Kalpika Ganesh-కల్పిక గణేష్





  • మూలము : ఈనాడు వసుందర-05-ఆగస్ట్ -2014.


పరిచయం (Introduction) :

  • ఒకప్పుడు కాలేజీ టాపర్‌. తరవాత యానిమేషన్‌ కోర్సు చేసింది. అదయ్యాక ఓ సంస్థలో ఉద్యోగం. అయినా ఏ అవకాశం ఎప్పుడు, ఎందుకు వస్తుందో తెలియదు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ దిశగా కష్టపడాలి. అప్పుడే మరిన్ని అవకాశాలు వస్తాయి. 'నేను అదే చేశాను' అంటోంది కల్పిక గణేష్‌. సహాయనటిగా 'సీతమ్మవాకిట్లో..' 'జులాయి' లాంటి సినిమాల్లో నటించి.. నాయికగా చేసే స్థాయికి చేరుకుంటుMdi.
  • ప్రయాణము - తెలుగు సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశము అయినది. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : కల్పిక గణేష్ (Kalpika Ganesh),
  • ఊరు : హైదరాబాద్ , 
  • నాన్న : గణేష్(ప్రభుత్వ ఉద్యోగి  , 
  • అమ్మ : ఇందుమతి (గృహిణి), 
  • చదువు : బి.ఎస్సి , మల్టీమీడియా(కంప్యూటర్ ),
  • తోబుట్టువులు : ఒక అన్నయ్య , 
  • ఉద్యోగము : at “Value Labs”, Hitech City.
  • నచ్చిన నటీనటులు : Kajol Devgan and Sridevi.

కెరీర్ :
  • ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకు బూగీవూగీ షోకి సంబంధించి హైదరాబాద్‌లో ఆడిషన్లు జరిగాయి. దాన్లో పాల్గొనేందుకు వెళ్లా. ఆ నిర్వాహకుల టీంలో చంద్రశేఖర్‌ యేలేటి గారి ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. ఆయన నన్ను చూసి 'సినిమా అవకాశం ఉంది చేస్తారా' అని అడిగారు. అమ్మకు చెప్పా. ప్రయత్నించమంది. ఆడిషన్‌కి వెళ్లా. అప్పటికి నాకసలు తెలుగు వచ్చేది కాదు, సినిమాలపై అవగాహన అసలే లేదు. సినిమాలు తెలుసా లేదా అని అడిగారు. కొన్ని చూడమన్నారు. అలాగే చేశా. కొన్ని రోజులు శిక్షణ ఇప్పించారు. అది జరిగిన వారం రోజులకు మలేషియా షూటింగ్‌కి వెళ్లాం. అక్కడ దాదాపు యాభై అయిదు రోజులున్నాం. అలా 'ప్రయాణం'తో సినిమాల్లోకి అడుగుపెట్టా. అప్పుడు ఉద్యోగం చేస్తున్నా. మా యాజమాన్యం అనుమతి ఇవ్వడంతో సెలవు పెట్టి షూటింగ్‌కి వెళ్లా. ఆ సినిమాలో సహాయ నటిగానే కాదు దర్శకత్వ విభాగంలోనూ పనిచేశా. అది ఇంకా విడుదల కాలేదు.. ఇంతలో 'నమో వెంకటేశ'లో అవకాశం. త్రిష ఫ్రెండ్‌గా. అదయ్యాక 'ఆరెంజ్‌'. 'ప్రయాణం'లో నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఫిలింఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యా. ఉత్సాహం వచ్చింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని అనిపించింది.

నటించిన సినిమాలు (filmography ):


  • ప్రయాణము ,
  • నమో వెంకటేశ్ ,
  • ఆరెంజ్ , 
  • నిప్పు ,
  • సారొచ్చారు , 
  • ఇట్స్ మై లవ్ స్టోరీ , 
  • ఎందుకంటే ప్రేమజంట , 
  • జులాయి , 
  • సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , 
  • మనసు గతి ఇంతే , 
  • ఓం శాంతి , 
  • శ్రీ రామాలయం , 


  • Courtesy with: Eenadu news paper 05-08-2014

  • *==============================*


 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala