Monday, June 16, 2014

Samshuddhin Ibrahim,శ్యాం , శంషుద్దీన్‌ ఇబ్రహిం
పరిచయం (Introduction) :

 • కిక్‌ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై తొలిసినిమా 'కిక్‌'నే తన పేరు ముందు చేర్చుకున్న నటుడు శ్యాం. ఓ పక్క తమిళ్‌లో హీరోగా బిజీగా ఉంటూనే, తెలుగులో ప్రధాన పాత్రల్లో అదరగొడుతున్నాడు. 'రేసుగుర్రం'లో 'రామ్‌'గా దూసుకొచ్చి, ఇక్కడి అభిమానుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. అప్పుడు... నాలుగేళ్లు కాళ్లరిగేలా తిరిగినా అవకాశాలు లేవు. ఇప్పుడు... అన్ని భాషల్లోనూ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.

 జీవిత విశేషాలు (profile) : 

 • సినిమాల్లో పేరు ; శ్యాం , 
 • అసలు పేరు : శంషుద్ధీన్‌ఇబ్రహీం, 
 • సొంత ఊరు : మధురై (తమిళ నాడు),
 • చదువు : బి.కాం ,
 • భార్య్ : కాషిష్‌ (పంజాబీ కాలేజీ లోఉన్నప్పుడు ప్రేమించి పెళ్ళిచేసుకునారు),
 • పిల్లలు : కూతురు - సమైరా ,
 • తండ్రి : గాజులు వ్యాపారము ,
 • ఎత్తు : 6 అడుగులు , 

కెరీర్ : 

 • డిగ్రీ చదువుతూనే మోడల్‌గా పనిచేశాడు. చదువైపోయాక ముంబైలోని రోహన్‌ తనేజా యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. సినిమాలకు తనను తాను మానసికంగా సిద్ధం చేసుకున్నాక చెన్నై వచ్చి అవకాశాల వేట మొదలుపెట్టాడు. ముందు ఓ పది మంది దర్శకుల జాబితా సిద్ధం చేసుకున్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాళ్లను కలిసి తీరాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఏం ఉపయోగం! అందరినీ కలిసినా ఒక్క అవకాశమూ రాలేదు.  • చెన్నైలో తెలిసిన మోడలింగ్‌ ఏజెంట్‌ ద్వారా శ్యాం దర్శకుడు జీవాను కలిశాడు. అతనికి తన గురించి ఇంగ్లిష్‌లో చెప్పడం మొదలుపెట్టాడు. 'ఇప్పుడు చెప్పిన విషయాల్నే తమిళంలో చెప్పు' అని దర్శకుడు అడగడంతో అలాగే చేశాడు. వెంటనే 'నువ్వే నా సినిమాలో హీరో' అనేశాడు జీవా. అలా నాలుగేళ్ల నిరీక్షణ కేవలం రెండు నిమిషాల్లో ముగిసింది. '12 బి' పేరుతో విడుదలైన ఆ సినిమా విజయవంతమై, శ్యాంకు ఆఫర్ల పంట పండించింది. 

 • వరసగా తమిళ సినిమాల్లో నటించాక తొలిసారి కన్నడ సినిమాలో 'శ్యాం'కు అవకాశం వచ్చింది. అతను నటించిన 'ఇయర్‌కాయ్‌' సినిమాకు జాతీయ అవార్డూ దక్కింది. 'కిక్‌' సినిమా కోసం తొలిసారి మీసాలతో చేసిన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర తెలుగులో అతణ్ని 'కిక్‌'శ్యాంగా నిలబెట్టింది. ఆ తరవాత 'కల్యాణ్‌రామ్‌ కత్తి', 'వూసరవెల్లి', 'క్షేత్రం', 'యాక్షన్‌ త్రీడీ', 'రేసుగుర్రం' లాంటి సినిమాల్లో వరసగా నటించాడు. 

   • సినిమాలమీద విపరీతమైన ప్రేమతో పరిశ్రమలో అడుగుపెట్టిన శ్యాం, పాత్రల కోసం ఎంత రిస్క్‌ చేయడానికైనా వెనకాడడు. దానికి ఉదాహరణే '6 క్యాండిల్స్‌' అనే తమిళ సినిమా. అందులో ఓ పాత్ర కోసం ఏకంగా పన్నెండు రోజులు తిండీ నిద్రా మానేశాడు. తరవాత షూటింగ్‌కి వెళ్తే దర్శకుడితో సహా ఎవరూ అతణ్ని గుర్తుపట్టలేదు. కళ్లు ఉబ్బిపోయి నీరసంగా కనిపించాడు మరి! దానికితోడూ ఏడాది పాటు పెంచిన గడ్డం, మీసాలు. 'నేనే శ్యాంని' అని అతను చెప్పాక యూనిట్‌ సభ్యులందరికీ ముచ్చెమటలు పట్టాయట. అతను మామూలు మనిషి కావడానికి వారం రోజులు పట్టింది. 
   • శ్యాం కెరీర్‌లో హిట్‌లూ, ఫ్లాప్‌లూ సమానంగా ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా అన్ని దక్షిణాది భాషల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 'ఆరో తరగతిలో నేను ఫెయిలయ్యాక స్కూల్‌ మార్చేయమని నాన్నను అడిగా. సమస్యల నుంచి పారిపోవడం మంచి లక్షణం కాదనీ, ధైర్యంగా పోరాడాలనీ నాన్న చెప్పారు. స్నేహితుల వెక్కిరింతలూ, టీచర్ల చివాట్లూ అన్నీ భరించా. అప్పట్నుంచీ గెలుపోటములను వేర్వేరుగా చూడటం మానేశా. మొన్నీమధ్య అదే స్కూల్‌ 150వ వార్షికోత్సవానికి నన్ను ముఖ్యఅతిథిగా పిలిచారు. ఎంత గర్వంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను' అంటాడు శ్యాం.

   నటించిన సినిమాలు (filmography ):

   •  'కిక్‌' 
   • 'కల్యాణ్‌రామ్‌ కత్తి', 
   • 'వూసరవెల్లి', 
   • 'క్షేత్రం', 
   • 'యాక్షన్‌ త్రీడీ', 
   • 'రేసుగుర్రం'  


   • Source : courtesy with Eenadu News paper.15-06-2014
    *==============================* 

   visiti my website > Dr.Seshagirirao-MBBS. 

   No comments:

   Post a Comment

   Your comment is necessary for improvement of this blog