తేజస్విని -Tejaswini (actress)







పరిచయం (Introduction) :


  • ఆనందంతో నోటమాట రాలేదు! అంటుంది నటి తేజస్వి-- తన మాటల్లో..

ఒకప్పుడు తేజస్వి దినచర్య అంటే.. రోజులో కాసేపు కాలేజీలో చదువుకోవడం.. ఆ తరవాత హెచ్‌ఎస్‌బీసీ, మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థల్లో డాన్స్‌ తరగతులు నిర్వహించడం. అలా సంపాదించిన డబ్బుని చదువు కోసం ఖర్చు చేసుకోవడం మాత్రమే. మరి ఇప్పుడు.. నటిగా చిత్రీకరణలతో బిజీ. రామ్‌గోపాల్‌వర్మ సినిమాలో కనిపించింది. 'అనుకోకుండా ఇటువైపు వచ్చినా, ఒక్కో సినిమాని వందశాతం అంకితభావంతో చేస్తున్నా' అంటూ ఇలా చెబుతోంది...
చాలామంది నాయికలు డాక్టర్‌ కాబోయే యాక్టర్‌ అయ్యామని చెబుతుంటారు. నేను మాత్రం జర్నలిస్ట్‌ కాబోయి నటినయ్యా. అవును, నాకు ముందునుంచీ జర్నలిస్ట్‌ కావాలని కోరిక. నేను సినిమాల్లోకి రావడానికి ఒకవిధంగా అది కూడా కారణమే. మా సొంతూరు కృష్ణాజిల్లా. నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తరచూ రకరకాల చోట్లకు బదిలీ అయ్యేది. అయితే నా చిన్నప్పుడే హైదరాబాద్‌కి వచ్చేయడంతో నా చదువంతా ఇక్కడే సాగింది. చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నా. క్రమంగా పాశ్చాత్య నృత్యరీతులపైనా దృష్టిపెట్టా. నా స్నేహితురాలు వాళ్లక్క ఓసారి నా గురించి తెలుకుని 'ఓ డాన్స్‌కి సంబంధించిన యాడ్‌ ఉంది.. చేస్తావా' అని అడిగింది. డాన్స్‌ అంటే చాలా ఇష్టం కావడంతో సరేనన్నా. అలా 7అప్‌ ప్రకటనకు పని చేసే అవకాశం వచ్చింది. అదీ అల్లు అర్జున్‌తో కలిసి. తరవాత డాబర్‌ గులాబరీ నిర్వహించిన పోటీలో సెకండ్‌ రన్నరప్‌గా, మిస్‌ హైదరాబాద్‌గా ఎంపికయ్యా. ఈ టైటిల్‌ కన్నా నేను చేసిన డాన్స్‌ ప్రకటనే సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది.

ఆ డబ్బుతో ఫీజు కట్టొచ్చనుకున్నా: నేను చదివింది సెయింట్‌ ఫ్రాన్సిస్‌లో. డిగ్రీ వరకూ అక్కడే. కాలేజీలో టామ్‌బాయ్‌ తరహాలో ఉండేదాన్ని. కాసేపు కాలేజీలో ఉండేదాన్ని. మధ్యాహ్నాలూ లేదా సాయంత్రాలు డాన్స్‌ తరగతులు తీసుకునేదాన్ని. ట్విస్ట్స్‌ అండ్‌ టర్న్‌ సంస్థలో, బాబా సెహగల్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏడాదిన్నరపాటు తరగతులు తీసుకున్నా. నాసర్‌ స్కూల్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, హెచ్‌ఎస్‌బీసీ, విప్రో వంటి చోట్లా డాన్స్‌ క్లాసులు చెప్పా. వచ్చిన డబ్బుని నా చదువూ, పాకెట్‌ మనీ కోసం వాడుకునేదాన్ని. ఒకపక్క తరగతులు తీసుకుంటూనే మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేశా. అయితే సినిమాల్లోకి రావాలనీ, నటిగా స్థిరపడాలనీ నేనెప్పుడూ అనుకోలేదు. డిగ్రీ అయ్యాకే నా దృక్పథం మారింది. డిగ్రీ పూర్తయ్యాక సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మే చేసేందుకు సీటొచ్చింది. అప్పుడే 'సీతమ్మవాకిట్లో..'లో నటించమంటూ అవకాశం వచ్చింది. సినిమాలో నటిస్తూ పీజీ చేయొచ్చనుకున్నా. అప్పుడు ఒక్క సినిమా చేద్దాం అనుకుని ముఖానికి మేకప్‌ వేసుకున్నా. కానీ అది విడుదలయ్యాక వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఆ రోజు మరవలేను: 'సీతమ్మ వాకిట్లో..'లో నేను సమంతతో కలిసి చేశా. నా పాత్ర నిడివి తక్కువే. కానీ మొదటి సినిమాలోనే ప్రముఖ నటులతో చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సమంతా కూడా 'నువ్వు అందంగా ఉంటావు. నటనను కొనసాగించు' అని తరచూ చెప్పేది. అందులో నాకూ, మహేష్‌బాబుకీ మధ్య ఓ సన్నివేశం ఉంటుంది. అది చేస్తున్నప్పుడు ఎంత ఆనందించానో చెప్పలేను. నేను చదువుకుంటున్నప్పుడు 'ఖలేజా' విడుదలైంది. ఆ రోజు మాకు పరీక్ష. దాన్ని రాస్తే ఐదు పాయింట్లు ఇస్తారు. అలాంటివాటిల్లో ఎప్పుడూ ముందుండే నేను 'ఖలేజా' కోసం ఆ పాయింట్లను వదులుకున్నా. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిపోయా. అలాంటిది మహేష్‌తో కలిసి ఓ పాత్ర చేశానంటే అంతకంటే ఆనందం ఉంటుందా? మామూలుగా నేను ఎక్కువగానే మాట్లాడతా. కానీ తనని మొదటిసారి చూసినప్పుడు నాకసలు నోటమాట రాలేదంటే నమ్మండి..

స్నేహితులు గోలచేశారు: రెండో సినిమా 'హార్ట్‌ఎటాక్‌' కూడా నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను టిక్కెట్లు కొని నా స్నేహితుల్ని థియేటర్‌కి తీసుకెళ్లా. తెరపై నితిన్‌, అదాశర్మ పేర్లు వచ్చినప్పుడు మౌనంగా ఉన్న నా ఫ్రెండ్స్‌, నా పేరు రాగానే మాత్రం పెద్దగా అరిచారు. తెరపై నేను కనిపించగానే హాలంతా మారుమోగేలా ఈలలు వేసి గోల చేశారు. తరవాత 'మనం'. అది చేశాకే రామ్‌గోపాల్‌ వర్మ 'ఐస్‌క్రీం'లో అవకాశం వచ్చింది. ఇప్పుడు 'లవర్స్‌'లో చేస్తున్నా.


  • అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి: మా కాలేజీలో మిస్‌ పాపులర్‌ అనే పోటీ ఉండేది. దానికి నాతో కలిపి ఇరవైమంది దరఖాస్తు చేసుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఎవరికి ఎక్కువ లైక్‌లొస్తే వాళ్లే విజేత. మిగిలిన వారికి మూడొందలూ ఐదొందల లైక్‌లొచ్చాయి. నాకు పదిహేనొందల లైక్‌లు. దాంతో ఆ పోటీలో నేనే గెలిచా. డాన్స్‌తో పాటూ బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ వంటి ఆటలు.. పాటలూ డిబేట్‌లలో చురుగ్గా పాల్గొనేదాన్ని. వీటిల్లో ఎలా ఉన్నా చదువులో మాత్రం మంచి మార్కులొచ్చేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లతో డాన్స్‌ శిక్షణ ఇచ్చే అవకాశం లేదు కానీ నేను మాత్రం రోజూ ప్రాక్టీస్‌ చేస్తుంటా. ఖాళీ దొరికితే ట్రెక్కింగ్‌ చేస్తా. ఎత్తయిన కొండలు కనిపిస్తే, గబగబా ఎక్కేందుకు ప్రయత్నిస్తా.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : తేజస్విని , 
  • సొంత ఊరు : క్రిష్ణాజిల్లా - ,
  • చదువు : మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో డిగ్రీ 


నటించిన సినిమాలు (filmography ):

  • సీతమ్మ వాకిట్లో సినిమల్లె చెట్టు  , 
  • హార్ట్ ఎటాక్ , 
  • మనం , 
  • ఐస్ క్రీమ్‌ ,
  • లవర్స్ , 

 *==============================*

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala