Parineeti Chopra-పరిణీతి చోప్రా









పరిచయం (Introduction) :

  • రానా సరసన పరిణీతి చోప్రా?

పరిణీతి చోప్రా.. బాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న హాట్‌గాళ్‌ .... ప్రియాంకచోప్రా కజిన్‌గా పరిశ్రమకి పరిచయమైనా తనదైన మార్కుతో దూసుకుపోతోంది.  'లేడీ వర్సెస్‌ రికీ భల్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైందీ భామ. ..శుద్‌ దేశీ రొమాన్స్‌ విజయం సాధించడంలో ఈ అమ్మడి ట్యాలెంటు ఎక్కువ ఉపయోగపడింది. అందుకే ఆ తర్వాత వరుసగా దర్శక-నిర్మాతలు వెంటపడుతున్నారు. వీలుంటే ఓ తెలుగు సినిమా చేయడానికి కూడా ఈ అమ్మడు సిద్ధమేనని చెప్పింది. సరైన స్క్రిప్టు నా వద్దకు వస్తే నటించడానికి రెడీ అని పలుమార్లు చెప్పింది. అయితే ఆ టైమ్‌ ఇప్పుడు రానే వచ్చిందని టాలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానా హీరోగా ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూరి ఓ సినిమా తెరకెక్కించనున్నారని అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక కోసం వెతుకుతున్నారిప్పుడు. తొలుత శృతిహాసన్‌ నటిస్తుందని ప్రచారమైంది. శృతిహాసన్‌ తెలుగు, తమిళ్‌, హిందీ మూడు చోట్లా తెలుసు కాబట్టి మూడు పరిశ్రమల్లో బిజినెస్‌ పూర్తవుతుందని భావించి ఎంపిక చేయాలనుకున్నారు. అయితే లేటెస్టుగా ఆ ఛాన్స్‌ పరిణీతిని వరించిందని తెలుస్తోంది.

  • ప్రిన్స్ మహేశ్‌బాబు అంటే టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ స్టార్స్‌కి ఎంతో మక్కువ. అతనితో నటించడానికి తారలు ఉబలాటపడుతుంటారు. ఇప్పుడు పరిణీతి చోప్రా కూడా ఇలాగే తన మనసులో మాటను బయటపెట్టింది.‘ఇష్క్ జాదే’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ ‘హసీతో ఫసీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్.. సౌత్‌లో తన ఫేవరేట్ హీరో మహేశ్‌బాబు అని తెలిపింది. అవకాశం వస్తే అతనితో నటించాలనుందని పేర్కొంది. తెలుగులో వీళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. అందువల్ల పరిణీతి మరీ ఆరాటపడుతోంది. మరి ప్రిన్స్ ఏమంటాడో !



 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : పరిణీతి చోప్రా , 
  • పుట్టిన తేదీ : 22-అక్టోబర్-1988,
  • పుట్తిన ఊరు : అంబాల -హర్యానా, 
  • మాతృభాష : పంజాబీ, 
  • చదువు : ఎం.బి.ఎ.-లండన్‌ లో,
  • తండ్రి : పావన్‌ చోప్రా-బిజినెస్ మ్యాన్‌ (మిలటరీ కి సామానులు సప్లై చేసేవారు),
  • తల్లి : రీనా చోప్రా ,
  • తోబుట్టువులు : ఇద్దరు సోదరులు -- shivang & Saraj,
  • బందువులు : ప్రియాంక చోప్రా, మీరా చోప్రా, 


నటించినహిందీ సినిమాలు (filmography ):

Films


  • Year Title -- Role -- Notes
  • 2011 Ladies vs Ricky Bahl-- Dimple Chaddha
  • 2012 Ishaqzaade-- Zoya Qureshi
  • 2013 Shuddh Desi Romance-- Gayatri
  • 2014 Hasee Toh Phasee-- Meeta Solanki
  • 2014 Daawat-e-Ishq-- Gulrez "Gullu" Qadir
  • 2014 Kill Dil-- Disha --


  •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala