Nagarajarao.V-నాగరాజారావు.వి.








పరిచయం (Introduction) :



  • ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, నేపథ్య గాయని ఎస్‌.జానకి చెల్లెలి భర్త వి.నాగరాజారావు(76) కన్నుమూశారు. మంగళవారం ఉదయం 4.40 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. నాగరాజారావుకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 'నర్తనశాల'లో సహదేవుడి పాత్రలో రాణించారు. 1966లో 'రంగుల రాట్నం' చిత్రంలో విజయనిర్మలకు జంటగా నటించిన నాగరాజారావు రంగస్థల నటుడిగా ఎనలేని ఖ్యాతిని పొందారు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. రావికొండలరావు రచించిన నాటకాలలోని ప్రధాన పాత్రలకు ప్రాణం పోసి ఆ నాటకాలకు ఖ్యాతిని సంపాదించిపెట్టారు. చెన్నై నగరంలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఒక కార్యక్రమం నిమిత్తం కేరళలో ఉన్న ఎస్‌.జానకి మంగళవారం ఉదయం నాగరాజారావు నివాసానికి చేరుకున్నారు. వూర్వశి శారద తదితరులు నాగరాజారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : వి.నాగరాజారావు , 
  • వృత్తి : ప్రముఖ రంగస్థల & సినీ నటుడు,
  • భార్య : శారద , 
  • పిల్లలు : 3 కుమార్తెలు , 1 కుమారుడు 
  • నివాసము : చెన్నై , 
  • మరణము : 21-01-2014 మంగళవారము ఉదయం 4.40 గం.


నటించిన సినిమాలు (filmography ): 

  •  'నర్తనశాల'
  • రంగుల రాట్నం'



  • Courtesy with - న్యూస్‌టుడే, చెన్నై@eenadu 22-01-2014

  • ==================================
visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala