Sports and Film-acting Stars - క్రీడల్లో రాణించి నటించిన మహిళలు

  •  

  • పరిచయం (Introduction) : 

వారంతా దేశం, ఆయా రాష్ట్రాలు గర్వించదగ్గ క్రీడాకారులు. క్రీడల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అంతేకాదు అందంలోనూ వీరికి వీరే సాటి. వీరి ఆట నయనానందకరమే. కొందరు అంతర్జాతీయ స్థారుులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి అందం నటనవైపు అడుగులు వేరుుంచింది. కొందరు యాడ్గ ఫిల్మ్‌ల్లో నటించగా, మరి కొందరు చలన చిత్రాల్లో అరంగేట్రం చేసి హల్‌ చల్‌ చేశారు. తాజాగా గుత్తా జ్వాల ఓ స్పెషల్‌ సాంగ్‌ హాట్‌ హాట్‌గా నృత్యం చేసి యువతను వెర్రెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి నటించిన మహిళల గురించి తెలుసుకుందాం...

  •     గుత్తా జ్వాల


  జ్వాల సెప్టెంబర్‌ 7, 1983న మహారాష్ట్రలోని వార్ధాలో జన్మించింది. తండ్రి గుత్తా క్రాంతి  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా, తల్లి ఎలెన్‌ చైనాకు చెందిన మహిళ. వీరు కాలక్రమంలో నెల్లూరు జిల్లా వాకాడు చేరారు. క్రాంతి, ఎలెన్‌ దంపతుల పెద్ద కుమార్తె జ్వాల. హైదరాబాద్‌ వచ్చే నాటికి ఆమెకు అయిదేళ్లు. బ్యాట్‌ చేతబట్టిందీ అప్పటినుంచే. చదువు, బ్యాడ్మింటన్‌ సాధనతో పెరిగిన జ్వాల క్రమంగా జాతీయస్థాయికి ఎదిగింది. సింగిల్స్‌తోపాటు డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ ఆడడం జ్వాల ప్రత్యేకత!.
    ప్రపంచ పోటీల డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్‌ పోటీల్లో అదే విభాగంలో విజేతగా నిలిచింది.
    సహచర బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను పెళ్లి చేసుకుని తరువాత విభేదాలతో విడిపోయారు.
    ఈమె నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో ప్రత్యేక గీతంలో నృత్యం చేసింది. ఇంకా విడుదల కావాల్సి ఉంది.
------------------------------------------------------------------------
  •     సైనా నెవ్వాల్‌
    saina-
    17 మార్చి 1990 జన్మించింది ప్రముఖ భారత బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా.
    తలిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సాధించినవారే.
    ఒలింపిక్‌ క్రీడలలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ సాధించిన తొలి మహిళ.
    జూన్‌ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ సీరీస్‌ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్‌ సీరీస్‌ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి.
    2012లో లండన్‌ ఒలంపిక్స్‌లో మహిళ సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించింది.
    పలు యాడ్‌ ఫిల్మ్‌ల్లో నటిస్తోంది.
--------------------------------------------------------------
  •     సానియా మీర్జా
    sania--
    ముంబయిలో వృత్తిరీత్యా క్రీడా విలేకరి అయిన ఇమ్రాన్‌ మీర్జా, నసీమా దంపతులకు మీర్జా జన్మించింది.
    ఆరేళ్ల వయస్సు నుంచే టెన్నిస్‌ ఆడటం ప్రారంభించిన మీర్జా 2003లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది.
    ఏప్రిల్‌ 2003లో, మీర్జా భారత ఫెడరేషన్‌ కప్‌ జట్టులోకి అడుగుపెట్టింది. ఆడిన మూడు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు సాధించిపెట్టింది.
    రష్యాకు చెందిన అలీసా క్లైబానోవాతో కలిసి మీర్జా 2003 వింబుల్డన్‌ ఛాంపియన్‌షిప్‌ బాలికల డబుల్స్‌ టైటిల్‌ గెలుచుకుంది.
    2005 ఓపెన్‌ సందర్భంగా గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ నాలుగో రౌండుకు చేరుకున్న తొలి భారత మహిళగా ఆమె నిలిచింది.
    2005లో మీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మూడో రౌండులోకి అడుగుపెట్టింది,
    2007 ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ మూడో రౌండులోకి అడుగుపెట్టిన మీర్జా,
    ఈమె పాకిస్తాన్‌ దేశానికి చెందిన క్రికెట్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ని అనేక వివాదాల నడుమ వివాహం చేసుకుంది.
    పలు యాడ్‌ ఫిల్మ్‌ల్లో నటించింది. సినిమాల్లోకి కూడా రానుందని ప్రచారం సాగినా పెళ్లితో పుల్‌స్టాప్‌ పడింది.
---------------------------------------------------
  •     అశ్వనీ నాచ్చప్ప
    Aswi---
    అశ్వనీ నాచప్ప అక్టోబర్‌ 21, 1967 కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్‌ ప్రాంతంలో జన్మించారు.
    ఈమె మహిళల పరుగు పందెంలో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది.
    ఈమె 1988లో అర్జున పురస్కారం అందుకుంది. ఆటలకు అందాన్ని తెచ్చిన ఈమె క్రీడా రంగం నుండి విరమించిన తర్వాత 1994 అక్టోబర్‌ 2న ఇండియన్‌ ఏయిర్‌లైన్స్‌ జట్టు హాకీ ఆటగాడు దత్త కరుంబయ్యను వివాహం చేసుకుంది.
    నిర్మాత రామోజీరావు, దర్శకుడు చంద్రమౌళి ఈమెను ఒప్పించి మరీ క్రీడారంగ ప్రధాన్యం ఉన్న అశ్వనీ అనే చిత్రాన్ని తీశారు.
    తరువాత ఆదర్శం అనే మరో సినిమాలోనూ నటించింది.
------------------------------------------------------
  •     మిథాలీ రాజ్‌
    MithaliRaj---
    1982 డిసెంబర్‌ 3న జన్మించించి క్రికెట్‌ క్రీడాకారిణి మిథాలి రాజ్‌.
    1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ప్రవేశించి ఐర్లాండ్‌పై 114 పరుగులు సాధించి నాటౌట్‌ గా నిల్చింది.
    ఇంగ్లాండ్‌పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు సాధించి మహిళా క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది.
    2005 మహిళా ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది.
    స్వతహాగా బ్యాటింగ్‌ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్‌ కూడా వేసేది.
    2003లో ఆమెకు అర్జున పురస్కారం లభించింది. చిన్నప్పుడు భారత సంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాత్యం చేసేది.
    ఈమె కూడా పలు యాడ్‌ ఫిల్మ్‌ల్లో నటించింది.
------------------------------------------
  •     కోమల్‌ శర్మ
    Komal sharma.tamil-----
    తమిళనాడులోని చెనై్నలో జన్మించింది.
    నలుగురు సంతానంలో కోమలి పెద్దమ్మాయి.
    స్వాచ్‌లో పలు జూనియర్‌, సీనియర్‌ చాంపియన్‌ షిప్‌లను గెలుచుకుంది.
    చెనై్న మారథాన్‌లో 21 కిలోమీటర్ల రన్నింగ్‌ను పూర్తి చేసింది.
    జాతీయ స్థాయి పోటీల్లో 5వ స్థానం పొందింది.
    ఈమె ఫొటోలను చూసిన ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ తీసిన సత్తపడి కుట్రం చిత్రంలో తొలిసారి అవకాశం ఇచ్చారు.
    సత్యరాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న నాగరాజ చోలన్‌ ఎంఎ, ఎంఎల్‌ఎ చిత్రంలో నటిస్తోంది.

-------------------------------------------------
  •     కమలాదేవి
    KAMALADEVI---
    ఒకప్పటి తెలుగు సినీ నటి, గాయని.
    ఆమె పాతాళభైరవి, బాలనాగమ్మ, మల్లీశ్వరి వంటి చిత్రాలలో నటించారు.
    కమలాదేవి స్వస్థలం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం.
    మొదటిగా సినీ రంగంలో ప్రవేశించినా ఆవిడ ఎక్కువ ఆసక్తి చూపెట్టింది బిలియర్డ్‌‌సపైనే.
    జాతీయ స్థాయి బిలియర్డ్‌‌స ఆటల పోటీలలో మహి ళా విభాగంలో తొలి విజేత (1994) కమలాదేవే.
    నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్న బాబ్‌ మార్షల్‌ అనే ప్రఖ్యాత ఆటగాడితో
    1956లో, బెంగుళూరులో ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడింది
    82 ఏళ్ల వయసులో చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు.

  •  ===========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala