చిత్తూరు నాగయ్య,Chitturu Nagayya

























  •  
  • ===========================
పరిచయం :
  • చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీకల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపునుపెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈగౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు. 
  • చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు.
ప్రొఫైల్ :
  • పేరు : చిత్తూరు నాగయ్య (నాగదేవత దీవెనల వలన పుట్టేరని నాగయ్య గా నామకరణం చేసారు .
  • అసలు పేరు : ఉప్పల దడియం నాగయ్య -చిత్రాంగి వేసం వేసి (చిత్తూరు జిల్లా కు వలస వేల్లినందున )చిత్తూరునాగయ్య గా మారేరు ,
  • పుట్టిన తేది : 28 / మార్చ్ /1904 ,
  • పుట్టిన ఊరు : రేపల్లె -గుంటూరు జిల్లా ,
  • అమ్మ : వెంకట లక్ష్మాంబ ,
  • నాన్న : రామలింగ శర్మ ,
  • పిల్లలు : లేరు. 
  • చదువు : డిగ్రీ -
  • కులము : హిందూ బ్రాహ్మిన్ ,
  • ఉద్యోగం : గుమస్తా గా ను ,ఆంధ్ర పత్రిక లో జర్నలిస్టు గాను పనిచేసారు .
  • మరణము : 30 డిసెంబర్ 1973 .
కెరీర్ :
  • కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు.
నటించిన చిత్రాలు 30వ దశకం=
  • 1. గృహలక్ష్మి(1938)-
  • 2. వందేమాతరం (1939)
40వ దశకం-1940--
  • 1. సుమంగళి-
  • 2. మహాత్మాగాంధీ (డాక్యుమెంటరీ)-
  • 3. విశ్వమోహిని
1941-
  • 1. దేవత-
1943-
  • 1. భాగ్యలక్ష్మి-
  • 2. చెంచులక్ష్మి-
  • 3. భక్తపోతన-
1945-
  • 1. స్వర్గసీమ-
1946-
  • 1. త్యాగయ్య-
  • 2. యోగి వేమన--
1949-
  • 1. మనదేశం
50వ దశకం-
1950-
  • 1. బీదలపాట్లు-
1953-
  • 1. నా ఇల్లు-
  • 2. ఇన్స్‌పెక్టర్-
  • 3. ప్రపంచం-
  • 4. గుమస్తా-
1954--
  • 1. మా గోపి-
  • 2. సంఘం-
  • 3. జాతకఫలం-
1955-
  • 1. అనార్కలి--
1956-
  • 1. భక్త మార్కండేయ-
  • 2. ముద్దు బిడ్డ-
  • 3. తెనాలి రామకృష్ణ-
  • 4. నాగపంచమి--
1957-
  • 1. సతీ సావిత్రి-
  • 2. పాండురంగ మహత్యం 3. నలదమయంతి--
1958--
  • 1. బొమ్మల పెళ్ళి-
  • 2. ఎత్తుకు పైఎత్తు-
  • 3. గంగా గౌరి సంవాదం-
  • 4. శ్రీ రామాంజనేయ యుద్దం-
  • 5. సంపూర్ణ రామాయణం-
  • 6. పార్వతీ కళ్యాణం
1959-
  • 1. బండరాముడు-
  • 2. జయభేరి-
  • 3. సిపాయి కూతురు--
60వ దశకం-
1960--
  • 1. అభిమానం-
  • 2. భక్త రఘునాథ్-
  • 3. భక్త శబరి-
  • 4. మా బాబు(అతిధి)-
  • 5. సమాజం-
  • 6 . శాంతినివాసం-
  • 7. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం--
1961-
  • 1. -భక్త జయదేవ-
  • 2. ఇంటికి దీపం ఇల్లాలే-
  • 3. సీతారామ కళ్యాణం-
  • 4. వాగ్దానం(అతిధి)-
  • 5. పెళ్ళిపిలుపు(అతిధి)-
  • 6. సతీ సులోచన(అతిధి)-
  • 7. ఋష్యశృంగ-
1962-
  • 1. నాగార్జున-
  • 2. దక్షయజ్ఞం(అతిధి)-
  • 3. ఆరాధన(అతిధి)-
  • 4. స్వర్ణమంజరి-
  • 5. పెళ్ళి తాంబూలం-
  • 6. పదండి ముందుకు(అతిధి)-
  • 7. గాలి మేడలు-
  • 8. -సిరిసంపదలు-
  • 9. మమకారం--
1963--
  • 1. బందిపోటు-
  • 2. కానిస్టేబుల్ కూతురు--
  • 3. లవకుశ-
  • 4. అనురాగం(అతిధి)-
  • 5. శ్రీకృష్ణార్జున యుద్ధం-
  • 6. తల్లీ బిడ్డలు-
  • 7. లక్షాధికారి-
  • 8. ఇరుగు పొరుగు--
1964--
  • 1. అగ్గిపిడుగు-
  • 2. ఆత్మబలం-
  • 3. అమరశిల్పి జక్కన-
  • 4. రామదాసు-
  • 5. వివాహ బంధం-
  • 6. గుడిగంటలు--
  • 7. -గుడుమూతలు(అతిధి)-
  • 8. నవగ్రహ పూజా మహిమ-
  • 9. బొబ్బిలి యుద్ధం(అతిధి)-.
source : వికీపీడియా.
  • చివరి జీవితము :
అడిగినవారికి లేదనకుండా సహాయము చేసే మనస్థత్వము ఉన్న నాగయ్యగారు.... చివరి గా తీసిన సినిమా " రామదాసు " వలన నష్టము వచ్చినందున ఆస్థిపాస్తులను అమ్మి పూట తిండికి కూడా అడుక్కోవలసి వచ్చిందని తన స్వీయచరిత్రలో వ్రాసుకున్నారు .1964 నుండి ఆయన మరణించిన 30-12-1973 మధ్యకాలములో ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు . తాను రాసుకున్న స్వీయచరిత్రలో నేటి స్వార్ధప్రపంచములో " తనకుమాలిన ధర్మము చెయ్యవద్దని " అది వ్యక్తిని నాశనము చేస్తుందని తెలిపారు. సంపాదించిన దానిలో కొంత దాచుకోవాలన్న విషయము మరచిపోవద్దని , ప్రతిమనిషీ చెప్పిన తీయని మాటలకు , కబుర్లకు లొంగిపోవద్దని , ఆ భ్రమలో పడి కష్టాలు కొని తెచ్చుకోవద్దని రాసారు.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala