Nadhiya(zareena)-నదియా(జరీనా)








పరిచయం (Introduction) : 

  • సాధారణంగా వృత్తిలో ప్రమోషన్లు ఉంటాయి. సినిమారంగంలో కూడా సహ నటి, సహాయ నటి వంటి వేశాలు..ఆ తరువాత కొంచె వయసు ముదిరాక అక్క, వదిన వేశాలు..ఆ తరువాత అమ్మ, అత్త పాత్రలు వేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుండో సినిమారంగంలో ఉంటూ వస్తున్నదే. బజారు రౌడీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయిన తమిళ, మళయాళ నటి నదియా ఆ తరువాత ఓ తండ్రి ఓ కొడుకు అనే తెలుగు సినిమా చేసిన తరువాత తెరమరుగయింది. 1994లో ఈ సినిమా వచ్చిన తరువాత ఆమె ఆ తరువాత కనిపించలేదు. పెళ్లి చేసుకుని కుటుంబ వ్యవహారాలు ఊసుకుంటూ ఉండిపోయింది.


అయితే ఆ తరువాత మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్  మొదలు పెట్టిన నదియా ఈ సారి తెలుగులో దూసుకుపోతుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించిన నదియా ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించింది. ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సాధిండంతో నదియాకు ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వయసు పెరిగినా గ్లామర్ తగ్గకపోవడంతో అత్త, అమ్మ పాత్రలు చేస్తున్న నదియాకు ప్రిన్స్ మహేష్ బాబుకు సోదరిగా నటించే అవకాశం లభించింది. శ్రీనువైట్ల – మహేష్ బాబుల కాంబినేషన్ లో వస్తున్న ‘ఆగడు’ సినిమాలో నదియాది కీలకపాత్ర అని సమాచారం. ఒక టైంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఊపేసిన నదియా చాలా కాలం తర్వాత మళ్లీ బిజీ అయిపోతుంది. నదియా 'మిర్చి'లో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి మార్కులనే కొట్టేసింది. ఈ సినిమా చూసిన వారు నదియాకు ప్రత్యేకంగా మార్కులు వేశారు. దీంతో తెలుగులో మరో ఆఫర్ లభించింది.

  • నదియా మలయాళంలో కూడా రెండు సినిమాలను చేస్తుంది. ఆ సినిమాలలో కూడా నదియా ఆధునిక మహిళగానే కనిపించనుందట. ఇలా మొత్తానికి నదియ ఫుల్ బిజీగా మారనుంది.
 జీవిత విశేషాలు (profile)

  • పేరు : జరీనా , 
  • సినిమా పేరు : నదియా మోయిడు , 
  • పుట్తిన ఊరు : ముంబై లో మలయాళీ కుటుంబము లో పుట్టేరు .
  • తండ్రి : ముస్లిం - మోయ్దు (from Thalassery), 
  • తల్లి : హిందూ -లలిత -(from Tiruvalla) , 
  • తోబుట్టువు : ఒక చెల్లి -హసీనా, 
  • భర్త : Godbole(maharastra),
  • పిల్లలు : ఇద్దరు కూతుళ్ళు --సనం , జనా, 
  • నివాసము : ముంబై (2014), 



నటించిన తెలుగు సినిమాలు (filmography ): 

  • 1988--బజారు రౌడి (శిరీష),
  • 1989-- వింత దొంగలు ,
  • 1994 -- ఓ తండ్రి ఓ కొడుకు , 
  • 2013 -- మిర్చీ(లత ),
  • 2013--ఆత్తారింటికి దరేదీ(సునంద ),
  • 2014 -- ఆగడు (TBA),
  • 2014 -- దృశ్యం (గీతా ప్రభాకర్),

 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala