Kanchi Narasimharao,కంచి నరసింహారావు








పరిచయం (Introduction) :


  • 'చినమాయను పెదమాయ.. పెదమాయను పెనుమాయ.. అటు స్వాహా.. ఇటు స్వాహా.. ఎరుగకుండ వచ్చావు... ఎరుకలేక పోతావు... ఇదె వేదం... ఇదె వేదం.. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ..'
  • ఈ పాట వినగానే 'మాయా బజార్‌' (1951) గుర్తొస్తుంది. ఘటోత్కచుడు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు ఒక వృద్ధుడిగా మారువేషం వేసుకుని ఆటపట్టించడం సన్నివేశం. ఈ సినిమాను ఎన్నోసార్లు చూసినవాళ్లు కూడా, ఈ సన్నివేశంలో వృద్ధుడిగా నటించిన ఆ పాత్రధారి ఎవరు? అని అడుగుతూ ఉంటారు. ఆ ఒక్క దృశ్యంలో వచ్చినా, ఆ పాత్రకు అంతటి ప్రాధాన్యత, రాణింపూ వచ్చాయి. ఆయన పేరు కంచి నరసింహారావు. 1934 నుంచి సినిమాల్లో ఉన్నారని చెబితే ఆశ్చర్యం వేస్తుంది. 1935లో వచ్చిన 'హరిశ్చంద్ర'లో ఆయన కాలకౌశికుడిగా నటించారు. అలా అక్కడా అక్కడా నటిస్తూ వచ్చారేగాని, పెద్దగా పేరు రాలేదు. ఆయన రంగస్థలం మీద మంచి నటుడు. ఆయన రూపురేఖల దృష్ట్యా అలాంటి పాత్రలకే పిలిచేవారు. ఏవియమ్‌ తీసిన 'జీవితం' (1950)లో మంచి పాత్రలో కనిపించారు. 'దొంగరాముడు'లో (1955) కనిపిస్తారు. అలా కనిపించే వేషాలతోనే తన జీవితాన్ని లాక్కొచ్చారు. ఆయనది స్వచ్ఛమైన, స్పష్టమైన భాష. వేదం చదివే రీతిలో- 'మాయాబజార్‌'లో ''అటు నేనే ఇటు నేనే; చిన చేపను పెదచేప; చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!'' అని ఆయన చెప్పిన సంభాషణల్ని ఇవాళ అందరూ చెబుతూ ఉంటారు. నాటి నుంచి సినిమానే నమ్ముకుని, వచ్చిన ఏదో పాత్ర ధరిస్తూ కాలం గడిపారు. ఎంత ఆర్జిస్తారు? ఏం ఆర్జిస్తారు?... అలా ఎందరో మంచి నటుల్ని సినిమా నిండుగా పోషించలేకపోయింది. అయితే ఏం- ఒక్క 'మాయాబజార్‌' పాత్రతో- మంచి పేరు తెచ్చుకుని చరిత్రలో నిలబడిపోయారు కంచి నరసింహారావు


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : Kanchi Narasimharao,కంచి నరసింహారావు



నటించిన సినిమాలు (filmography ):

  • 'మాయా బజార్‌' (1951) 
  • 'జీవితం' (1950)
  • దొంగరాముడు'లో (1955) 
  • 1935లో వచ్చిన 'హరిశ్చంద్ర'

మూలము : పాతబంగారము / రావికొండలరావు .

 *==============================* 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala