Harikrishna.Y-హరికృష్ణ.వై




పరిచయం (Introduction) :
  •  ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వై.హరికృష్ణ(76) కన్నుమూశారు. గత కొంతకాలంగా వూపిరితిత్తుల వ్యాధితో బాధపడిన ఆయన శుక్రవారం13-09-2013 అర్ధరాత్రి 12:30 గంటలకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హరికృష్ణ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతు మెరుగైన వైద్యం చేయించాక ఆరోగ్యం కుదుటపడిందనుకుంటున్న సమయంలో ఆయన హఠాన్మరణం పాలయ్యారు.  ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 60 సంవత్సరాలు సినిమా రంగంలో కొనసాగిన హరికృష్ణ వివాదరహితుడు. కేవలం వినోదం కోసమే కాకుండా సమాజంలోని రుగ్మతలపై, సామాజిక అంశాలపై ఆయన సినిమాలు తీయడం విశేషం. డబ్బుకోసం ఆత్మాభిమానాన్ని అభిరుచిని వదులుకోని వ్యక్తి హరికృష్ణ. అందుకే మారే కాలంతోపాటు తాను మారలేక సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. పంపిణీ రంగంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల తాను ఇమడలేనని పంపిణీ రంగాలను మూసేశారు.
 జీవిత విశేషాలు (profile) :
  •  పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా మేడూరు,
  • పుట్టిన తేదీ : 1936 అక్టోబర్‌ 2న ,
  • పిల్లలు : ముగ్గురు. 
  • నివాసం : హైదరాబాద్‌
  • మరణము : 13-09-2013.
Career : 
  • హరికృష్ణ చిన్న వయస్సులోనే తండ్రి మరణించారు. కుటుంబ బాధ్యతల వల్ల 1955లో నవయుగ సినిమా పంపిణీ సంస్థలో చిరుఉద్యోగిగా చేరి అంచలంచెలుగా ఎదిగారు. ఆయన ప్రతిభను గుర్తించిన లక్ష్మి ఫిలిమ్స్‌ అధినేత కె.ఎల్‌.ఎన్‌.ప్రసాద్‌ తన సంస్థలో మేనేజరుగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత హరికృష్ణ సొంతంగా లక్ష్మీ చిత్ర సంస్థను ప్రారంభించి పంపిణీ రంగంలో ఎదిగారు. అభ్యుదయ భావాలు మెండుగా ఉన్న హరికృష్ణ 1983లో నిర్మాతగా మారి 'వందేమాతరం' చిత్రాన్ని రూపొందించారు. ఆపై దేవాలయం, అరుణకిరణం, ఇదా ప్రపంచం, కల్యాణ తాంబూలం, మమతల కోవెల, పద్మావతీ కల్యాణం, ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌ తదితర చిత్రాలని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్య మండలికి తొలి కార్యదర్శిగా సేవలు అందించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
నటించిన సినిమాలు (filmography ): 
  •  'వందేమాతరం'
  •  దేవాలయం, 
  • అరుణకిరణం, 
  • ఇదా ప్రపంచం, 
  • కల్యాణ తాంబూలం, 
  • మమతల కోవెల, 
  • పద్మావతీ కల్యాణం, 
  • ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌

  • ================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala