Tuesday, January 28, 2014

Veerabhadram(cine director),వీరభద్రమ్(దర్శకుడు)


పరిచయం (Introduction) : 


 •   ''వినోదాన్ని నమ్ముకుంటే తిరుగుండదనేది నా నమ్మకం. నేను ఇదివరకు తీసిన రెండు చిత్రాల్లోనూ వినోదానిదే అగ్ర తాంబూలం. మూడోసారి కూడా ఆ సూత్రంతోనే ప్రయాణం చేశా'' అంటున్నారు వీరభద్రమ్‌. 'అహనా పెళ్లంట', 'పూలరంగడు' సినిమాలతో విజయాలు సొంతం చేసుకొన్న దర్శకుడీయన. నాగార్జునతో 'భాయ్‌' తెరకెక్కించారు. 


''సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడే నాగార్జునగారిని దృష్టిలో ఉంచుకొని రకరకాల కథలు రాసుకొనేవాణ్ని. ఆయనతో 'భాయ్‌' పేరుతో ఒక సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండేది. ఆ అవకాశం నాకు ఇప్పుడు దొరికింది. వినోదం, యాక్షన్‌ అంశాలతో మిళితమైన చిత్రమిది. నాగార్జున లాంటి ఒక స్టార్‌ కథానాయకుడిని తెరపై ఎలా చూడాలనుకొంటారో... అలాగే చూపించాను. 'హైదరాబాద్‌లో రెండు ఫేమసు. ఒకటి ఇరానీ ఛాయ్‌... రెండు ఈ భాయ్‌' తరహా సంభాషణలు చాలా ఉంటాయి. ఈ సినిమా పేరు, సంభాషణల గురించి చెప్పగానే నాగార్జున 'ఈ సినిమా చేస్తున్నాం' అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆయన ఈ సినిమా చేయడమే కాదు... సొంతంగా నిర్మించడానికి ముందుకు రావడం కూడా ఓ గొప్ప అనుభూతినిచ్చింది. తొలి అడుగులు వేస్తున్న నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌లాంటి ఓ సంస్థలో సినిమా తీయడం గర్వంగా ఉంది. ప్రేక్షకుడు ప్రతీ సన్నివేశాన్ని ఆస్వాదించేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. తొలి కాపీ చూశాక నాగార్జునగారు ఎంతో మెచ్చుకొన్నారు. ఆయన ఇందులో పోషించిన పాత్ర మూడు కోణాల్లో సాగుతుంది''.

నమ్మకం కల్పించారు...: ''స్టార్‌ కథానాయకుడితో సినిమా చేయడం ఒక భిన్నమైన అనుభవం. నాకు అప్పటికే రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. నాగార్జునలాంటి స్టార్‌ కథానాయకుడితో మాత్రం పనిచేయలేదు. అందుకే 'భాయ్‌' చిత్రీకరణకోసం తొలి రోజు సెట్‌కి వెళ్లినప్పుడు కాస్త కంగారుపడ్డాను. కానీ నాగార్జునగారు ఎంతో స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించారు. నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఒక నటుడిగా, నిర్మాతగా నాకు ఏమేం కావాలో అవన్నీ సమకూర్చారు. నా కష్టాన్ని చూసి భుజం తట్టారు. ఒక పెద్ద కథానాయకుడితో సైతం అలవోకగా సినిమాని తీయొచ్చనే నమ్మకాన్ని నాలో కల్పించారు నాగార్జున. 'హలోబ్రదర్‌', 'కింగ్‌' తదితర చిత్రాల్లో ఆయన పంచిన వినోదం చూసి నేను మరింత ఆత్మవిశ్వాసంతో ఈ సినిమాని తీర్చిదిద్దా''.


 • ఇ.వి.వి.స్ఫూర్తితో...: ''తీసింది రెండు సినిమాలే అయినా... తెరపై వినోదాల్ని పండించడంలో పట్టున్న దర్శకుడనే పేరు నాకు లభించింది. నాపై అది మరింత బాధ్యతని పెంచింది. ఇ.వి.వి.సత్యనారాయణగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాను. వినోదాత్మక సన్నివేశాలను తెరకెక్కించడంలో ఆయనే నాకు స్ఫూర్తి. ఎలాంటి నేపథ్యంతో నేను సినిమాలు తీసినా... వినోదాన్ని మాత్రం మరిచిపోను. థియేటర్‌కి వచ్చే ప్రతీ ప్రేక్షకుడు కోరుకొనే అంశం అదే. 
మూలము : ఈనాడు సినిమా న్యూస్ ..25-10-2013.

 జీవిత విశేషాలు (profile) : 

 • పేరు : వీరభద్రం చౌదరి , 
 • ఊరు : కలువలపల్లి -పశ్చిమ గోదావరి జిల్లా, 
 • పుట్టిన తేదీ :
 • తండ్రి : ముళ్ళ పూడి సూర్యారావు  -వసాయము , 
 • తల్లి : సత్యవతి - గృహిణి , 
 • చదువు : బి.కాం ,యం.బి.ఎ,
 • తోబుట్టువులు : అన్నయ్య -శ్రీనివాస్ , తమ్ముడు -సోమసుందరం ,


నటించిన సినిమాలు (filmography ):

దర్శకుడుగా


 • భాయ్ , 
 • పూలరంగడు , 
 • అహ నా పెళ్ళంట , 


రచయితగా :

 • భాయ్ , 
 • పూలరంగడు , 
 • అహ నా పెళ్ళంట ,  • ==========================

visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog