Sunday, July 13, 2014

Sri priya - శ్ర్రీప్రియ (actress cum Director)
పరిచయం (Introduction) :

 • Sri priya - శ్ర్రీప్రియ  ఒక నాటి మేటి నటి ... ఇప్పుడు సినీ దర్శకురాలు .

 జీవిత విశేషాలు (profile) : 

 • పేరు : Sri priya - శ్ర్రీప్రియ,
 • పిల్లలు : పాప స్నేహ. అబ్బాయి నాగార్జున్‌.


కెరీర్ :

 • తన మాటల్లో .....మాది కళాకారుల కుటుంబం. నేను చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నా. నా నాట్యం చూసిన దర్శకుడొకాయన ఓ చిన్న సినిమాలో అవకాశమిచ్చారు. పాత్ర చిన్నదే అయినా అది నన్ను దర్శకుడు కె.బాలచందర్‌ దృష్టిలో పడేలా చేసింది. 'అంతులేని కథ' తమిళ వెర్షన్‌లో కథానాయికకి చెల్లెలి పాత్ర అది. కమల్‌హాసన్‌తో కలిసి నటించాలి. అప్పటికే ఆయన పెద్ద స్టార్‌! కొంత భయంతోనే నటించాను. కానీ ఆ నటన బాలచందర్‌గారికి ఎంతగానో నచ్చిందని తర్వాత తెలిసింది. తెలుగు 'అంతులేని కథ'కి... తమిళంలో నటించిన వాళ్లెవర్నీ ఆయన తీసుకోలేదు. ఒక్క నన్నూ, కమల్‌హాసన్‌ని తప్ప! కమల్‌కి వేరే పాత్ర ఇచ్చారు కానీ నాకు మాత్రం పాత పాత్రే ఇచ్చేశారు. బాలచందర్‌ అంతటి వారు నాపై పెట్టిన ఆ నమ్మకం నాకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అంతేకాదు.. తరవాత తన సహాయకుడు ఏరంకి శర్మ తీసిన 'చిలకమ్మ చెప్పింది'లో అతి ప్రధాన పాత్రనీ నా చేతే చేయించారు. తెలుగులో నేను చేసిన తొలి పూర్తి స్థాయి పాత్ర అదే. అలా నా కెరీర్‌ తెలుగులోనే మలుపు తిరిగింది.


వయసు పిలిచింది... మరిచిపోలేను
తెలుగు, తమిళంలో కథానాయికగా చిత్రాలు వరుసకట్టాయి. తమిళంలో రజనీకాంత్‌తో నాయికగా అత్యధిక చిత్రాలు చేసిన రికార్డు నాదే! తెలుగులో చిరంజీవితో 'కాళీ'... తరవాత వచ్చిన 'వయసు పిలిచింది' నేను మరిచిపోలేని చిత్రాలు. కె.రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో 'ఆమె కథ' ఓ కొత్త అనుభవం. హీరోలతో డ్యూయెట్‌లు పాడటమే కాదు... హీరోయిన్‌ ప్రధాన చిత్రాల్లో నటించే అవకాశమూ నాకొచ్చింది. 'పొట్టేలు పున్నమ్మ' ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా 'అవళ్‌ అప్పడిత్తాన్‌'(తను అంతే మరి!) అనే తమిళ చిత్రం గురించి చెప్పుకోవాలి! కమల్‌, రజనీకాంత్‌ ఇద్దరితోనూ కలిసి నటించానందులో. దక్షిణాది సినిమాల్లో ఇంతవరకూ వచ్చిన అతి ముఖ్యమైన స్త్రీ పాత్రల్లో ఇదీ ఒకటని చెబుతారు! తమిళంలోని వంద ఉత్తమ చిత్రాల్లో ఒకటి కూడా! ఇలా కెరీర్‌ మొదలైన 15 ఏళ్లలోనే మూడు భాషల్లో మూడొందల చిత్రాలు చేశాను.

జయసుధ మా ఇంట్లోనే ఉంటుంది..!
సినీ పరిశ్రమలో రాధిక నా బెస్ట్‌ ఫ్రెండ్‌! నా బాల్య స్నేహితురాలు తను. నా కష్టసుఖాలన్నీ పంచుకునేది తనతోనే. ఇప్పటికీ చిన్నప్పటిలా నన్ను తను సరదాగా 'ఆలూ' అనే పిలుస్తుంది. మీకో విషయం చెప్పాలి. నా పెళ్లి చెన్నైకి సమీపంలోని ఓ గుడిలో జరిగింది. ఉదయం ఆరుగంటలకి ముహూర్తమైతే.. నేనూ, రాధికా నాలుగ్గంటలకే వెళ్లిపోయి సరదాగా కబుర్లు చెప్పుకొన్నాం. శివాజీగణేశన్‌ వాళ్లబ్బాయి ప్రభు, జయసుధ, జయప్రద అందరూ నాకు చాలా ఆత్మీయులు! జయసుధ ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇంట్లోనే ఉంటుంది. అన్నట్టు మా ఆయన రాజ్‌కుమార్‌ సేతుపతి కూడా నా బాల్యమిత్రుడే! ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకున్నాక.. ఆ అవగాహన జీవితాంతం ఉంటుందనిపించాకే ఏడడుగులు వేశాం.

చిత్రలేఖనం ద్వారా సేవ!
ఒకస్థాయి తర్వాత నేను చిత్రాలకు దూరమయ్యా. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మూస పాత్రలు చేయడం నాకు నచ్చలేదు! దాంతో చిత్రలేఖనం వైపు దృష్టిపెట్టా. నేను గీసిన చిత్రాలతో ప్రదర్శనలూ నిర్వహించా. వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుని అనాథ పిల్లల సంక్షేమానికి ఇవ్వడం మొదలుపెట్టా! నిజానికి నా కళకి అదే నిజమైన సార్థకత అనిపించేది. నేను సినిమాలకు దూరమైనా మా వారు మలయాళంలో నటిస్తూనే ఉన్నారు. నేను పూర్తిగా పిల్లల్ని చూసుకోవడానికే పరిమితమయ్యా. మా పాప స్నేహ. అబ్బాయి నాగార్జున్‌. వాళ్లు పెద్ద వాళ్లయ్యాకే మళ్లీ చిత్ర పరిశ్రమపై దృష్టిపెట్టా. ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ మహిళ ఉంటుందంటారు. ప్రతి మహిళ విజయం వెనుకా ఓ కుటుంబం ఉంటుందని నా నమ్మకం! నా రెండో ఇన్నింగ్స్‌లో నటిగా.. దర్శకురాలిగా రాణిస్తున్నానంటే ఆ కుటుంబమే కారణం మరి! అందుకే.. 'దృశ్యం' చిత్రం ప్రచార బాధ్యతలున్నా కూడా మా పాప చదువు కోసం ఇప్పుడు స్పెయిన్‌ వచ్చాను. హైదరాబాద్‌లో ఉంటూ 'దృశ్యం' విజయాన్ని ఆస్వాదించడం ఆనందంగానే ఉంటుంది కానీ.. మా పాప చదువు కోసం ఇక్కడ నేనుండక తప్పట్లేదు!

అలా మెగాఫోన్‌ పట్టా..!

 • సినిమా పరిశ్రమలో పనిచేసే చాలామంది కల దర్శకత్వం చేయడమే! నేనూ అంతే! దర్శకురాలిగా పాతికేళ్ల కిందటే మెగాఫోన్‌ పట్టాను. మోహన్‌, వూర్వశి జంటగా ఓ సినిమా తీశా. తరవాత 'నీయా' అనే హారర్‌ చిత్రానికి కొనసాగింపు రూపొందించాను. మధ్యలో 'చిన్నపాప.. పెద్దపాప' అనే సీరియల్‌లో కామెడీ నాయికగా చేస్తే... స్పందన అదిరిపోయింది. ఉత్సాహంతో వరుసగా ఐదు సీరియళ్లకీ, రెండు కన్నడ సినిమాలకీ దర్శకత్వం వహించా. ఆ తర్వాతే, సమాజంలోని అకృత్యాలకు బలైన ఓ అమ్మాయి తన పగ తీర్చుకునే కథతో 'మాలినీ 22-విజయవాడ' రూపొందించా. దాని క్త్లెమాక్స్‌లో నాయిక నిత్యామీనన్‌ వెళ్లగక్కే ఆవేశం.. ఆక్రోశం నావే! ఈలోపు మలయాళంలో 'దృశ్యం' విడుదలై, విజయం సాధించింది. దాని హక్కులు మేం కొన్నాం. తమిళంలో కమల్‌హాసన్‌ చేయడానికి ముందుకొచ్చారు. మరి తెలుగులో?వెంకటేష్‌ అంచనాలు మించిపోయాడు..!


నటించిన సినిమాలు (filmography ):

 • మూడు భాషల్లో మూడొందల చిత్రాలు చేశారు .
 •  'అంతులేని కథ'
 • 'చిలకమ్మ చెప్పింది'
 • వయసు పిలిచింది.
 • చిరంజీవితో 'కాళీ',
 •  'ఆమె కథ' ,
 • పొట్టేలు పున్నమ్మ',
దర్శకత్వం ;
 • 'దృశ్యం
 • 'నీయా' అనే హారర్‌ చిత్రానికి,
 • 'చిన్నపాప.. పెద్దపాప' అనే సీరియల్‌,
 • 'మాలినీ 22-విజయవాడ' ,

 •  *==============================* 
visiti my website > Dr.Seshagirirao-MBBS. 

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog