Akshay Akkineni -అక్షయ్ అక్కినేని(director)










పరిచయం (Introduction) : 

  • అక్కినేని అక్షయ్ తెలుగు సినీ దర్శకుడు .3 డి. హర్రర్ సినిమా డైరెక్ట్ చేసి విజయం సాధించాడు . తాత అక్కినేని సంజీవి పేరున్న సినిమా ఎడిటర్ . తండ్రి అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఏకంగా 8 జాతీయ అవార్డ్లు అందుకున్న సినీ ఎడిటర్ . . . అలాంటి కుటుంబము లొని అక్షయ్ సినీ రంగములొకి రావడం చిత్రమేమీ కాదు గాని 27 ఏళ్ళ ఇతను ఎడిటింగ్ శాఖలో కాకుండా దర్శకత్వం లో అడుగుపెట్టడము చిత్రమే ... పైగా తొలి అడుగు హిందీ చిత్రసీమలో . అంతే కాకుండా తొలి చిత్రమే 3 డి లో. అదీ కాక ఆ సినిమా తమిళ ,తెలుగు భాషల్లో సూపర్ హిట్టయిన " పిజ్జా " కు రిమేక్ .


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : అక్కినేని అక్షయ్ , 
  • తోబుట్టువు : లేరు ... ఒక్కగానొక బిడ్డ .
  • చదువు : +2 మరియు  విజువల్ కమ్యూనికేషన్‌ లో డిప్లమో, 
కెరీర్ : 
  • పవన్‌ కల్యాణ్ " పంజా " చిత్రానికి దర్శకుడు - విష్ణువర్ధన్‌  దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ రంగప్రవేశము చేసారు.  ఆశియోస్  అనే లఘు చిత్రానిని రచన , దర్శకత్వం వహించారు. అది చూపెట్టినప్పుడు, దర్శక - రచయిత బిజయ్ నంబియార్‌కు నచ్చి, తన దగ్గర పని చేయడానికి  ముంబయ్‌కి వచ్చేయమన్నారు. ఆయన దర్శకత్వంలో ‘ఎం’ టి.వి.లో వచ్చిన ‘రష్’ అనే టీవీ షోకు కూడా సహాయ దర్శకుడిగా పనిచేశారు . ఆ పైన ఆయన దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా తయారైన ‘డేవిడ్’ అనే తమిళ, హిందీ చిత్రానికి పనిచేశారు . ఆయనే తనకి  ‘పిజ్జా’ హిందీ రీమేక్‌తో దర్శకుడిగా భారీ అవకాశమిచ్చారు.


 సినిమాలు (filmography ): 

డైరెక్టర్ గా :

  • పిజ్జా -- 2014 ,
  • అడియోస్ -- 2012, 

అసిస్టెంట్ డైరెక్టర్ గా :

  • పంజా --- 2012 , 
  • డేవిడ్ -- 2013 , 

టెలివిజన్‌ :

  • ఎం.టి.వి. రష్ (టి.వి సిరీస్ )




Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala