దొంగరాముడు (1955)
  • 7. మాయాబజార్ (1957)
  • 8. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
  • 9. జగదేకవీరుని కథ (1961)
  • 10. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
  • 11. సత్య హరిశ్చంద్ర (1965)
  • 12. భాగ్యచక్రం (1968)
  • 13. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)
  • 14. శ్రీకృష్ణసత్య (1971).
చిత్రానువాదం అందించినవి :
  • 1. గుణసుందరి కథ (1949) 2. దొంగరాముడు (1955)
కథ అందించినవి :
  • 1. దొంగరాముడు (1955) 2. మాయాబజార్ (1957)
నిర్మాతగా వ్యవహరించినవి
  • 1. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
  • 2. జగదేకవీరుని కథ (1961)
  • 3. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
  • 4. సత్య హరిశ్చంద్ర (1965)
  • 5. భాగ్యచక్రం (1968)
  • 6. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)

  • ============================
Visit my website : dr.seshagirriao.com

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani