Kausik(Old Telugu cine actor)- కౌశిక్‌ (పాతతరము తెలుగు నటుడు)








పరిచయం (Introduction) : 



  • ఒక సినిమాలో నటిస్తూ మధ్యలో మానేసిన అనుభవం అక్కినేని వారికి వుంది. ఏవీయమ్‌ వారు ఇంకొక సంస్థ 'సదారమ' పేరుతో 1956లో ' అని ఒక చిత్రం నిర్మించారు. ఇందులో ముందు నాయక పాత్రధారి నాగేశ్వరరావు. ఆయన ఆ పాత్ర ధారణకు ఒప్పుకున్నప్పుడున్న తీరు, చిత్రీకరణ సమయంలో లేదని, అది 'దొంగ' పాత్ర అనీ- తాను ఆ పాత్ర ధరించననీ తీర్మానించుకుని, ఏవీయమ్‌ అధినేత చెట్టియార్‌ని కలిసి చెప్పేశారు. ''నాకు మీరు ఇచ్చిన అడ్వాన్సు, నేను నటించినప్పుడు షూటింగ్‌ ఖర్చులూ అన్నీ తిరిగి ఇచ్చేస్తాను. నన్ను మన్నించండి'' అన్నారు పెద్ద మనసుతో. చెట్టియార్‌ సరే అని, ''ఐతే, నువ్వు ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఉండనీ, ఇంకో సినిమాకి ఉపయోగించుకుంటాను'' అన్నారు. 'భూ కైలాస్‌' (1958) తీసినప్పుడు నారదుడి పాత్ర వెయ్యమని నాగేశ్వరరావును అడిగి, పారితోషికం సర్దుబాటు చేశారు చెట్టియార్‌. అక్కినేని వారు 'సదారమ'లో మానేసిన తర్వాత, ఆయన ఎత్తుతో వున్న కౌశిక్‌ అనే నటుడిని పెట్టి చిత్రం పూర్తి చేశారు. నాయిక షావుకారు జానకే- మార్పులేదు. ఐతే ఆ చిత్రం విజయసాధన చెయ్యలేదు- కౌశిక్‌కు పేరూ రాలేదు. అంతకుముందు కౌశిక్‌కి పి.పుల్లయ్యగారు తీసిన 'ధర్మదేవత' (1952)లో నటించిన అనుభవం వుంది. అంతకుమించి, కౌశిక్‌ మళ్లీ ఇంకెక్కడా నటించినట్టు తెలియడం లేదు. రెండే రెండు సినిమాల్లో ముఖ్యపాత్రధారి అయినా, కౌశిక్‌ రాణించలేకపోయారు.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : కౌశిక్‌.


నటించిన సినిమాలు (filmography ): 


  • ధర్మదేవత'
  • సదారమ'

మూలము : పాత బంగారము / రావి కొండలరావు  @ ఈనాడు సినిమా న్యూస్ .

  •  *==============================* 


visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala