కమలాకర కామేశ్వరరావు,kamalakara Kameswararao












  • -




  • ------------------------------------------------------


పరిచయమ :
  • సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారత దేశంలోనే మరేభాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవవనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి. అలాంటి చిత్రాలను తీసి పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందినదర్శకుడు కమలాకర కామేశ్వరరావు.
ప్రొఫైల్ :
  • పేరు : కమలాకర కామేశ్వరరావు ,
  • పుట్టిన తేది : x-x-1911
  • పుట్టిన ఊరు : బందరు
  • చదువు : బి.ఎ - 1933,
సినీ విమర్శకునిగా:
  • కృష్ణా పత్రిక లో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూథియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయనవిమర్శలు సాగేవి.
  • ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన "ద్రౌపదీ వస్త్రాపహరణం", "ద్రౌపదీ మానసంరక్షణం" చిత్రాలను రెండింటినీసరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో వ్రాసినవిమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఎందుకంటే 'వస్త్రాపహరణం' ఆర్థికంగా విజయవంతమైంది; 'మానసంరక్షణం' దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం 'మానసంరక్షణం' 'వస్త్రాపహరణం' కంటే మంచి చిత్రమనిప్రశంసించాడు. వస్త్రాపహరణం లోని లోటుపాట్లను విమర్శించాడు. వస్త్రాపహరణంలో నాటి ప్రముఖ స్టేజి నటులంతానటించారు. బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలనే ఆ సినిమాలో వాడారు. హెచ్. ఎం. రెడ్డి ఆధ్వర్యంలో హెచ్.వి.బాబుదర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది. 'వస్త్రాపహరణం', 'మానసంరక్షణం' చిత్రాల మీద వ్రాసిన విమర్శలే కామేశ్వరరావును చిత్ర పరిశ్రమలో ప్రవేశ పెట్టాయి.
రంగ ప్రవేశం:
  • హెచ్.ఎం.రెడ్డి 'కనకతార' తీస్తున్న రోజుల్లో కామేశ్వరరావు మద్రాసు వచ్చాడు. 'మానసంరక్షణం', 'వస్త్రాపహరణం' చిత్రాల మీద తాను వ్రాసిన విమర్శలు చూపించాడు - "వస్త్రాపహరణం" సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి కి. విమర్శలుపూర్తిగా చదివి హెచ్.ఎం.రెడ్డి ఆయన్ను అభినందించాడు!! "చాలా బాగుంది" అని మెచ్చుకున్నాడు!! పైగా తనసినిమాను విమర్శించి, దానికి పోటీగా ఇంకొకరు తీసిన సినిమాను ప్రశంసించిన కామేశ్వరరావుకు ఉద్యోగమివ్వడానికిసిద్ధపడ్డాడు.
  • గృహలక్ష్మి సినిమా ప్రారంభానికి ముందు కామేశ్వరరావు మద్రాసు చేరుకుని రోహిణీ సంస్థలో చేరాడు. రోహిణీలోచేరడంతో ఆయనకు పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు పరిచయమయ్యారు. కామేశ్వరరావుకు ఆ సినిమాలో జీతమేకాదు, పని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజూతప్పనిసరిగా ఏదో ఒక సినిమా చూసేవాడు. రాత్రయాక కె.వి.రెడ్డి, ఆయనా ఆ సినిమా గురించి చర్చించుకునేవారు. గృహలక్ష్మి చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరాడు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు. వాహినీవారి దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పని చేశాడు. ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియోగాపేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో కామేశ్వరరావు ఒకడు.

  • బందరులో కామేశ్వరరావుకు పింగళి నాగేంద్రరావుతో పరిచయముంది. కామేశ్వరరావు ఆయనను కె.వి.రెడ్డికి, బి.ఎన్.రెడ్డికి పరిచయం చేశాడు. అలా తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన రచయితను పరిశ్రమకుపరిచయం చేసింది కూడా కామేశ్వరరావేనని చెప్పవచ్చు.అంతలో కారణాంతరాల వల్ల వాహినీ స్టూడియో చేతులుమారి విజయా సంస్థ స్టూడియోను నిర్వహించసాగింది. విజయా వారు కామేశ్వరరావును కూడా తమ సంస్థ లోకితీసుకున్నారు. తొలుత విజయా వారి పాతాళభైరవి సినిమాకు ఆయన పనిచేశాడు. తర్వాత విజయా వారే నిర్మించినచంద్రహారం సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యాడు.
  • పాండురంగ మహత్యం, గుండమ్మ కధ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ తులాభారం, బాల భారతం లాంటి ఎన్నోఅపురూపమైన పౌరాణిక, సాంఘీక చిత్రాలను మనకి అందించిన పౌరాణిక బ్రహ్మ శ్రీ కమలాకర కామేశ్వర రావు గారుసదా అభినందనీయుడు.
నిరాడంబరుడు
  • మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, పాండవ వనవాసం, పాండురంగ మహాత్యం, నర్తనశాల, గుండమ్మకథ వంటి ఎన్నో చిత్రాల్ని డైరక్టుచేసిన కమలాకర కామేశ్వరరావు అతి నిరాడంబరంగా వుండేవారు. ''ఆయన్ని చూస్తే ఎవరో స్కూలు మాస్టారు అనిపిస్తారుగాని, సినిమా దర్శకుడు అనిపించడు'' అనేవారు ఆ రోజుల్లో. నిత్యం తెల్లని పంచె, జుబ్బా వస్త్రధారణ. ''చిన్నతనంలో లాగులు వేసుకునే వాడిని. కాలేజి చదువుకు వెళ్లిన దగ్గర్నుంచి పంచెలతోనే వెళ్లేవాడినిగాని, పాంటు ఎప్పుడూ వేసుకోలేదు'' అని చెప్పాడొకసారి. ఎన్ని సినిమాలు, హిట్‌ సినిమాలు చేసినా, నిర్మాత ఎంత ఇస్తే అంతే తీసుకున్నారుగాని, ''ఇంత ఇస్తే గాని చెయ్యను'' అని ఏనాడూ అనలేదు! అందుకే కాబోలు ఆ రోజుల్లో ఆయనతోపాటు వున్న దర్శకులందరికీ సొంత కారున్నా ఆయనకి మాత్రం ఎప్పుడూ కారులేదు. అలాగే, సొంత ఇల్లూ లేదు. నియమ నిష్ఠలు, దైవభక్తీ ఎక్కువ. వ్యసనం అనేది ఏదీ ఆయన దగ్గరకి కూడా రాలేదు. ఎవరితోనూ 'మాటా మాటా' రావడం కూడా లేదు. తన దగ్గర పనిచేసిన సహాయకులందర్నీ కూడా 'మీరు' అనే సంబోధించేవారు. సినిమా కంపెనీలకి వెళ్లాలన్నా- షూటింగ్‌కి వెళ్లాలన్నా వాళ్లు చెప్పిన వేళకి- సిద్ధమై గుమ్మంలో నించునేవారు. షూటింగ్స్‌ లేకపోతే, నిత్యం పుస్తక పఠనం. ''కె.వి.రెడ్డి గారి తర్వాత, స్క్రీన్‌ ప్లే రూపొందించడంలో కామేశ్వరరావుగారే'' అని చెప్పుకునేది పరిశ్రమ. నటులు, ఇతరులూ అందరూ కామేశ్వరరావు గారిని ఎంతో పూజ్యభావంతో చూసేవారు. ఎప్పుడోగాని కోపం వచ్చేది కాదు ఆయనకి. నిత్యం నవ్వుతూ, శాంతంగా వుండేవారు. స్క్రిప్టు క్షుణ్ణంగా తయారుచేసుకుని షూటింగ్‌కి వచ్చేవారు. వాహినీ సంస్థలో వున్నప్పుడు అక్కడివారంతా ఆయన్ని 'ధర్మరాజు' అనేవారు.
సితార సహకారంతో..

  • =============================
visit my website :  dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani