Sunday, November 3, 2013

Non tollywood singers in Tollywood films,టాలీవుడ్ లో పరభాషా సింగర్స్

  •  


పరిచయం (Introduction) :
  • సినిమాల్లో స్టోరీ ఎలా ఉన్న ప్రేక్షకులు ఎక్కువగా పాటలనే ఇష్టపడుతుంటారు. ఒక సినిమాలో సాంగ్స్ హిట్ అయితే దాదాపు సినిమా సగం హిట్ అయినట్టే. ఆడియోకు ఉన్న క్రేజ్ కూడా అలాంటిది. ఏ ఇండస్ట్రీలో నైనా.. సాంగ్స్ కు చాలా ప్రాముఖ్యతనిస్తారు. పాటలేని సినిమాలను ఊహించుకోవడం కూడా కష్టమే. ఈ పాటలన్నిటికీ ముఖ్య కారణం సింగర్స్. వారి గొంతులోని మాధ్యుర్యాన్ని పాటల రూపంలో వింటుంటే ఆ థ్రిల్లే వేరు. అయితే ఒకప్పుడు చాలా వరకు మన సినిమాలకు తెలుగు సింగర్సే పాడేవారు. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది. ప్రతి సినిమాలోనూ తెలుగు రాని పరభాషా సింగర్స్ తో పాడిస్తున్నారు. ఒక్కో సంగీత దర్శకుడు ఒక్కో సింగర్స్ తో తన సినిమాలో పాడిస్తుంటారు. దీంతో తెలుగు సింగర్స్ ను పక్కన పెడుతున్నారు.

singer Suchitra -సింగర్ సుచిత్ర(గాయని) :
  • 'సారోస్తారా'.. 'బిజినెస్ మాన్' సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్ళిన పాట. ఈ పాటకు పాడింది తమిళంకు చెందిన సింగర్ 'సుచిత్ర'. తమిళ్ రేడియో మిర్చి లో ఆర్ జె గా ఉన్న సుచిత్ర తనదైన స్టైల్ పాటలు పాడి ఎందరినో ఫాన్స్ గా మార్చేసుకుంది. తమన్ సంగీతం అందించే ప్రతీ చిత్రంలో ఈమె పాట ఉండి తీరాల్సిందే. అలాగే మలయాళం లో కూడా సుచిత్ర తన హవా కొనసాగిస్తోంది. రీసెంట్ ఈమె 'నాయక్' సినిమాలో 'యవార మంతా ఏలూరే..' పాటతో మెగా ఫ్యాన్స్ ను తనవైపు తిప్పుకుంది. 'పోకిరి'లో 'ఇప్పటికింకా.. నా వయసు నిండా పదహారే..' పాటతో యూత్ లో వేడిని రగిల్చింది.

singer Shreya ghoshal-శ్రేయా ఘోషల్(గాయని) :
  • 'శ్రేయా ఘోషల్'.. క్లాస్ పాటకైనా - మాస్ బీట్ కైనా ఈజీగా సూటయ్యే గొంతు ఆమెది . హిందీ 'దేవదాస్' సినిమాతో సినీ గాయనిగా పరిచయమైన శ్రేయ.. ఆ తరువాత తెలుగు ..తమిళ్ ..మలయాళం ...కన్నడ ...బెంగాలి చిత్రాలలో గాయనిగా తన సత్తా చాటుతోంది. 'శ్రీరామ రాజ్యం', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'నాయక్', 'ఎవడు' వంటి సినిమాల్లో పాటలు పాడి తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు. 'సారిగమ పా' .. పాటల ప్రోగ్రాం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా .. ఆ తరువాత సినీ నేపథ్య గాయనిగా పాటల ప్రయాణం ప్రారంభించింది. 'యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఒహియో' గవర్నర్ టెడ్ స్ట్రిక్ లాండ్ .. శ్రేయా పాటలకు పులకించి పోయి 2010 సంవత్సరం లో జూన్ 26 ను 'శ్రేయ ఘోషల్ డే' గా ప్రకటించారు. ఏ తరహా పాట తీసుకున్నా అందులో తన ప్రత్యేకతను చాటుకోవడం శ్రేయాకు వెన్నతో పెట్టిన విద్య.

singer Reeta-సింగర్ రీటా(గాయని) :
  • మగధీరా సినిమాలో పంచదార బొమ్మ పాటతో ఫేమస్ అయిన మరో సింగర్ 'రీటా'... చెన్నయ్ కు చెందిన రీటా తెలుగులో దూసుకుపోతుంది.

singer Raveena Reddy-రవీనా రెడ్డి(గాయని):
  •  'బంతి పూల జానకి' పాటతో తెలుగు వారి మనసును దోచుకున్న మరో సింగర్ 'రవీనా రెడ్డి'. బెంగుళూరు కు చెందిన ఈ సింగర్. అయిదు ఏళ్ల వయసు నుంచి సంగీతం నేర్చుకొని తన పాటలతో మైమరిపించేస్తుంది. 'ఆరెంజ్', 'రంగం', 'ఎవడు', 'బలుపు'లాంటి సినిమాల్లో రవీనా పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయి.

singer Ramya-రమ్య(గాయని)
  •  'తమన్' అవకాశం ఇచ్చిన మరో పర బాషా గాయని 'రమ్య'. 'దూకుడు' చిత్రం లోని 'పువ్వై పువ్వై..' పాట-రమ్య ని టాలీవుడ్ లో టాప్ స్టార్ సింగర్ గా నిలిబెట్టింది. ఆమె వాయిస్ లోని మత్తు గమ్మత్తుతో యువతను చిత్తు చేస్తుంది.


  •  ================================ 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog