Srivani(TV actress)-శ్రీవాణి(టి.వి.నటి)

  •  

  •  
పరిచయం (Introduction) :
  •  శ్రీవాణి తెలుగు టివి యాంకర్ , నటి మరియు సినిమా ఆర్టిస్ట్ .
 జీవిత విశేషాలు (profile) : 
  • పేరు : కె . శ్రీవాణి , 
  • ముద్దుపేరు : వాణి , 
  •  పుట్టిన ఊరు : హైదరాబాద్ , 
  • పుట్టిన తేదీ : 02 ఆగస్ట్ 1989,
  • మాతృభాష : తెలుగు , 
  • మాట్లాడే భాషలు  : తెలుగు , హిందీ , ఇంగ్లిష , 
  • ఎత్తు : 5 అ.2 అంగులాలు , 
  • హాబీలు : డాన్స్ , 

నటించిన సినిమాలు (filmography ): 
  • ఈటివి , జెమిని, మాటివి , జీతెలుగు చానెల్స్ లో ఎన్నో సీరియల్స్ ,
  • సినిమాలు : ప్రేమ్‌ , గొడవ , 
  • అడ్వటైజ్ మెంట్స్ : కపిల్ చిట్ ఫండ్స్ , 

తన సొంత స్టోరీ ... తనమాటల్లో(మూలము : ఈనాడు వసుందర)
  •     ''పన్నెండేళ్ల వయసులో 'సినీ రంజని'తో ఆకట్టుకొన్నా... 'మనసు మమత'లో సౌందర్యగా మెప్పించినా... అంతా మీ కోసమే'' అంటూ నటి శ్రీవాణి చెబుతున్న ముచ్చట్లివి.

    హాయ్‌... నటిగా, యాంకర్‌గా చిన్ని తెరపై నాకంటూ ఓ స్థానం కల్పించిన మీకందరికీ నమస్కారమండీ! నేను చాలా కార్యక్రమాలకి యాంకర్‌గా పనిచేశా. అయినా వాటికి రాని గుర్తింపు చంద్రముఖిలోని 'పూజ' పాత్రకి వచ్చింది. నన్నందుకే శ్రీవాణి అని పిలిచే వారికంటే పూజ అని పలకరించే వారే అధికం. ఇంతకీ నా గురించి చెప్పనే లేదు కదూ! పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాద్‌లోనే. నాన్న ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌. అమ్మ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి. చిన్నప్పట్నుంచీ స్కూల్లో జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. ఇంటికి దగ్గర్లోని త్యాగరాయ గాన సభలో జరిగే ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యేదాన్ని. అప్పుడే అక్కడకి స్టేజి షోలు చేయడానికి వచ్చే విక్రమాదిత్యరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఓసారి ఆయన 'స్టేజి షోలలో నటిస్తావా' అనడిగారు. సరేనన్నా. రెండు షోలలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే ఈటీవీ విలేకరి చూసి, 'టీవీలో ఛాన్సొస్తే చేస్తారా' అనడిగారు. అమ్మానాన్నలూ సరేననడంతో విక్రమ్‌ నన్ను ఆడిషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నేను ఎంపిక కావడంతో 'సినీ రంజని', 'మనో రంజని' కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేయడం మొదలుపెట్టా. అప్పుడు నా వయసు పన్నెండేళ్లే. తరవాత వరుసగా యాంకరింగ్‌ అవకాశాలు రావడంతో టీవీ రంగంలో నా కెరీర్‌ కొనసాగింది. చిన్నప్పుడే ఇటువైపు వచ్చానని చదువులో బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ని అనుకునేరు! అదేం కాదు, నేను ఫస్టు క్లాసు మార్కులతో బీఎస్సీ పూర్తి చేశా. ఘర్షణ, అరుంధతి, మనసు-మమత... ఇప్పటి వరకూ పది సీరియళ్లలో నటించా. 'ఘర్షణ'లో ప్రముఖ నర్తకి సుధాచంద్రన్‌కు కూతురిగా నటించా.

    కృష్ణగారమ్మాయిని ఇబ్బంది పెట్టా...
    ఇంతకీ మా వారెవరో చెప్పలేదు కదూ! మొదట నాకు స్టేజి షో చేసే అవకాశం ఇచ్చిన విక్రమాదిత్యే. మాది ప్రేమ వివాహం. ఆయన కొన్ని సీరియళ్లలో నటించినా ప్రస్తుతం ఈవెంట్‌ మేనేజర్‌గా స్థిరపడ్డారు. విక్కీ నాకంటే ఎనిమిదేళ్లు పెద్ద. చిన్నప్పట్నుంచీ తనతో ఎక్కువ అనుబంధం ఉండటం, వాళ్లింట్లో వారితో కూడా మంచి పరిచయాలుండటం వంటివన్నీ తన ప్రేమను ఒప్పుకొనేలా చేశాయి. ఇద్దరివీ వేరు వేరు కులాలు కావడంతో అటూ ఇటూ ఎవరూ ఒప్పుకోరేమోనని మొదట భయపడ్డా. దాంతో ఆయన 'మనం పారిపోదాం...' అనడంతో నేనూ సరేనన్నా. నలభై రోజుల పాటు రాష్ట్రమంతా తిరిగొచ్చాం. తిరిగి ఇంటికి రాగానే రెండు కుటుంబాల వాళ్లూ గొడవ పెడతారనుకున్నాం. కానీ ఎవరూ ఏమీ అనలేదు. నా మైనారిటీ తీరే వరకూ ఆగి పెళ్లి చేశారు. అప్పుడే మా వారు నాకో ట్విస్ట్‌ ఇచ్చారు. అదేంటంటే వాళ్లింట్లో వాళ్లు పెళ్లికి అభ్యంతరం పెట్టలేదు. అయినా కూడా ఆయన నన్ను ఇంట్లోంచి తీసుకెళ్లారు. ఇంతకీ అసలు విషయమేంటంటే, ఆయనకు తెలిసినవారొకరు ఇలానే చేశారట. దాంతో ఆయనకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అలా తీసుకెళ్లాలనే కోరిక ఉండేదట. దాన్ని ఇలా తీర్చుకొన్నారు. కానీ నా వల్ల కృష్ణగారమ్మాయి మంజుల చాలా ఇబ్బంది పడ్డారు. ఆవిడ 'ఘర్షణ' షూట్‌ చేస్తున్నప్పుడే ఇంట్లోంచి నేను పారిపోయింది. అదీకాక ఆవిడ 'అపూర్వ రాగాలు' సీరియల్‌ కోసం పన్నెండు ఎపిసోడ్‌లు నాతో షూట్‌ చేశారు. నేనలా చేసేప్పటికీ ఆ శ్రమ వృథా అయింది. అయినా నన్నేం అనలేదు. నా పరిస్థితిని అర్థం చేసుకుని మరో సీరియల్‌లో అవకాశమిచ్చారు. కానీ ఆ సమయానికి గర్భవతిని కావడంతో చేయలేకపోయా. ఇప్పుడు మాకు ఒక పాప. పేరు రాజ నందిని. ఎల్‌కేజీ చదువుతోంది.

    బోలెడు భవిష్యత్తుంది అంది...
    చాలా సీరియళ్లలో నటించినా 'చంద్రముఖి'లో పూజ పాత్ర నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ ప్రభావం ఎంతంటే మా పాప ఎప్పుడూ కత్తితో ఆటలాడుతూ 'మమ్మీ నువ్వలా చేశావ్‌, ఇలా చేశావ్‌' అంటుంటే భయపడ్డా. అప్పట్నుంచి నెగెటివ్‌ పాత్రలకు దూరంగా ఉండాలని కూడా అనుకున్నా. మరిచిపోలేని జ్ఞాపకం అంటే... సీరియల్‌ షూటింగ్‌ కోసం అవుట్‌డోర్‌కు వెళ్లినప్పుడు బస్సు చెడిపోవడంతో ఓ వూరికి దగ్గర్లో ఆగాం. అక్కడ ఉన్న ఓ ముసలావిడ నా దగ్గరికొచ్చి 'పూజా! ఎందుకలా నిన్ను నువ్వు హింసించుకొంటావ్‌! చిన్నపిల్లవు నీకు బోలెడు భవిష్యత్తుంది...' అంటూ బాధపడింది. ఆ మారుమూల గ్రామంలో ఓ ముసలావిడ నన్ను గుర్తుపట్టడం చూసి మొదట చాలా ఆశ్చర్యపోయా. తరవాత ఆవిడ ఆ పాత్రలో లీనమైపోయిందన్న విషయం అర్థమై 'మామ్మా, అదంతా నటన, చూడు నా చేతులకు ఏ గాయాలూ లేవు' అంటూ సర్ది చెప్పటానికి చాలా సమయం పట్టింది. ఇలా చెబుతూ పోతే ఎన్ని జ్ఞాపకాలో, మరెన్ని అనుభవాలో!! 
  • ===============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala