Indraganti Srikanth Sharma-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ









పరిచయం (Introduction) :

  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ--సినిమాల్లో చక్కని పాటలు రాసిన కవి, పండితుడు, కథారచయిత, పత్రికా సంపాదకుడు,ఇంద్రగంటి శ్రీకాంతశర్మది పండిత వంశం. భాషాప్రవీణులయ్యారు. ఎమ్‌.ఎ. పూర్తిచేశాక కొంతకాలం విద్యాబోధన ఉద్యోగం చేశారు. 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో ఉప సంపాదకుడిగా, 'ఆంధ్రప్రభ' వారపత్రికకు సంపాదకుడిగా చాలాకాలం పనిచేశారు. ఎక్కువ కాలం- అంటే 20 సంవత్సరాలు ఆకాశవాణి, విజయవాడలో కార్యనిర్వాహకుడిగా పనిచేసి, ఎన్నో మంచి కార్యక్రమాల ప్రసారానికి దోహదం చేశారు. మంచి నాటకాలు, రూపకాలు రాయించి ప్రసారం చేయించారు. ఉత్తమ సాహిత్యాభిరుచిని పెంపొందించారు. ఆ సంగీత, సాహిత్య ప్రసంగాల కోసం శ్రోతలు ఉవ్విళ్లూరేవారు. నిజామాబాద్‌కు బదిలీ అయ్యాక, కొంతకాలం పనిచేసి రిటైర్‌ అయ్యారు శర్మగారు. కథలు, నాటకాలు, పాటలు, పద్యాలు, గేయాలూ ఒకటేమిటి- అన్నీ రాశారాయన. 

  జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : ఇంద్రగంటి శ్రీకాంత శర్మ,
  • చదువు : ఎం.ఎ.
  • భార్య : జానకీబాల (సుప్రసిద్ధ కథారచయిత్రి-వివాహం (1966)  ),
  • తండ్రిగారు : హనుమచ్ఛాస్త్రిగారు-
  • సంతానం : అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి విషయం అందరికీ విదితమే- మోహనకృష్ణ చలనచిత్ర దర్శకుడిగా 'గ్రహణం'లాంటి భిన్నమైన చిత్రాలు తీసి- పేరు తెచ్చుకున్నారు. ఆయన అక్క కిరణ్మయి కూడా డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు తీసి అవార్డులు పొందారు. ఇప్పుడు ఆమె కూడా చిత్రదర్శకురాలిగా రావాలని భిన్నమైన కథాంశం సిద్ధం చేసుకున్నారు.
  • నివాసము : హైదరాబాద్ ,

-పాటలు రాసిన సినిమాలు (filmography ):

  • 'కృష్ణావతారం',
  •  'నెలవంక', 
  • 'రావుగోపాలరావు',
  •  'రెండుజెళ్ల సీత',
  •  'పుత్తడిబొమ్మ', 
  • 'చైతన్యరథం' . 



Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala