గిరిజ (పాత) , Girija(Old)

- పాత తరం తెలుగు సినిమా హాస్య నటి. రేలంగి తో జత గా ఎన్నో పాత్రలు వేసింది. సినిమాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. మొదట్లో ఎవరు ఎలాంటి పాత్రలు ధరించినా, ఒక దశకు వచ్చేసరికి, ఎక్కడో స్థిరపడతారు. హీరోగా పరిచయమైన సత్యనారాయణ, విలన్‌గా స్థిరపడినట్టు, హాస్యపాత్రల్లో వచ్చిన వాణిశ్రీ నాయికగా స్థిరపడినట్టు, హీరోగా ప్రవేశించిన కృష్ణంరాజు విలన్‌గానూ తర్వాత మళ్లీ హీరోగానూ వచ్చినట్టు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. గిరిజ నాయికగా వచ్చినా హాస్యనటిగా మారింది. 'రేలంగి-గిరిజ జంట'కి ఎంతో పేరు. 'పరమానందయ్య శిష్యులు' కొంతకాలం నడిచినా, గిరిజకు గుర్తింపు రాలేదు.
- పేరు : గిరిజ ,
- పుట్టిన తేదీ : జూన్-1937,
- తల్లి పేరు : దాసరి తిలకం (నాటకాలలో నటించేవారు ),
- చదువు : 5 వ తరగతి ...?,
- మొదటి సినిమా : పరమానందయ్య శిస్యులకద -1950,
- తొలిరోజుల్లో ఎలా ఉన్నా, రాను రాను గిరిజ సంపన్నురాలైంది. తేనాంపేటలో ఆమెకు రెండతస్తుల భవనం, కారూ ఉండేవి. దర్జాగా, తిరుగుతూ అందర్నీ పలకరించేది. పైగదిలో రెండు ఎ.సి. రూములు కనిపిస్తూ ఉండేవి. గేటు దగ్గర కాపలా మనిషి గేటు తెరిస్తే ఆమె వచ్చేది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే- అంత విలాసంగా, దర్జాగా బతికిన గిరిజ ఎలా చితికిపోయిందో అర్థం కావడంలేదని. ఆమె ఆరోగ్యం బాగులేక, నిదానంగా సినిమాలు తగ్గాయి. భవనం, కారూ పోయాయి. దర్జాగా బతికిన రెండు, మూడు సంవత్సరాలకే ఆమె దీనస్థితికి వచ్చేసింది. సినిమా ప్రపంచంలో 'బళ్లు ఓడలు, ఓడలు బళ్లు' కావడం సహజమే. బీద స్థితి నుంచి గొప్ప స్థితికి ఎదిగినవాళ్లూ, గొప్ప స్థితి నుంచి కిందికి జారిపోయినవాళ్లూ కనిపిస్తారు. బ్యూక్ కార్లో తిరిగిన కస్తూరి శివరావు, చివరి స్థితిలో డొక్కు సైకిలు మీద తిరిగారు! అయితే, గిరిజ అంతటి దైన్య స్థితికి రావడానికి ఏవేవో కారణాలు చెప్పారుగాని, జాలిగొలిపే స్థితి. తెలిసినవాళ్ల ఇళ్లకి వెళుతూ, పాతికో, ముప్పయ్యో అడిగే స్థితి! కొందరు సినిమా వారికి అలాంటి శాపాలు తప్పవేమో!
- 1. నవ్వితే నవరత్నాలు (1951)-
- 2. పాతాళభైరవి (1951) (పాతాళభైరవి గా)-
- 3. ధర్మదేవత (1952) (వాసంతిగా)-
- 4. భలేరాముడు (1956)-
- 5. దొంగల్లో దొర (1957)-
- 6. రాజనందిని (1958)-
- 7. అప్పుజేసి పప్పుకూడు (1959)-
- 8. మనోరమ (1959)-
- 9. రాజా మలయసింహ (1959)-
- 10. రేచుక్క పగటిచుక్క (1959)-
- 11. ఇల్లరికం (1959) (కనకదుర్గ గా)-
- 12. దైవబలం (1959)-
- 13. పెళ్ళికానుక (1960)-
- 14. భట్టివిక్రమార్క (1960)-
- 15. సహస్రశిరఛ్ఛేద అపూర్వచింతామణి (1960)-
- 16. బాగ్దాద్ గజదొంగ (1960)-
- 17. ఋణానుబంధం (1960)-
- 18. కులదైవం (1960)-
- 19. ఇంటికి దీపం ఇల్లాలే (1961)-
- 20. జగదేకవీరుని కథ (1961)-
- 21. భార్యా భర్తలు (1961) (అక్కినేని మాజీ ప్రేయసిగా)-
- 22. వెలుగునీడలు (1961)-
- 23. సిరిసంపదలు (1962)-
- 24. ఆరాధన (1962)-
- 25. పరువు ప్రతిష్ఠ (1963)-
- 26. బందిపోటు (1963)-
- 27. ఈడు-జోడు (1963)-
- 28. రాముడు-భీముడు (1964)-
- 29. కలవారికోడలు (1964)--
- 30. దేవత (1965)-
- 31. ప్రేమించి చూడు (1965)-
- 32. మంగమ్మ శపథం (1965)-
- 33. నవరాత్రి (1966)-
- 34. ఆస్తిపరులు (1966).
- ==========================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog