Harini - హరిణి (Singer)

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి పాపులారిటీ సంపాదించిన గాయనీమణులలో హారిణి ఒకరు. హారిణి సినీగీతాలతో పాటు శాస్ర్తీయ సంగీతాధారిత అనేక పాటలను పాడారు. తెలుగు, హిందీ, కన్నడ, మళయాళంలో అనేక పాటలు పాడినా తమిళంలో పాడిన పాటలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అనేక ప్రముఖ, వర్ధమాన సింగర్స్‌తో పాడిన హారిణి నేపధ్యగాయకుడు టిప్పును వివాహం చేసుకున్నారు.
  • ఘర్షణ చిత్రంలో ‘అందగాడా అందగాడా’ అనే పాట తెలుగు సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. నేటికీ ఈ పాటను వింటే నాడు వచ్చిన ఫీలింగ్‌ నేటికీ కలుగుతుంది. ఇది సాహిత్య మహిమా లేదా స్వర మాయా అనే సందేహం వస్తే రెండింటికి మార్కులు ఇచ్చి పాటను ఎంజాయ్‌ చేయమని చెబుతారు ఆ పాటను పాడిన సింగర్‌ హరిణి. నరసింహా నాయుడులో ‘లక్స్‌పాపా’ వంటి ఫాస్ట్‌ బీట్‌ పాడిన హరిణి గుడుంబా శంకర్‌లో ‘ఎమంటారో ’, 100 % లవ్‌లో ‘తిరుతిరు గణనాథా’ అంటు, ఖుషి చిత్రంలో ‘చెలియా చెలియా’ వంటి పాటలలో తన స్వరంతో పాటకు ప్రాణం పోశారు. తెలుగు, తమిళ కన్నడ , మళయాలి పరిశ్రమలో బిజీ బిజీగా ఉన్న హరిణి .
జీవిత విశేషాలు (profile) : 
  • పూర్తి పేరు  : హారిణి
    పుట్టిన తేది  : 30 ఎప్రిల్‌ 1979
    జన్మస్థలం   : చెనై్న, తమిళనాడు
    వృత్తి   : నేపథ్య గాయనీ,
    కెరీర్‌ ప్రారంభం  : 1995
    తొలి తెలుగు పాట  : చందమామ (రావోయి చందమామా)
    తాజా పాట  : జియజలే (బాడీగార్డ్‌)
కెరీర్ : 

బాల్యం నుంచే సంగీతాసక్తి
  • హారిణి 1979 ఎప్రిల్‌ 30న చెనై్నలో జన్మించారు. ఆమె ప్రము శాస్ర్తీయ కళాకారులు రాధా విశ్వనాధన్‌, గౌరీల వద్ద కర్నాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. తరువాత సుధా రఘునాధన్‌ వద్ద శిక్షణ తీసుకునాన్నరు. ప్రస్తుతం సుగుణా పురుషోత్తమన్‌ వద్ద శిక్షణను తీసుకుంటున్నారు. చిన్న నాటి నుంచే సంగీతమంటే ప్రత్యేకాభిమానం కలిగిన హారిణి పాఠశాల స్థాయిలో జరిగిన అనేక పోటీలలో పాల్గొని విజయం సాధించారు. ఒక సారి ప్రముఖ మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎ.ఆర్‌. రహ్మాన్‌ ఆమెకు స్వయంగా బహుమతిని అందించి ఒక సారి రికార్డింగ్‌ ట్రయల్‌ కోసం ఆమెను స్టూడియోకు ఆహ్మానించి రికార్డింగ్‌ చేయించారు.

టర్నింగ్‌ పాయింట్‌
  • ఎ ఆర్‌ రహ్మాన్‌తో వాయిస్‌ రికా ర్డింగ్‌ జరుగుతున్న సమయం లోనే ప్రముఖ నటి సుహాసినీ మణిరత్నం ఆమెను ఇందిరా చిత్రంలో నీల కైగరాతు అనే చిత్రంలో పాడించారు. దీంతో హారిణి సినీ సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. ఈ పాట పాడే సమయంలో హారిణి వయసు కేవ లం 13 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత ఆమె ఎక్కడా వెను తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎందరో ప్రముఖ సంగీత దర్శకుల సారధ్యంలో నేటి వరకు హారిణి 2000కు పైగా సినీ గీతాలను ఆలపిం చారు. అందులో తమిళ పాటల సంఖ్య మిగితా వాటికన్నా ఎక్కు వే. అనేక రంగస్థల ప్రదర్శనలు ఇచ్చిన హారిణి ప్రదర్శన సమ యంలో ఎలాంటి రిఫరెన్స్‌ లేకుండా పాడటం విశేషం. పాడిన భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం

నటించిన సినిమాలు (filmography ): 
 తెలుగులో...

  • సం ----పాట -------చిత్రం
  • 1998  చందమామ  రావోయి చందమామా
  • 1999 హిమసీమలో అన్నయ్య  
  • 2000 లక్స్‌ పాప  నరసింహా నాయుడు
  •  చెలియ చెలియా ఖుషి
  •  ఎక్కడ ఎక్కడ మురారి
  •  ఉన్నమాట చెప్పనీవు నువ్వు నాకు నచ్చావు
  • 2001 చందమామా బావ నచ్చాడే
  • 2002 తలతలమని లుసుకోవాలని
  • 2004 అందగాడా అందగాడా ఘర్షణ
  •  ఎమంటారో  గుడుంబా శంకర్‌
  • 2005 ఓ ప్రేమ  టెన్త్‌క్లాస్‌
  • 2008 నా ప్రేమా  ఉల్లాసంగా ఉత్సాహంగా
  • 2010 నమ్మకం ఇయ్యరా కొమరం పులి
  •  మిలమిలమని బావా
  • 2011 తిరుతిరు గణనాథా 100% లవ్‌
  •  జియజలే  బాడీగార్డ్‌
 మూలము : http://lingaswamyhyd.blogspot.in/ + wikipedia.org/
  • ==============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala