కృష్ణవేణి-సి , krishnaveni C
-------------------------------------------------------------
పరిచయం :
- సి.కృష్ణవేణి లేదా ఎం.కృష్ణవేణీ , అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు నిర్మాత. కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య) ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగుసంప్రాదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మనదేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారకరామారావును, యస్వీ రంగారావును, మరియు నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయంచేసింది.
జీవిత చరిత్ర-ప్రొఫైల్ :
- పేరు : క్రిష్న వేణి సి./యం.
- పుట్టినతేది : 1924-
- పుట్టిన ఊరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రి.
- భర్త : తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)
కెరీర్:
- కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసినది. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కధానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కధానాయకిగా నటించంది.
పురస్కారాలు
- తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకొన్నది.
కృష్ణవేణి నటించిన సినిమాలు
- 1. సతీ అనసూయ -ధృవ (1936)
- మోహినీ రుక్మాంగద (1937)
- 2. అచ్ దేవయాని (1938)
- 3. అల్లీ పెళ్ళి (1939)
- 4. ఆహానంద్ (1939)
- 5. ఈవనజ్యోతి (1940)
- 6. దక్శాయజ్ఞాన్ (1941)
- 7. భీష్మ (1944)
- 8. బ్రహ్మరథం(1947)
- 9. మదాలస (1948)
- 10. మన దేశం (1949)
- 11. గొల్లభామ.
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
- మన దేశం (1949)
- లక్ష్మమ్మ
- దాంపత్యం (1957)
- గొల్లభామ
- భక్త ప్రహ్లాద


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog