S.Bhavanarayana-యస్‌.భావనారాయణ, D.B.Narayan-డి.బి.నారాయణ





పరిచయం (Introduction) : 

యస్‌.భావనారాయణ, డి.బి.నారాయణ, నిర్మాతలు కాకముందు కె.యస్‌.ప్రకాశరావు గారి స్టూడియోలో నిర్మాణ వ్యవహారాలు చూసేవారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ బయటికి వచ్చి, 'బండరాముడు' (1959) మరికొన్ని చిత్రాలు కలిసి తీశారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా కంపెనీలు పెట్టారు. దినవహి భాస్కర నారాయణగారు డి.బి.ఎన్‌. ఫిల్మ్స్‌, సరిదె భావనారాయణగారు మహేశ్వరి, కౌసల్యా పేర్లతో చిత్రాలు నిర్మించారు.

భావనారాయణగారి తొలి సినిమా 'రమాసుందరి' (1960) అయితే, 'పెండ్లి పిలుపు' (1961) డి.బి.నారాయణరావు గారి తొలిచిత్రం. భావనారాయణగారు ఎక్కువగా జానపదాలు నిర్మిస్తే, నారాయణగారు సాంఘికాలే నిర్మించారు. (ఇద్దరి చిత్రాల్లోనూ నేను నటించాను) భావనారాయణగారి సమర్పణలో వై.వి.రావు నిర్మాతగా 'పాల మనసులు' తీశారు. (యస్‌.ఆర్‌.పుట్టణ్ణ దర్శకుడు) ఇందులో నేను నటించాను. ముఖ్యమైన పాత్రే. భావనారాయణగారికి ఓ అలవాటుంది. సినిమా పూర్తయిపోయిన తర్వాత నటులకు ఇవ్వవలసిన చివరి దఫా పారితోషికాన్ని, ఉంచేయమంటారు. ''ఇది నా దగ్గర వుండనీయండి. మీకు ఇవ్వాలన్న జ్ఞాపకం వుంటుంది. తర్వాత సినిమాలో మీకు వేషం వుంటుంది. అప్పుడు ఇస్తాను' అనేవారు. ఆయన ''బలే ఎత్తు-చివరికి చిత్తు'' (దర్శకుడు: వేదాంతం రాఘవయ్య) (1970) తీసినప్పుడు, నేను, నా భార్య అందులో నటించాము. మొత్తం షూటింగ్‌ మైసూరులో జరిగింది. మేము తిరిగి వస్తున్నప్పుడు, (మైసూరు నుంచి బెంగళూరు కారు, బెంగళూరు నుంచి మద్రాసుకి రైలు) దారి ఖర్చులకి, ఇంటికి చేరడానికీ అని, 500 ఇచ్చారు. ఖర్చులన్నీ కాగితం మీద రాసి, 106 రూపాయిలు మిగిల్తే, నేను భావనారాయణగారి ఆఫీసుకి వెళ్లి- ఆయనకి అందజేశాను. ''ఏమిటి- ఇంత కచ్చితంగా వున్నారు?'' అని ఆ డబ్బులు తీసుకున్నారు. ''మీ ఇద్దరికీ ఇంకా కొంత డబ్బు ఇవ్వాలి. మీరు కచ్చితంగా వున్నారు గనక, నేనూ కచ్చితంగానే వుంటాను. మళ్లీ సినిమా మొదలు పెడతాను. మీ పారితోషికం ఎక్కువ చేసి, అప్పుడు ఇదీ అదీ కలిపి అంతా చెల్లించేస్తాను. మీరిద్దరూ వుంటారు ఆ సినిమాలో'' అన్నారు. ''సంతోషం'' అన్నాను. దురదృష్టం- 'బలే ఎత్తు చివరికి చిత్తు' తర్వాత, భావనారాయణగారు అసలు సినిమాయే తియ్యలేదు!

జీవిత విశేషాలు (profile) : 

  • Names : S.Bhavanarayana-యస్‌.భావనారాయణ, D.B.Narayan-డి.బి.నారాయణ

నటించిన సినిమాలు (filmography ):


  • 'బండరాముడు' (1959)
  • మహేశ్వరి, 
  • కౌసల్యా,
  •  'రమాసుందరి' (1960) , 
  • 'పెండ్లి పిలుపు' (1961) 

Courtesy with : patabangaram by Ravi Kondalarao@eenadu news paper

 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala