ఆంజనేయులు.సి.యస్.ఆర్ , Anjaneyulu.C.S.R.

- ========================================================
- గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. స్థానం నరసింహారావుతో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళవయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగాపలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్గా, హాస్యనటుడి గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వారు ఈ ఆంజనేయులు. సుమారు 175 సినిమాలు చేసారు .
- తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది చిలకలపూడి సీతారామాంజనేయులు. సి. యస్. ఆర్. గా ప్రసిద్ధుడైన ఈయన రంగస్థలం నుండి చిత్రరంగానికోచ్చిన వారే ! 1930 దశకంలో కథానాయకుడిగా వెలిగిన ఈయన 1950 దశకంలో క్యారెక్టర్ నటుడిగా మారారు. దేవదాసులో పార్వతిని పెళ్ళాడిన జమిందారు పాత్రలో ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయన మాటల చమత్కారానికి నిదర్శనం.
ప్రొఫైల్ :
- జన్మ నామం = చిలకలపూడి సీతారామాంజనేయులు,
- జననం = జూలై 11, 1907,
- కులము : హిందూ బ్రాహ్మిన్ ,
- స్వస్థలం :నరసారావు పేట - గుంటూరు జిల్లా ,
- మరణం = అక్టోబరు 8, 1963, చెన్నై., సహజ మరణం.
- ఇతర పేర్లు = సి.యస్.ఆర్,
- వృత్తి = నటుడు,
- తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , ఇద్దరు చెల్లెళ్ళు ,
- పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా), *
- రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్), *
- బాలాజీ * చూడామణి * దేవదాసు (1953 సినిమా) *
- ఎత్తుకు పైఎత్తు * పాతాళభైరవి *
- ద్రౌపదీ వస్త్రాపహరణం *
- సుమతి
- వాలి సుగ్రీవ *
- సతీ సక్కుబాయి *
- పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా) *
- మాయా రంభ
- నవ్వితే నవరత్నాలు *
- బభృవాహన
- ===========================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog