రాం చరణ్ తేజ,Ram charanTeja
- ==========================================================
- రామ్ చరణ్ తేజ (Ram Charan Teja) ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు.ఇతని మొదటి సినిమా "చిరుత"(అక్టోబర్ 2007).
జీవిత విశేషాలు :
- పేరు : రామ్ చరణ్ తేజ
- పుట్టిన తెది : 27.03.1985న,
- పుట్టిన ఊరు : చెన్నై - తమిళనాడు ,
- తండ్రి : చిరంజీవి-ప్రముఖ సినీ హీరో,
- తల్లి : సురేఖ -అల్లు రామలింగయ్య(ప్రముఖ హాస్య నటుడు ) కుమార్తె .
- తోబుట్టువులు : సుస్మిత , శ్రీజ ,
బాల్య లో హాపీ గా గడిపిన రోజులు :
- (అతని మాటల్లో)--స్వతహాగా నేను అల్లరి చేసే రకం కాదు. అందులోనూ చిరంజీవిగారబ్బాయిగా ఆ విషయంలో నామీద ఏదో ఒక తెలియని నియంత్రణ ఉన్నట్టు ఫీలయ్యేవాణ్ని. నావల్ల నాన్నకెక్కడ చెడ్డపేరు వస్తుందోనన్న భయం ఉండేది. కాబట్టి కాలేజీలో అల్లరి అంటే ఏమీ లేదు. ఫ్రెండ్స్ తమాషాలు చేస్తుంటే మాత్రం సరదాగా చూసేవాణ్ని. కాలేజీలో నామీద మా ప్రిన్సిపాల్‌కున్న ఏకైక కంప్త్లెంట్... జుట్టు బాగా పెంచుతానని. నాకు జుట్టు పొడుగ్గా ఉంటే చాలా ఇష్టం. వాళ్లేవో ట్రిమ్‌గా కటింగ్ చేయించుకోవాలనేవారు. నేను ఇంట్రావర్ట్‌ని... అమ్మాయిల విషయంలో మరీ సిగ్గరిని. వాళ్లు పలకరిస్తే సమాధానం చెప్పడమే కానీ, నా అంతట నేను పలకరించడం ఎప్పుడూ లేదు.
సినిమాలు :
- చిరుత --2007 లో,
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog