Monday, July 21, 2014

Sunny Leone - సన్నీలియోన్


పరిచయం (Introduction) : 

 • సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ నీలి చిత్రాల నటి. జిస్మ్ 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించి వార్తల్లోకెక్కిన ప్రముఖ తార.ఇండో-కెనడియన్ శృంగార తార సన్నీలియోన్.

 • తెలుగులో ఒక స్పెషల్ సాంగ్‌ని ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ చేశారు. హీరో జై, కలర్స్ స్వాతి జంటగా కలిసి నటించిన సినిమా..కుల్ఫీ.హీరో జై, కలర్స్ స్వాతి జంటగా కలిసి నటించిన "వడకరి" చిత్రాన్ని తెలుగులో "కుల్ఫి" పేరుతో ప్రముఖ నిర్మాత నరసింహారెడ్డి సామల.. తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఓ స్పెషల్ సాంగ్‌ని పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫస్ట్‌టైమ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు అడగు పెట్టి నర్తించారు. 
 •  జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Sunny Leone - సన్నీలియోన్,
  • పుట్టిన ఊరు : కెనడా,
  • తండ్రి : టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడు .
  • తల్లి : హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు.
  • హాబీలు : పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్,


  కెరీర్ : 

  సన్నీలియోన్ తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈ తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13 న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్నీలియోన్ చిన్నతనంలో పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్ట పడేది. చిన్నతనం నుండి సన్నీలియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. పదకొండు ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ తొలి ముద్దును రుచిచూసింది . పద్నాలుగేళ్ళ వయసులో నానమ్మ ఒత్తిడి వీరు కుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు కాలిఫోర్నియాకు వెళ్ళారు. పదహారేళ్ళ వయసులో తన బాయ్ ఫ్రెండ్ కు కన్యత్వాన్ని అర్పి చింది.

  యుక్తవయసుకు వచ్చిన సన్నీలియోన్ మోడల్ గా ఎదగాలనుకుంది. 1999 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఈ దశలో వివస్త్రణ అవుతూ నాట్యం చేసే మరో యువతి పరిచయమైంది. తన ద్వార్ జాన్ స్టెవెన్స్ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. అతని ద్వారా పురుషుల పత్రిక అయిన పెంట్ హౌస్ లో పనిచేసే 'జె అలెన్' ను ముఖాముఖి కలిసిన తర్వాత ఎడల్ట్ ఇండస్ట్రీ పై అపోహలు తొలగిపోయాయి. క్రమేణా చెరి, హై సొసైటి, స్వాంక్, లెగ్ వరల్డ్, హస్లర్, క్లబ ఇంటర్నేషనల్ వంటి అడల్ట్ పత్రికల్లో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చింది. 2003 సంవత్సరానికి 'పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెల్చుకొంది. 2005 లో నీలి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా ఎ.వి.యన్ అలల్ట్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. తర్వాత స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. ఇటీవల 2011 లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశమందుకొన్నది. జిస్మ్ 2 ఈమె మొదటి హీందీ చిత్రం. -- Wikipedia-Telugu.


  పోర్న్ తారగా ప్రఖ్యాతి పొంది, తర్వాత బాలీవుడ్ తారగా మారిన సన్నీలియోన్ కూడా కొన్ని విలువల్ని పాటిస్తుందంటే నమ్ముతారా! కానీ ఇది నిజం. ఇటీవల ‘హేట్‌స్టోరి 2’ చిత్రం షూటింగ్ లొకేషన్లో సన్నీలియోన్ ప్రవర్తనే అందుకు నిదర్శనం. వివరాల్లోకెళ్తే- ‘హేట్ స్టోరి 2’ కోసం సన్నీలియోన్‌తో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు దర్శకుడు విశాల్ పాండ్య. ముంబయ్‌లోని ఓ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే... లొకేషన్లో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారట. అప్పటిదాకా డాన్స్‌లో నిమగ్నమైన సన్నీకి ఉన్నట్లుండి ఆ పిల్లలు కంట పడ్డారు. అంతే... పెద్దగా కేక వేసిందట సన్నీలియోన్. లొకేషన్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత సన్నీ తేరుకొని, ‘‘ముందు ఆ పిల్లల్ని బయటకు పంపేయండి. నేను చేస్తోంది ఐటమ్‌సాంగ్. వారి ముందు అలా చేస్తే ఎలా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది’’ అనేసిందట. వెంటనే... ప్రొడక్షన్ వాళ్లు అప్రమత్తమై పిల్లల్ని బయటకు పంపేశారట. పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీ ఇలా విలువలు పాటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.saakshi news paper15-07-2014

  ‘జాక్‌పాట్’ చిత్రంలో హాట్ హాట్ సీన్లతో ప్రేక్షకులను ఆకర్షించిన సన్నీలియోన్‌పై బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ దృష్టిపడింది. తనకు ఆరోగ్యం సహకరించకున్నా... సన్నీలియోన్, సచిన్‌జోషి నటించిన ‘జాక్‌పాట్’ చిత్రం ప్రీమియర్‌కు షారుక్ హాజరవ్వడం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. భవిష్యత్తులో అన్నీ కుదిరితే సన్నీలియోన్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తానని షారుక్ చెప్పారు.
  saakshi news paper15-07-2014

  నటించిన సినిమాలు (filmography ): 

  • హీరో జై, కలర్స్ స్వాతి జంటగా కలిసి నటించిన సినిమా..కుల్ఫీ.
  • కరంటు తీగ -- మంచు మనోజ్ తో (2014),


   *==============================* 

  visiti my website > Dr.Seshagirirao-MBBS. 

  No comments:

  Post a Comment

  Your comment is necessary for improvement of this blog