Vinaya prasad-వినయ ప్రసాద్


  •  


  •  

పరిచయం (Introduction) : 
  •  తెర మీద... పెద్ద బొట్టూ, కాటన్‌ చీర కట్టూ... కన్నీళ్లు పెట్టించే పాత్ర. తెర వెనుక... ఎప్పుడూ నవ్వుతూ సందడిగా గడిపే మనస్తత్వం! థియేటర్‌లో... ఆమె నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు ఇంట్లో... సెంటిమెంట్‌ పండించే ఆమె పాత్రలు చూసి నొచ్చుకుంటారు. . .కన్నడ నటి ''వినయ ప్రసాద్‌''. 1995లో నాయుడుగారి కుటుంబం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యా. తెలుగు ,కన్నడ ,తమిళ . మళయాల భాషా సినిమాలలో నటించారు
జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : వినయ ప్రసాద్ , 
  • పుట్టిన ఊరు : ఉడిపి  , 
  • నాన్న : ఎల్.ఐ.సి . ఉద్యోగి, 
  • అమ్మ : బి.ఇ .డి  - కాలేజీ లో క్రాఫ్ట్ టీచర్ , 
  • బాల్యము :  తనమాటల్లో నాన్న నాకు ప్రతిరోజూ కథలు చెప్పేవారు. హావభావాలతో సహా వర్ణించేవారు. నాలుగో ఏటే ఓ నాటకంలో నటించి మొదటి బహుమతి అందుకున్నా. ఇక స్కూల్లో చేరాక ఆలిండియా రేడియోలో పని చేశా. సంగీతం, యోగా నేర్చుకున్నా. ఖాళీగా ఎప్పుడూ లేను. సినిమాల ప్రభావం నామీద అంతగా లేదు. కానీ కె.విశ్వనాథ్‌గారి సినిమాలు ఉడిపి, మంగళూరులో విడుదలయ్యేవి. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'సీతామాలక్ష్మి' .. వంటివి చూశాక నేనూ ఎప్పటికైనా అలాంటి చిత్రాల్లో నటించాలని అనుకునేదాన్ని.
  • మొదటి సినిమా : మద్వాచార -అనే కన్నడ సినిమా, 
  • మొదటి తెలుగు సినిమా : నాయుడుగారి కుటుంబం,
  • భర్త : వి.ఆర్.కె.ప్రసాద్ -కన్నడ ఫిల్మ్‌ దర్శకుడు , ఎడిటర్  (1995 లో చనిపోయారు ),తరువాత జ్యోతి ప్రకాష్ ని పెళ్ళిచేసుకుంది . ఒక కొడుకు - జయ్ ప్రకాష్ ,
  • మతము : హిందూ కన్నడ బ్రహ్మిన్‌, 
  • పిల్లలు : ఒక కూతురు - ప్రథమప్రసాద్ ,
  • తోబుట్టువులు : ఒక అక్క - విజయ సత్యనారాయణ, చెల్లెల్లు (కవలలు ) క్షమ భట్ , కృప భట్ ,ఒక సోదరుడు - రవి భట్ (టెలివిజన్‌ యాంకర్ ),


నటించిన సినిమాలు (filmography ): 

  • 1995లో నాయుడుగారి కుటుంబం, 
  • కలిసుందాం రా', '
  • ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', '
  • ఆంజనేయులు', 
  • 'శిరిడీ సాయి', 
  • 'దూకుడు', 
  • 'దూసుకెళ్తా', 
  • 'భాయ్‌'... ఇలా దాదాపు ముప్ఫైకి పైనే సినిమాల్లో నటించారు .
  •  'ఇంద్ర'  లో చిరంజీవి అక్కగా కనిపించారు . 
  • 'ఆంధ్రుడు'  లో హీరోయిన్‌కి మేనత్తగా హిందీలో సంభాషణలున్న పాత్ర చేశారు . మంచి పేరొచ్చింది.
  • రెడీ , 
  • వరుడు , 
  • బావ , 
  • స్కెచ్ ఫర్ లౌవ్ , 

  • =============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala