కాంచనమాల చిత్తజల్లు-Kanchanamala

























  • --------------------------------------------------------------
పరిచయం:
  • అలనాటి అందాల తెలుగు సినిమా తార, తెలుగు సినిమా హీరోయిన్లకి గ్లామర్‌ సృష్టించిన తొలి తెలుగు సినీ నటి మరియుగాయని చిత్తజల్లు కాంచనమాల. 1938 - 40 ప్రాంతాల చాలా మంది ఇళ్లలో గోడ మీద కాంచనమాల కాలెండర్వేల్లాడుతూ వుండేది. సంవత్సరం అయిపోయి, డేట్‌ కాలెండర్‌ చిరిగిపోయినా, ఆ చిత్రం మాత్రం కొంత మంది ఇళ్లలోకనిపించేది. ఆ కాలెండర్‌ బొమ్మ ‘మాలపిల్ల’ (38) చిత్రంలోది. ఆ మాలపిల్ల పాత్రధారిణి ఆమె. మొదట్లో పల్లెటూరివాళకంగా వున్నా, ఒక బ్రాహ్మణయువకుని వివాహం చేసుకుని కలకత్తా పారిపోయి, సంస్కారవంతురాలైన తర్వాతతీసిన స్టిల్‌ అది. అదే కాలెండర్‌.
జీవిత విసేసాలు :
  • జన్మ నామం - చిత్తజల్లు కాంచనమాల
  • జననం - 5-మార్చి-1917,
  • పుట్టిన ఊరు : తెనాలి,
  • మరణం - 24-జనవరి-1981
  • వృత్తి నటి

సినీ జీవితం

  • కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై.వి.రావు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారము (35) లో మిత్రవింద వేషం వేయించారు. ‘మాలపిల్ల, గృహలక్ష్మి’ (38) చిత్రాలతో ఆమె ప్రేక్షక హృదయాల్లో తన ‘అందం’తో పీఠం వేసుకుంది. ‘మాలపిల్ల’లో హీరోయిన్‌, ‘గృహలక్ష్మి’లో వాంప్‌. రెండు సినిమాలూ బాగా ఆడిన సినిమాలు.
  • జెమినీ అధినేత ఎస్.ఎస్.వాసన్ ను తనతో అసభ్యముగా ప్రవర్తించినందుకు తిట్టిందని. ఆ తిట్లన్నీ తన స్టూడియో లో తెలివిగా రికార్డు చేయించి వాసన్ కాంచనమాల పై కోర్టులో కేసు పెట్టాడని, ఈ కీచులాటలే ఆమెకు మతిస్థిమితము తప్పడానికి కారణమయ్యాయని భావిస్తారు. ఆ తరువాత చాలా కాలానికి 1963 లో నర్తనశాల చిత్రంలో విరాట రాజు భార్యగా చిన్న వేషం వేసింది.

సౌందర్యం

  • ‘మాలపిల్ల’ సినిమాలో ఒక మాలపిల్లని, సద్బ్రాహ్మణ ఛాందస కుటుంబానికి చెందిన కుర్రవాడు పెళ్ళి చేసుకోవడం కథలో వున్నా - ‘కాంచనమాల అంతటి అందగత్తె ఏ కులం పిల్ల యితేనేం - ఎవడు చేసుకోడు?’ అని అడిగారు ఆ నాటి జనం. అలా ఆమె అందం ఆ పాత్రని మింగివేసింది. ‘రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల’ అంటూ, శ్రీ శ్రీ రాసిన గేయంలో ఆమెను ‘స్క్రీన్‌ గాడెస్‌’ అనిపించుకున్న హాలివుడ్‌ స్టార్‌ నార్మా షేరర్‌తో పోల్చారు. ‘ అంత అందమైన ముక్కు, కళ్లు, జుట్టూ, నాజూకుతనంతో వున్న హీరోయిన్‌ మళ్లీ రాలేదు’ అన్నవాళ్లు ఈ నాటికీ వున్నారు. ఆమెది సహజ సౌందర్యం. విగ్గులు, పెద్ద మేకప్‌లు, ఐలాష్‌లూ ఏం లేవు.

చిత్ర సమాహారము

  • నర్తనశాల (1963)
  • లవ్ మ్యారేజి (హింది) (1959)
  • జింబొ(హింది) (1958)
  • బాల నాగమ్మ (1942)
  • ఇల్లాలు (1940)
  • మళ్ళీపెళ్ళి (1939)
  • వందేమాతరం (1939)
  • గృహలక్ష్మి (1938 సినిమా)
  • మాలపిల్ల (1938)
  • విప్రనారాయణ (1936)
  • వీరాభిమన్యు (1936 సినిమా)"
  • కృష్ణ తులాభారం (1935)
కాంచనమాల భవన్‌


  • అలనాటి సహజ సౌందర్య నటి కాంచనమాల. ఆమెది తెనాలి. అక్కడ ఆమెకు సొంత ఇల్లుండేది. ఆ మధ్యకాలంలో ఆ ఇంటిని ఎవరికో అమ్మేశారు. దరిమిలా వాళ్లు ఆ స్థలంలో అపార్ట్‌మెంట్స్‌ కట్టారు. అపార్ట్‌మెంట్స్‌కి పేరు వేరే వున్నా కాంచనమాల మీద గౌరవం కొద్ది, ఆ అపార్ట్‌మెంట్స్‌ వున్న ఇంటికి 'కాంచనమాల భవన్‌' అని నామకరణం చేశారు. ''దానివల్ల ఒకనాడు ఆ నటీమణి ఇక్కడ నివసించేది అని తెలుస్తుందిగా'' అంటారువాళ్ళు.

  • ==================
Visit my website at : Dr.Seshagirirao.com

Comments

  1. Thanks a lot sir for the Life sketch on Kanchanamala. I lost my respect to Late S.S.Vasan after reading this article.

    Thanks, Regards and blessings to you
    Uma Maheswar Nakka

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

లీలారాణి , Leelarani

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni