Friday, September 19, 2014

shobha - శోభపరిచయం (Introduction) : 

 • shoba - శోభ--నాన్న డాక్టర్‌ని చేయాలనుకున్నారు. ఆమె మాత్రం యాక్టర్‌ అవ్వాలనుకుంది. అదే చేసింది. చక్కని మాటతీరూ, ఆకట్టుకునే హావభావాలతో ఎన్నో సినిమాల్లో మెప్పించిన శోభ . 


 జీవిత విశేషాలు (profile) : 

 • పేరు : shoba - శోభ
 • ఊరు : రేపల్లె -- గుంటూరు జిలా, 
 • చరువు : డిగ్రీ , 
 • నాన్న : ఆర్టీసీ ఉద్యోగి.,
 • పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు 
కెరీర్ ప్రారంభం : తన మాటల్లో--

 • చిన్నప్పట్నుంచి టీవీ బాగా చూసేదాన్ని. స్టేజి మీద నాటకాలు వేసిన అనుభవమూ ఉంది. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మా కాలేజీకి యాంకర్‌ ఉదయభాను వచ్చి, ఈటీవీ 'హృదయాంజలి' కార్యక్రమం చేశారు. మా తరగతిలో ఎవరూ మైకు ముందు మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. నేను చొరవగా మాట్లాడా. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పా. మెచ్చుకొని వెయ్యి రూపాయల గిఫ్ట్‌ చెక్‌ ఇచ్చారు. అలానే కామెడీ నటుడు గౌతంరాజు ఓ కార్యక్రమం కోసం మా కాలేజీకొచ్చారు. నాతో చాలాసేపు మాట్లాడారు. చివరికి 'శోభా.. నువ్వు హైదరాబాద్‌ వచ్చెయ్‌, నీకు మంచి అవకాశాలు ఇప్పిస్తాను' అన్నారు. ఫోన్‌ నంబరు ఇచ్చారు. ఇదంతా చూసి నా స్నేహితులూ 'యాంకర్‌గా ప్రయత్నించొచ్చు కదా' అంటూ ప్రోత్సహించారు. కానీ అమ్మానాన్నలకు ఆ రంగం ఇష్టం లేదు. డిగ్రీ అయ్యాక ఎమ్మెస్సీ చదివిద్దాం అనుకున్నారు. అప్పుడే ఓ ఛానల్‌లో 'యాంకర్‌ కావాలనుకుంటే దరఖాస్తు పంపండి' అనే స్క్రోలింగ్‌ కనిపించింది. నా ఫొటోలు పంపా. యాంకర్‌గా అవకాశం ఇస్తున్నట్టు వారం రోజుల్లో సమాధానం వచ్చింది. వచ్చి కలవమని చిరునామా ఇచ్చారు. 

 • చెప్పకుండా ప్రయత్నించా: అమ్మానాన్నలకి ఈ విషయం చెప్పకుండా, బంధువులింట్లో సరదాగా గడిపి వస్తానని హైదరాబాద్‌ బయల్దేరా. మా బంధువు ఒకర్ని తీసుకొని ఆ చిరునామాకి వెళ్లా. కానీ అక్కడెవరూ లేరు. అంత మంచి ప్రాంతమూ కాదది. అప్పుడే గౌతంరాజుగారు గుర్తొచ్చారు. ఫోన్‌ చేస్తే ఒక చిరునామాకి రమ్మని చెప్పారు. వెళ్లా. అక్కడ ధర్మవరపు సుబ్రమణ్యంగారు డైరెక్ట్‌ చేస్తోన్న ఓ సీరియల్‌ షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడే ధర్మవరం గారు పరిచయం అయ్యారు. నాతో కాసేపు మాట్లాడాక 'మా సీరియల్‌లో ఓ హీరోయిన్‌ వేషం వేస్తారా' అని అడిగారు. సరేనన్నా. మర్నాటి నుంచి షూటింగ్‌ మొదలైంది. కామెడీ పాత్ర అది. అమ్మానాన్నల్ని బాగా కష్టపడి ఒప్పించా.
నటించిన సినిమాలు (filmography ): 

టివి.సీరియల్స్ 

 •  'శివలీలలు', 
 • 'కబ్జా,
 •  'బుచ్చిబాబు', 
 • 'లేడీస్‌ స్పెషల్‌'... 

ఇలా ఓ పది సీరియళ్లలో నటించారు . అప్పుడే జెమినీలో 'హలో బాగున్నారా' కార్యక్రమానికి యాంకరింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఈటీవీ, సిటీ ఛానల్‌ పండగలూ, ప్రత్యేక సందర్భాలప్పుడు ప్రముఖులతో కార్యక్రమాలూ, ఇంటర్వ్యూలు చేసేది .

తెలుగు సినిమాలు :

 •  'హలో యమా'.
 • 'సుల్తాన్‌', 
 • 'నర్సింహనాయుడు', 
 • 'గంగోత్రి, 'సంపంగి', 
 • 'ఆనందం', 
 • 'ఇంద్ర, 
 • 'కితకితలు', 
 • 'ఇష్టం',
 •  'ఉల్లాసంగా ఉత్సాహంగా', 
 • 'శ్రీరామదాసు'... 

ఇలా రెండొందలకుపైగా సినిమాల్లో నటించారు .

 •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog