Wednesday, November 20, 2013

Shanvi Srivatsav - శాన్వి శ్రీవత్సవ్

 •  


పరిచయం (Introduction) : 
 • సీనియర్‌ సినీ పాత్రికేయురాలు బి. జయ దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌లీ' చిత్రంలో సాయికుమార్‌ తనయుడు ఆది కథానాయకుడుకాగా, శాన్వి అనే నూతన నటి పరిచయమైంది.  ముంబైలోనే పుట్టి పెరిగిన ఈ అమ్మాయికి , బీకామ్ రెండో సంవత్సరం చేస్తుండగా ఈ సినిమాలో అవకాశం దక్కింది.
 • డిగ్రీ చదువుతూ.. సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించింది శాన్వి. 'లవ్లీ'తో పరిచయమై 'అడ్డా'లో నటించినున్నది .తన మాటల్లో  'ఈ ఏడాదే బీకామ్‌ పూర్తి చేశా. నేను చదువూ, షూటింగ్‌కి సమ ప్రాధాన్యమిచ్చేదాన్ని. ఎన్ని పనులున్నా చదవకుండా నిద్రపోయేదాన్ని కాదు. దాంతో నిద్రకు కేటాయించే సమయం బాగా తగ్గింది. రోజుకి మూడు నాలుగు గంటలే పడుకునే దాన్ని. మరి తెర మీద అంత చలాకీగా కనిపించడం ఎలా సాధ్యమవుతుందనేగా మీ సందేహం! తెల్లవారు జామున లేవడం నాకలవాటు. ఆ సమయంలో చప్పుళ్లు ఉండవు. ఫోన్లు రావు. ఎవరూ మాట్లాడరు. హాయిగా రెండు గంటలపాటు ప్రాణాయామం, యోగా, సూర్య నమస్కారాలు చేస్తా. దాంతో అలసట దూరమవుతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది. సెట్‌లో కూడా ఖాళీ దొరికితే ఏ మాత్రం సమయం వృథా చేయకుండా అందాన్ని రెట్టింపు చేసుకొనే యోగాసనాలు చేస్తుంటా. ప్రస్తుతం పీజీ చేయాలనే ఆలోచనలో ఉన్నా. తెలుగులో పట్టు పరికిణీ వేసుకొని కనిపించాలని ఆశపడుతున్నా. అలానే అన్ని భాషల్లో సంప్రదాయ పాత్రలు చేయడమే నా లక్ష్యం' అని చెప్పింది శాన్వి.

జీవిత విశేషాలు (profile) :
 • పేరు : శాన్వి శ్రీవత్సవ్(Shanvi Srivatsav) ,
 •  పుట్టిన ఊరు : ముంబై ,
 •  ఊరు : వారణాసి ,
 • చదువు : బి.కాం.
    ఇలా తన గురించి చెప్పిna vishayaalu 

 • * నటి కాకపోయుంటే...బ్యాంకులో ఉద్యోగం చేసేదాన్ని. నేవీలో విధులు నిర్వహిస్తుండేదాన్ని. ఐఏఎస్‌ అయ్యేదాన్ని.
 • * ఎప్పుడూ వెంట ఉండేవి-ఫోన్‌, ఫెర్‌ఫ్యూమ్‌, పెన్‌.
 • * అభిమానించే నటులు--అల్లుఅర్జున్‌, పవన్‌ కల్యాణ్‌, నాని.
 • * ఇష్టంగా చేసే పనులు--డాన్స్‌, పాడటం, పెయింటింగ్‌.
 • * ఎలాంటి ఆభరణాలు ఇష్టం--బంగారు పెండెంట్లు, ముక్కుపుడక, పట్టీలు.
 • * బలాలు--నాకు నేనుగా ఉండటం, నవ్వు, కష్టపడి పని చేయడం.
 • * ఖాళీగా ఉంటే--వంట చేస్తా, స్నేహితుల్ని ఇంటికి పిలుస్తా. నెట్‌లో ఛాటింగ్‌ చేస్తా.
 • * మీ గురించి తెలియనివి.--కెమిస్ట్రీ అంటే భయంతో సున్నా మార్కులు వచ్చేవి. కాలేజీలో ఉన్నప్పుడు జాతీయ స్థాయి అథ్లెట్‌ని. టట్టూ స్టిక్కర్లు సేకరించడమంటే సరదా.
 • * మర్చిపోలేని జ్ఞాపకాలు--నాన్నతో గడిపిన ప్రతిక్షణం, కన్నడ చిత్రం 'చంద్రలేఖ'కోసం నెలపాటు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయడం. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్టు మార్కు తెచ్చుకోవడం.
 • * ఎదుటి వాళ్లలో నచ్చనివి--అబద్ధాలు చెప్పడం, అపరిశుభ్రంగా ఉండటం, ఇతరుల మీద ఆధారపడటం.
 • * ఇష్టంగా ధరించే దుస్తులు--చీర, పొడవాటి గౌను, జీన్స్‌,
 • * నచ్చిన సినిమాలు--దూకుడు, మన్మథుడు, వూసరవెల్లి,
 • * ఇష్టంగా తినేవి--బిర్యానీ, చికెన్‌ వంటకాలు, చాక్లెట్లు,
 • * విహార యాత్రకు వెళ్లాలంటే..,--స్విట్జర్లాండ్‌, ఇస్తాంబుల్‌, యూరప్‌,
 • * తరచూ సందర్శించే దేవాలయాలు--శిరిడీ, చిలుకూరు బాలాజీ, శ్రీశైలం,
 • * కాబోయే భర్తలో కోరుకునే గుణాలు--సహనంతో వ్యవహరించాలి. అర్థం చేసుకోవాలి, ప్రేమగా ఉండాలి.
 • * చివరిగా మూడు మాటలు--మన కష్టమే మనకు సంతృప్తినిస్తుంది. చెదరని చిరునవ్వే ముఖానికి అందం. శత్రువులను సైతం ప్రేమించడమే ఉన్నత వ్యక్తిత్వం.


నటించిన సినిమాలు (filmography ):
 •  అడ్డా--సుశాంత్‌తో(2013)  ,
 • లవ్లీ --లవ్‌లీ' చిత్రంలో సాయికుమార్ తనయుడు ఆదితో(2012) , 
 • ప్యార్ మే పడిపోయానే,
మూలము : స్వాతి వార పత్రిక -28-03-2014,
 • ====================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog