Tuesday, July 1, 2014

Vanya Mishra-వన్య మిశ్రా (actress)
పరిచయం (Introduction) : 


 • 2012వ సంవత్సరానికి గాను  ఫెమినా ఆధ్వర్యంలో జరిగిన అందాలో పోటీల్లో మిస్‌ ఇండియా వరల్డ్‌ టైటిల్‌ను ఛండీగఢ్‌కు చెందిన వన్య మిశ్రా సొంతం చేసుకుంది.తుది ఎంపికలో భాగంగా జనరల్‌ నాలెడ్జ్‌ వంటి ఇతర్రతా అంశాలపై న్యాయ నిర్ణేతలు ప్రశ్నించారు. వన్య మిశ్రా 2011వ సంవత్స రం మిస్‌ ఇండియా వరల్డ్‌ పోటీల్లో పాల్గొనందుకుగానూ ఆమెకు ఫైనల్‌ ఎంట్రీ లభించింది.ఫైనల్‌ పోటీలో వెయ్యి మందికి ఉపాధి కల్పించడం లేదా వెయ్యి మంది చిన్నారులకు విద్యనివ్వడంలో దేనిని ఎంచుకుంటారనే ప్రశ్నకు వన్య మిశ్రా.. వెయ్యి మంది చిన్నారులకు విద్య అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు వీలవుతుందని బదులివ్వడంతో మిస్‌ ఇండియా వరల్డ్‌ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది.

 జీవిత విశేషాలు (profile) :  

 • పేరు : వన్య మిశ్రా,
 • వయస్సు : 19 సంవత్సరాలు,
 • ఎత్తు : 5 అడుగుల 7 అంగుళాలు,
 • జన్మస్థలం : జలంధర్‌,
 • ప్రస్తుత నివాసం : చండీగఢ్‌,
 • వృత్తి : విద్యార్థి,
 • కాలేజ్‌ : పీఈసీ యూనివర్సిటీ  ఆఫ్‌ టెక్నాలజీ,
 • చదువు : ఇంజనీరింగ్ ,
 • హాబీలు : బ్యాడ్మింటన్‌, సంగీతం వినడం, డాన్స్‌, పుస్తక పఠనం,


చిట్‌చాట్‌

 • missమీకు బాగా ఆనందాన్ని కలిగించేవి?
మంచి పార్టీ, సంగీతం, లక్ష్యం సాధించడం
 • ఏ చట్టాన్ని ఉల్లంఘించదల్చుకున్నారు?
పెళ్ళయిన తరువాత కూడా మా కుటుంబంతోనే కలసి ఉండాలనుకుంటున్నాను.
 • మిస్‌ ఇండియా టైటిల్‌ సాధించారుగా...ఇక ఏం చేయదల్చుకున్నారు?
మొదట నాకెంతో ఇష్టమైన ఆడి కారు కొంటాను
 • మీకు నచ్చిన వాణిజ్య ప్రకటన సందేశం?
మీరు గనుక మెక్‌ డొనాల్డ్‌‌స నుంచి బర్గర్‌ కొంటే, మీరు మెక్‌ గార్గరస్‌ అవుతారు
 • ప్రతీ మహిళకూ ఉండాల్సిన లక్షణాలు
స్పందించేతత్వం, నిజాయితీ, తెలివితో కూడిన అందం
 • మీరు కోరుకునే మూడు గొప్ప విజూలు
మా అమ్మ గర్వపడేలా చేయడం, నేను సాధించిన దానితో సంతృప్తి చెందడం, ఫెమినా మిస్‌ ఇండియా కావడం
 • ఇప్పటి వరకూ మీరు టేస్ట్‌ చేయనిది
ఆరెంజ్‌ పరాటా
 • ఏ సినిమా చూసి మీరు చివరిసారిగా బాధపడ్డారు?
రంగ్‌ దే బసంతి
 • ఒక పురుషుడిలో మీరు ఎలాంటి లక్షణాలను చూస్తారు?
ఇతర మహిళలతో అతడి ప్రవర్తన, దయ, తెలివి
 • ఏ తార సోలో పర్‌ఫార్మన్స్‌ను ఇష్టపడుతారు?
షారూఖ్‌ ఖాన్‌. అసలైన వినోదాన్ని ఆయన అందిస్తారు.
 • మీ గురించి మీరు విన్న క్రేజీ వదంతి?
జీరో సైజ్‌ కోసం నేను ఆహారం తీసుకోవడం మానేశానని
 • ఓ వ్యక్తి మీకు సరైన జోడీ అని ఎలా నిర్ణయించుకుంటారు?
ఈ విషయంలో నా మనస్సు మాట వింటాను. సరైన జోడీని నా మనస్సే నిర్ణయిస్తుంది.
 • ఏ సెలబ్రెటీతో కలసి సెలవులను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారు?
రోజర్‌ ఫెదరర్‌
 • అనుబంధం సరైనదో కాదో తేల్చుకునేందుకు వివాహానికి ముందు కొంతకాలం కలసి జీవించడం సరైనదని భావిస్తున్నారా?
వ్యక్తిగతంగా నేను దానికి వ్యతిరేకం. ఆ వ్యక్తితో జీవించాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు ఆయనను వివాహం చేసుకుంటాను.
 • యువతకు మీరిచ్చే సందేశం?
మీపై మీరు నమ్మకం కలిగిఉండాలి. మీరు మంచి చేస్తే, మీకు మంచే జరుగుతుంది.
 • మీ శరీరం గురించి మీరేమనుకుంటున్నారు?
నేనెవరినో తెలియజెప్పేది అదే. దాన్ని నేను ఆరాధిస్తాను. ఆరోగ్యవంతంగా ఉంచుకుంటాను.
 • ఓ పురుషుడిలో బాగా ఆకట్టునేది... :చిరునవ్వు
 • అభిమాన నటి?           :ప్రియాంక చోప్రా
 • నచ్చిన సినిమా?    :డ్యూ డేట్‌


నటించిన సినిమాలు (filmography ): 


 • షేర్'  ('కత్తి' ఫేం మల్లిఖార్జున్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'షేర్' టైటిల్ తో రూపొందుతోన్న సినిమా .)

 • మూలము : సూర్య దినపత్రిక -April 1, 2012.
 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog