Kovvali Laxminarasimharao(writer)-కొవ్వలి లక్ష్మీనరసింహరావు(రచయిత)

  •  

  •  -- courtesy with Ravi kondalarao@pathabangaram of eenadu news paper.

పరిచయం (Introduction) : 
  •  ఆ రోజుల్లోని మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన గొప్ప రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహరావు. అవి- ఆయన రాసిన నవలలు. ''కొవ్వలి వారి నవలలు'' అంటే, ఆనాడు విపరీతమైన అభిమానం ఉండేది. కొత్త నవల మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు- అమ్ముడయిపోయేది. 64 పేజీల నవల. కొందరు ఇంటికి తెచ్చి అద్దెకిచ్చేవారు. ఒక రోజు పుస్తకానికి 'కాణీ' అద్దె. నవల వెల రెండు అణాలు. ఈ నవలల్లోని కథలు మామూలు కుటుంబ కథలు. మంచి వ్యావహారిక భాషలో, సహజమైన సంభాషణలతో రాసేవారు ఆయన. ఇవాళ కాలక్షేపానికి, టీవీ సీరియళ్లు చూసినట్టు- ఆ రోజుల్లో కొవ్వలి పుస్తకాలు గొప్ప కాలక్షేపం. రైలు ప్రయాణంలో ప్రతి వారి చేతిలోనూ కొవ్వలి నవల ఉండేది. ఈ చదివించే ధోరణిని- ఆయనే ప్రవేశపెట్టారు. అది ఒక యుగం! అప్పట్లోనే, ఆయన రాసినట్టుగానే ఇంకా మరికొందరు రచయితలు నవలలు రాస్తూ వచ్చారుగాని, ప్రథమ స్థానం కొవ్వలిదే.రాసిన మొత్తం నవలల సంఖ్య 1000కి పైగా
 జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : కొవ్వలి లక్ష్మీనరసింహరావు(రచయిత),
  • పుట్టిన తేదీ : 01-07-1912,
  • పుట్టిన ఊరు : తణుకు , 
  • మరణము : 8-6-1975న ద్రాక్షరామంలో మరణించారు.
 రాసిన నవలలో కొన్ని :
  •  1935లో 'పల్లె పడుచులు
  • వెయ్యో నవల పేరు- 'మంత్రాలయ'. 
  • వేయిన్నొకటి- 'కవి భీమన్న' (1975).  
  • బస్తీ బుల్లోడు, 
  • నీవే నా భార్య, 
  • వేగబాండ్‌ ప్రిన్స్‌, 
  • కరోడా, 
  • నీలో నేను-నాలో నీవు, 
  • రౌడీ రంగన్న, 
  • హలో సార్‌, 
  • ఇడియట్‌, 
  • ఛాలెంజ్‌, 
  • సవాల్‌, 
  • పైలా పచ్చీస్‌, 
  • లవ్‌ మేకింగ్‌, 
  • బడా చోర్‌, 
  • కిడ్‌నాప్‌, 
  • చస్తావ్‌ పారిపో, 
  • సీక్రెట్‌ లవర్‌, 
  • డార్లింగ్‌ డాలీ ,,
మాటలు రాసిన సినిమాలు కొన్ని : 
  • 1941లో 'తల్లి ప్రేమ
  • ''శాంతి'' చిత్రం 1952,
  •  'మా గోపి'
  • 'సిపాయి కూతురు' (1959),
  • 'బీదల ఆస్తి' (1955), 
  • 'రామాంజనేయ యుద్ధం (1958)'
  • ======================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala