kundu , Gada Balakrishnarao, కుందు ,గాదా బాలకృష్ణారావు

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  ఒకే ఒక దృశ్యంలో 5, 6 డైలాగులున్న ఒక చిన్న వేషానికి కావలసిన పాత్రధారి కోసం దర్శక, రచయితలు స్వయంగా వెళ్లి ఎన్నిక చేస్తారా ఎక్కడైనా? ఎక్కడో ఏమిటి - నిజంగా అలా జరిగింది. వాహినివారు 'గుణసుందరి కథ'' (1949) తీసినప్పుడు -అందులో ఒక దృశ్యంలో మహేంద్రమణి అనేది ఎక్కడుందో అంజనం వేసి చూసి తెలుసుకుంటారు. అంజనం ఒక పెద్దాయన వేస్తే - ఒక అబ్బాయి అందులోకి చూస్తూ ఎలా ఎలా వెళ్లాలో వివరిస్తూ వుంటాడు. ఆ అబ్బాయి వేషానికి పనికొచ్చేవాడు ఎవరు? అని - ఆ చిత్రం దర్శకుడు కె.వి.రెడ్డి, రచయిత పింగలి నాగేంద్రరావు, సహకార దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ముగ్గురూ మద్రాసు ఆలిండియా రేడియోకి 'బాలానందం' కార్యక్రమం జరిగే చోటికి వెళ్లారు. అక్కడున్న పిల్లల్ని పరీక్షించారు. 'షడ్జా మడ్జ కరాడ్జ వీడ్జ' అన్న కాళిదాసు శ్లోకంలోని ముక్కలు పలకమని నలుగుదైరుగుర్ని పరీక్షిస్తే ఒక అబ్బాయి భావం ప్రకటిస్తూ స్పష్టంగా చదివాడు. దాంతో ఆ దర్శకుడు వాళ్లూ ఆ అబ్బాయిని ఆ వేషానికి తీసుకున్నారు. ఆ అబ్బాయిపేరు - కుందు. మాస్టర్‌ కుందు. అసలు పేరు - గాదా 'బాలకృష్ణారావు'. 'కుందు' అనే ముద్దుపేరుతోనే అతను పేరు తెచ్చుకున్నాడు. ''ఈ వేషం ఇస్తే గుండు చేయించుకుంటావా?'' అని అడిగితే, ''ఇబ్బందేం లేదు'' అని ఆ చిన్నవేషానికి గుండు కొట్టుంచుకున్నాడు.
జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : కుందు ,
  • అసలు పేరు : గాదా బాలకృష్ణారావు ,
  • నివాసము : హైదరాబాద్ ,


నటించిన సినిమాలు (filmography ): 

  • 'పెళ్లి చేసి చూడు'తో గుర్తింపు!
  • తర్వాత
  • లైలామజ్నూ,
  • దీక్ష,
  • శ్రీలక్ష్మమ్మ
  • పెళ్లి చేసి చూడు' (1952)
  •  బాలనటుడిగానే దేవదాసు,
  • శాంతి,
  • బీదల ఆస్తి,
  • నాయిల్లు,
  • కన్యాశుల్కం,
  • తోడికోడళ్లు ........
.మొదలైన చిత్రాల్లో నటించి, చదువు మీదనే దృష్టి కేంద్రీకరించడంతో సినిమాలమీద శ్రద్ధ తగ్గింది. పెద్దవాడయ్యాక నటించలేదు. చిన్నతనంలో వేషాలు వేసిన వాళ్లలో ఏ కొద్దిమందో సినిమాల్లో కొనసాగారు. కమలహాసన్‌, శ్రీదేవి, రోజారమణి వంటివారు కనిపించినట్టు - తక్కిన వాళ్లు కనిపించలేదు. 1954లో చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో ప్రవేశించారు కుందు అనబడే బాలకృష్ణారావు, టాగూర్‌ అండ్‌ కో అనే సంస్థలో ఉద్యోగం చెయ్యడం వల్ల వాళ్లు చాలా వూళ్లు తిప్పారు.''దాదాపు అన్ని పట్టణాల్లోనూ ఉద్యోగం చేశాను. చివరికి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్నతోద్యోగం చేసి, 1995లో రిటైరయి హైదరాబాద్‌లో వుంటున్నాను'' అని చెప్పారు కుందు.


రిటైరయిపోయిన తర్వాత కాలక్షేపం --''కంప్యూటర్‌ దగ్గర కూచుంటాను. టీవీ చూస్తాను. నేనూ నా భార్య ఇద్దరమే వుంటాము. మా పిల్లలకి పెళ్లిళ్లయి ఉద్యోగాల్లో వున్నారు వేర్వేరు వూళ్లలో. సాయంకాలం వేళల్లో తాగ్యరాయగాన సభలో ఏదైనా మంచి ప్రదర్శన వుందంటే వెళ్లి ఓ మూల కూచుంటాను. అలా వెళ్లి నాటకాలు, పాటకచేరీలూ చూశాను - చూస్తూ వుంటాను. మా బంధువులు, మిత్రులూ చాలామంది వున్నారు హైదరాబాద్‌లో. వాళ్లు వస్తూ వుంటారు; మేమూ వెళ్తూ వుంటాము.

 source : Eenadu news paper 11-12-2013
  • =========================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala