E.V.V.Giri-ఈ.వీ.వీ. గిరి








పరిచయం (Introduction) :

  • ప్రముఖ స్టిల్‌ఫొటోగ్రాఫర్‌, ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి (50) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన వూపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. పశ్చిమగోదావరి జిల్లాలోని దొమ్మేరులో జన్మించిన ఈవీవీ గిరి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇష్టం ఏర్పరచుకొన్నారు. సోదరుడు ఈవీవీ సత్యనారాయణతో కలసి జంధ్యాల దర్శకత్వంలో కొన్ని చిత్రాలకు పనిచేశారు. ఓ వైపు ఈవీవీ సహాయ దర్శకుడిగా రాణిస్తుంటే, అవే సినిమాలకు జంధ్యాల దగ్గర స్టిల్‌ఫొటోగ్రాఫర్‌గా బాద్యతలు నిర్వహించారు గిరి. 'భార్యాభర్తలు', 'చంటబ్బాయ్‌', 'జయమ్ము నిశ్చయమ్మురా' ఇలా జంధ్యాలతో ఆయన ప్రయాణం కొనసాగింది. ఈవీవీ దర్శకుడిగా మారిన తరవాత దాదాపు ప్రతీ సినిమాకీ గిరి స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా సేవలు అందించారు. మొత్తమ్మీద దాదాపు 80 చిత్రాలకు పనిచేశారు. గిరి మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. గురువారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : గిరి.ఈ.వి.వి.,
  • పుట్టిన ఊరు : దొమ్మేరు - పశ్చిమ గోదావరి జిల్లా, 
  • నివాసము : హైదరాబాద్ , 
  • పిల్లలు : ఒక కొడుకు , ఒక కూతురు, 
  • వృత్తి : స్టిల్‌ఫొటోగ్రాఫ
  • మరణము : 21-01-2014 మద్యాహ్నం , 


  స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా- కొన్ని సినిమాలు (filmography ): 

  • 'భార్యాభర్తలు', 
  • 'చంటబ్బాయ్‌',
  •  'జయమ్ము నిశ్చయమ్మురా'


Courtesy with : Eenadu cinema news.22-1-2014
  • ==============================

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala