A,R.Rehana-ఎ.ఆర్.రెహాన (సింగర్ , సంగీత దర్శకురాలు)

  •  
  •  

పరిచయం (Introduction) :
  •      చూసిన వారెవరికయినా ఇట్టే అర్థమైపోతుంది ఆమె ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సోదరి అని! ప్రతిభ, సేవాగుణంలోనూ తమ్ముడికేం తక్కువ కాదు. గాయనీ, సంగీత దర్శకురాలూ, పాటల రచయిత్రీ, ఆర్జే... వీటితో పాటూ 'రెయిన్‌డ్రాప్స్‌' స్వచ్ఛంద సంస్థకి ప్రచార కర్త. మహిళా సాధికారత, బాలికా విద్యపై పనిచేస్తున్న రెహనా ఆ వివరాలను ఇలా చెబుతున్నారు.

'కడసారి వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు' మణిరత్నం 'అమృత'లోని పాట. శ్రీలంక నుంచి మనదేశానికి శరణార్థులు కట్టుబట్టలతో వలస వచ్చే సన్నివేశం. మాతృభూమితో అనుబంధాన్ని వదులుకుని వచ్చే ఆ సందర్భం గురించి దర్శకుడు చెప్పారు. ఓసారి కళ్లు మూసుకుని, ఆ దృశ్యాన్ని తలుచుకున్నా! మాతృభూమిని వదిలివెళ్లడం అంటే మన వేర్లని మనమే బలవంతాన తెంపుకోవడం. ఇది తలుచుకోగానే ఒక్కసారిగా ఆ దృశ్యం తాలూకు భావోద్వేగం... అది 'కడసారి వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు..' పాట రూపంలో బయటికొచ్చింది. కళ్లు తెరిచేసరికి ఎదురుగా మణిరత్నం గారు. 'అద్భుతంగా పాడావమ్మా..' అంటూ ప్రశంసించారు. ఆయన అలా అన్నాక, ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్న మా తమ్ముడు రెహ్మాన్‌ 'ఆవిడ మా అక్కయ్య' అంటూ నన్ను పరిచయం చేశారు.

తెలుగులో ఆటపట్టించేదాన్ని...
మా నాన్న సంగీత దర్శకులు కావడంతో మా ఇంట్లో ఎటు చూసినా ఆ వాతావరణమే కనిపించేది. పాటా, సంగీతం నాకు తెలియకుండానే ఇష్టమైనవిగా మారిపోయాయి. సంగీతం నేర్చుకొంటూ, సమయం దొరికినప్పుడల్లా పాడేదాన్ని. స్కూల్లోనూ ప్రదర్శనలిచ్చేదాన్ని. పాటలే కాదు... ఆటలూ బాగా ఆడేదాన్ని. ఖోఖోలో రాష్ట్ర స్థాయి పోటీల దాకా వెళ్లా. నాకు పూర్తి విరుద్ధం రెహ్మాన్‌. బయట ఆడే ఆటలకి తను దూరం. మేం ఇంట్లోనే క్యారమ్స్‌, చెస్‌ ఆడుకునే వాళ్లం. నాకో తెలుగు స్నేహితురాలు ఉండేది. తనతో కలిసి తెలుగు నేర్చుకుని, ఎవరినయినా ఆటపట్టించాలంటే అప్పుడు తెలుగులో మాట్లాడేదాన్ని.

అందుకే ఆ విరామం...
సంగీతంలో రెహ్మాన్‌ ఓ బ్రాండ్‌. చిన్నప్పుడు తనతో కలిసి సంగీత సాధన చేశా. బాణీలు కట్టా. నాన్న చనిపోయాక తమ్ముడికి సంగీతమే ప్రధానమైంది. నాన్న పోవడంతో మా ఇంటి వాతావరణం మారిపోయింది. అమ్మాయిలం ఇంటికే పరిమితమయ్యాం. దాంతో సంగీతాన్ని నేర్చుకునే విషయంలో విరామం వచ్చింది. ఇంట్లో హోమ్‌ స్టూడియో ఉన్నా చొరవ చూపించలేకపోయా. కానీ ముందే చెప్పా కదా... పాటా, సంగీతం నాలో ఇంకిపోయాయని! 'మలై.. మలై' నా మొదటి పాట. ఇది నా స్నేహితురాలి ద్వారా వచ్చిన అవకాశం. అమృతలోని 'కడసారి వీడ్కోలు..' శివాజీలోని 'బల్లెలక్కా...', రావణ్‌లో పాడిన పాటా నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. గాయనిగా గుర్తింపు వచ్చాక సంగీత దర్శకురాలిగా మారా. తమిళం, కన్నడ, మలయాళ సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నా! ఒక పాట వింటే అది మా అబ్బాయి ప్రకాష్‌దీ, రెహ్మాన్‌దీ... ఎవరిదయినా కానివ్వండి లోపం ఉంటే నిర్మొహమాటంగా విమర్శిస్తా. కాకపోతే రెహ్మాన్‌ పాటల విషయంలో అలా విమర్శించే పరిస్థితి ఇంతవరకూ రాలేదు.

రెయిన్‌డ్రాప్స్‌ గురించి...
  • రెండేళ్ల క్రితం యువతకు మేలు చేసే 'రెయిన్‌ డ్రాప్స్‌' సంస్థ తమ సేవా కార్యక్రమాలని వివరించి, నా సహకారం కోరినప్పుడు కాదనలేకపోయా. ప్రచార కర్తగా సాయం అందించడం మొదలుపెట్టా. సమాజానికి ఉపయోగపడే సందేశాలని సృజనాత్మకంగా ఉండే థీమ్‌ సాంగ్‌లూ, లఘు చిత్రాల ద్వారా ప్రజల్లోకి హత్తుకునేలా తీసుకెళ్లడం ఈ సంస్థ లక్ష్యం. అందులోని సభ్యులంతా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతే. సమాజానికి ఉపయోగపడేందుకు వీరంతా కొంత సమయం కేటాయించి పాటలు పాడతారు. వాటితో డబ్బులు సేకరించి.. విరాళాలుగా అందిస్తారు. అవయవ దానంపై అవగాహన కోసం.. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించడం, ఏ ఆసరా లేని పిల్లలకు చదువు చెప్పించడం... వంటి వాటిని ప్రజల్లోకి సృజనాత్మకంగా తీసుకెళ్లడం కోసం కృషి చేస్తోంది. ఈ విధంగా సేవలందిస్తున్న సంస్థ మనదేశంలో ఇదొక్కటే. అందుకే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. మేం స్కూళ్లూ, కళాశాలలకు వెళ్లి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రారంభించిన మూడేళ్లలోనే సభ్యుల సంఖ్య వెయ్యి దాటింది. చదువుకు సంబంధించి 'ఎడ్యుకేట్‌ ఎ చైల్డ్‌' ప్రాజెక్ట్‌కు నేను పాటలు రాశా. మా ప్రయత్నాలతో వేల మంది విద్యార్థులు స్కూళ్లలో చేరారు. మేమూ స్వయంగా రెండొందల మంది ఏ ఇబ్బందీ లేకుండా చదువుకునే అవకాశం కల్పించాం. ప్రస్తుతం మహిళా సాధికారతపై పనిచేస్తున్నాం. ప్రతి ఏటా మార్చిలో మహిళల సంక్షేమం కోసం కృషి చేసే వారికి మా సంస్థ తరఫున అవార్డులిచ్చి సత్కరిస్తాం. ఆ స్ఫూర్తిని పదిమందీ అనుసరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
 జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : రెహానా . ఎ.ఆర్.,
  • పుట్టిన ఊరు : చెన్నై , 
  • తోబుట్టువులు : ఎ.ఆర్.రెహమన్‌,
  • father : R. K. Shekhar, was a film music composer and conductor for Tamil as well as Malayalam films. 
  • mother : Kareema (born Kashturi).
  • మొదటి సినిమా : Machi, 
  • భర్త : వెంకటేశ్ ,
  • పిల్లలు : కొడుకు -జి.వి. ప్రకాశ్ కుమార్
 సంగీతం చేసిన  సినిమాలు (filmography ): 5,
  •  మలై.. మలై' నా మొదటి పాట,
  • అమృతలోని 'కడసారి వీడ్కోలు ,
  • శివాజీలోని 'బల్లెలక్కా...'
  • రావణ్‌లో పాడిన పాటా మంచి పేరు తెచ్చింది ,
courtesy with : vasundara@eenadu news paper.
  • =========================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala