Sunday, November 3, 2013

singer Suchitra -సింగర్ సుచిత్ర(గాయని)

 •  

 •  
పరిచయం (Introduction) :
 •  'సారోస్తారా'.. 'బిజినెస్ మాన్' సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్ళిన పాట. ఈ పాటకు పాడింది తమిళంకు చెందిన సింగర్ 'సుచిత్ర'. తమిళ్ రేడియో మిర్చి లో ఆర్ జె గా ఉన్న సుచిత్ర తనదైన స్టైల్ పాటలు పాడి ఎందరినో ఫాన్స్ గా మార్చేసుకుంది. తమన్ సంగీతం అందించే ప్రతీ చిత్రంలో ఈమె పాట ఉండి తీరాల్సిందే. అలాగే మలయాళం లో కూడా సుచిత్ర తన హవా కొనసాగిస్తోంది. రీసెంట్ ఈమె 'నాయక్' సినిమాలో 'యవార మంతా ఏలూరే..' పాటతో మెగా ఫ్యాన్స్ ను తనవైపు తిప్పుకుంది. 'పోకిరి'లో 'ఇప్పటికింకా.. నా వయసు నిండా పదహారే..' పాటతో యూత్ లో వేడిని రగిల్చింది.
 జీవిత విశేషాలు (profile) :
 •  పేరు : సింగర్ సుచిత్ర(గాయని),
 • పూర్తిపేరు : సుచిత్ర కార్తిక్ కుమార్ ,
 • పుట్టిన తేదీ : 14 ఏప్రిల్ 1979 , 
 • పుట్టిన ఊరు : చెన్నై , 
 • చదువు : ఎం.బి.ఎ.,
 • మతము : హిందూ తమిళిలు , 
 • వృత్తి : గాయని(తమిళ ,మలయాల ,తెలుగు) , రేడియో జాకి , శీర్షికా రచయిత.
 • ఎత్తు : 5'5'' , 
 •  భర్త : కార్తిక్ కుమార్ ,
పాటలు పాడిన తెలుగు  సినిమాలు (filmography ): 
 • పోకిరి ,
 • హ్యాపీ , 
 • చిరుత ,
 • మల్లన్న ,
 • పులి ,
 • బృందావనం , 
 • శక్తి ,
 • దాదా , 
 • వైశాలి , 
 • కందిరీగ ,
 • ఊసరవిల్లి , 
 • బిజినెస్ మ్యాన్‌, 
 • దేవుడు చేసిన మనుషులు , 
 • నాయక్ , 
 • మిర్చి , 
 • నువ్వా నేనా ,
 • బాద్ సాహ్ , 
 • సాడో ,

 • మర్చిపోలేని సందర్భాలు...
రెహ్మన్‌గారితో 'కొమరం పులి'లో పాడే అవకాశం. 'సారొస్తారొస్తారా'కు ఫిల్మ్‌ఫేర్‌ గెలుచుకోవడం. నా ఆల్బమ్‌లో పాటల్ని కీరవాణి గారు మెచ్చుకోవడం.


 • మెచ్చే గాయకులు...

ఏఆర్‌ రెహ్మాన్‌,
సోనూ నిగమ్‌,
బాలసుబ్రహ్మణ్యం


 • ఒత్తిడిని తగ్గించుకోవడానికి....

మా కుక్కపిల్లతో కాసేపు ఆడుకుంటా. యోగా చేస్తా. సంగీత సాధన చేస్తా


 • ఖాళీ సమయాల్లో...

పుస్తకాలు చదువుతా. యూట్యూబ్‌ వీడియోలు చూస్తా. మా బ్యాండ్‌తో మ్యూజిక్‌ ప్రాక్టీస్‌ చేస్తా.


 • కోపం వస్తే...

విరామం తీసుకుంటా. దూరంగా నడిచివెళతా. మౌనంగా ఉంటా.


 • ముద్దుపేర్లు

పుట్టింట్లో చుమ్మీ. అత్తగారు
సుచిమా అంటారు. మా వారు
అళగీ అని పిలుస్తారు.


 • ఇష్టమైన ఆహారం

ఇంట్లో వండిన దక్షిణాది వంటలు. గుజరాతీ ఘుమ ఘుమలు. థాయ్‌ రుచులు.


 • ఇష్టమైన వ్యక్తులు...

మహాత్మాగాంధీ. మా వారు కార్తీక్‌.

సంగీత దర్శకుడు
తమన్‌.


 • ఇతరుల్లో నచ్చే లక్షణాలు...

సహనం, హుందాతనం, నిజాయతీ.


 • సుచిత్ర స్త్టెల్‌ స్టేట్‌మెంట్‌...

నవ్వుతూ కనిపించాలి. శుభ్రంగా ఉండాలి. ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించాలి.


 • నచ్చిన సినిమా నటులు...

అమల, కరీనా కపూర్‌, వూర్వశి


 • ఇక ప్రపంచం ఉండదనుకుంటే చివరగా చేసే పనులు...

మొత్తం డబ్బుతో చికెన్‌ కొని వీధి కుక్కలకు పెడతా. బాధపెట్టిన వారికి ఫోన్‌ చేసి క్షమాపణలు కోరతా. మిగిలిన సమయం మా వారితో గడుపుతా.


 • మీ గురించి ఇతరులకు తెలియని మూడు విషయాలు...

తక్కువగా మాట్లాడతాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటా. కుటుంబం, స్నేహితుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే.


 • చివరిగా మూడు మాటలు...

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. దృఢమైన ఆలోచనలే లక్ష్యానికి చేరువ చేస్తాయి. ఎంతపైకి చేరుకున్నా ఆలోచనలు కింద నుంచే మొదలవ్వాలి.

 • courtesy with Sitara cinema magazine

 • ==============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog