Smitha Madhav - స్మితామాధవ్‌ (బాలరామాయణం-సీత)

  •  

  •  
పరిచయం (Introduction) :
  • దేవుడు నాకు నాట్యకళని ఇచ్చాడు. ఆ కళే నన్ను సీతని చేసింది. బాలరామాయణంలో సీత పాత్ర కోసం హైదరాబాద్‌లో ఉన్న అన్ని పాఠశాలల్లోని అమ్మాయిలనూ జల్లెడపడుతుంటే, ఆ అవకాశం నాకు దక్కడమేంటీ.. అందులోనూ కేవలం ఫొటో చూసి! ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దైవత్వం ఉట్టిపడే ఆ పాత్రని నేను చేశా అని గర్వంగా ఉంటుంది. బాలరామాయణంలో సీతగా చేసినప్పుడు నేను హైదరాబాద్‌లోని నాజర్‌ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నా. అప్పటికే ఆ సినిమాలోని అన్ని పాత్రలకీ కావాల్సిన పిల్లల్ని ఎంపికచేసి, సీత కోసం వెతుకుతున్నారు. నేను చిన్నప్పట్నుంచీ భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నా. సరిగ్గా అప్పుడే అరంగేట్రం చేశా. ఆ ఫొటోలు అన్ని పేపర్లలో వచ్చాయి. వాటిని చూసిన ఎమ్మెస్‌ రెడ్డిగారు మా చిరునామా తెలుసుకుని ఇంటికొచ్చారు. మా ఇంట్లో సినిమాలు చూసే వాళ్లు చాలా తక్కువ. అలాంటిది ఏకంగా నటించడమనగానే మా తాతయ్య వాళ్లు ఒకపట్టాన ఒప్పుకోలేదు. ఎమ్మెస్‌ రెడ్డిగారు 'ఇది కమర్షియల్‌ సినిమా కాదు, దేవుడి సినిమా, అదీ సీత పాత్ర కోసం' అంటూ ఒప్పించారు. ఆరోతరగతి సెలవుల్లో సినిమా మొదలైంది. విడుదలయ్యే సమయానికి నేను ఎనిమిదో తరగతిలో ఉన్నా. ఆ సినిమా చేసిన తరవాత చాలా అవకాశాలొచ్చాయి. పదో తరగతి చదివాక చూద్దాంలే అనుకుని చేయనని చెప్పా. కానీ నాట్యాన్నీ, సంగీతాన్నీ మాత్రం వదలలేదు. కాలేజీకి వచ్చాక హీరోయిన్‌గా చేయమని పెద్ద దర్శకులు అడిగారు. అయితే అప్పటికే నా మనసంతా నాట్యం నిండిపోయింది.
  • నేను నాట్యం, సంగీతానికే సరిగ్గా సరిపోతాననిపించింది. అందుకే ఏ సినిమాకీ ఓకే చెప్పలేదు. నేను కాదన్న సినిమాలు తరవాత చాలా సూపర్‌హిట్‌ అయ్యాయి. అందులో చేసిన హీరోయిన్‌లు పెద్ద పేరు తెచ్చుకున్నారు. అయినా నాకెప్పుడూ బాధనిపించలేదు. ఇక నా చదువు విషయానికి వస్తే భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో పీజీ పూర్తి చేశా. ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో బంగారు పతకం తెచ్చుకున్నా. ప్రస్తుతం మన దేశంతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, వియత్నాం, నేపాల్‌, ఇండోనేషియాలలో ప్రదర్శనలిస్తూ తీరిక లేకుండా ఉన్నా. హైదరాబాద్‌లో 'వర్ణ ఆర్ట్‌ ఫౌండేషన్‌' పేరుతో సంగీత పాఠశాలని మొదలుపెట్టా. ఇవ్వగలిగే వారి దగ్గర రుసుము తీసు కుంటా. మరీ పేదవారైతే ఉచితంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాదే చెన్నైకి చెందిన కేశవన్‌తో వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. స్వాతంత్య్రం వచ్చాక మన భారతదేశానికి మొదటి గవర్నర్‌ జనరల్‌గా పనిచేసిన సి. రాజగోపాలాచారి గారి ముని మనవడే కేశవన్‌. నృత్యం, సంగీతంలో పీజీ చేశా
 జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : స్మితామాధవ్‌ (బాలరామాయణం-సీత)
నటించిన సినిమాలు (filmography ):
  •  బాలరామాయణం
  • ========================= 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala