జగ్గయ్య కొంగర-Jaggayya

కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా">తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు">పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణి">ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు.

బాల్యము మరియు యుక్త వయసు

జగ్గయ్య గుంటూరు">గుంటూరు జిల్లాలోని తెనాలి">తెనాలికి సమీపంలో దుగ్గిరాల">దుగ్గిరాల దగ్గర మోరంపూడి">మోరంపూడి అనే గ్రామంలో, 1928 డిసెంబర్ 31">డిసెంబర్ 31 ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు. విద్యార్ధిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీ">కాంగ్రేసు పార్టీ లో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపు (ఇంకా రాయలేదు)">కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపు కు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు. ఆ సమయంలో నాగపూరు">నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లోస్టైల్">సైక్లోస్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవాడు. ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభిమాని (ఇంకా రాయలేదు)">దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ (ఇంకా రాయలేదు)">ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పని చేశాడు.

సినిమాలలో

త్రిపురనేని గోపిచంద్">త్రిపురనేని గోపిచంద్ తీసిన ప్రియురాలు">ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమాలలో అరంగేట్రం చేసాడు. అయితే ఈ సినిమాగానీ, దీని తదుపరి చిత్రాలు కాని పెద్దగా విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియో ఉద్యోగానికి ఒక సంవత్సరం సెలవు పెట్టాడు. తర్వాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిశ్చయించుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. అర్ధాంగి">అర్ధాంగి మరియు బంగారు పాప">బంగారు పాప చలన చిత్రాల విజయంతో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. 1950 నుండి 1970 వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసాడు. మరణించేవరకు కూడా అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూనే ఉండేవాడు. కొన్ని చలన చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాలలో సహాయనటునిగా, హాస్య పాత్రలలో మరియు ప్రతినాయకుని పాత్రలలో నటించాడు. "కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రోటీన్ హీరో పాత్రలు సరిపోవు." అని నమ్మిన వాడు కాబట్టే ఆయన విభిన్నమైన పాత్రల మీద ఆసక్తి చూపించాడు. అలా కొన్నిసార్లు తనకు హీరో పాత్ర ఇవ్వచూపిన వాళ్లను కూడా అదే కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని అడిగేవాడు!

రాజకీయాలు

జగ్గయ్య విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలలో చాలా చురుకుగా ఉండే వాడు. కాంగ్రెస్ పార్టీ">కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషలిస్టు గ్రూపులతో సంబంధాలు కూడా ఉండేవి. వాటిని నిషేధించిన తరువాత జయప్రకాష్ నారాయణ (ఇంకా రాయలేదు)">జయప్రకాష్ నారాయణ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీ (ఇంకా రాయలేదు)">ప్రజా సోషలిస్టు పార్టీలో చేరాడు. 1956లో జవహర్‌లాల్ నెహ్రూ">జవహర్లాల్ నెహ్రూ పిలుపుకు స్పందించి, తిరిగి కాంగ్రేసులో చేరాడు. 1967లో నాలుగవ లోక్‌సభ">లోక్సభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు">ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రేసు పార్టీ తరుపున పోటీ చేసి గెలిచాడు. అలా జగ్గయ్య లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అయ్యాడు.

మరణము

2004 మార్చి 5">మార్చి 5 న 76 సంవత్సరాల వయసులో చెన్నై">చెన్నైలో గుండెపోటుతో జగ్గయ్య మరణించాడు

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani