Monday, June 10, 2013

Anjali TV artist,అంజలి టి.వి నటి

 •  

పరిచయం (Introduction) : 
 •  అనుకోకుండా అవకాశం వచ్చింది... అందుకే నటిస్తున్నా' అని చెప్పదు అంజలి. ఆమె ఇష్టపడి ఈ రంగంలోకి వచ్చింది. చేసిన ప్రతి పాత్రనూ శ్రద్ధగా చేసింది. 'సంబరాల రాంబాబు' నుంచి 'మమతల కోవెల' దాకా యాభై సీరియళ్లలో నటించిన ఆమె చెబుతున్న కబుర్లివి.అమ్మకు డాన్స్‌, నటన అంటే ఎంతో ఇష్టం. కానీ అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం, కుటుంబ పరిస్థితులూ తనని వాటన్నిటికీ దూరం చేశాయి. దాంతో తన కోరికను నా ద్వారా తీర్చుకోవాలనుకొనేది.

 జీవిత విశేషాలు (profile) : 
 • పేరు : అంజలి టి.వి నటి  ,
 •  ఊరు :  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు.
  • నాన్న : వ్యవసాయం చేసేవారు.
  • అమ్మ : గృహిణి.
  • చదువు : డిగ్రీ ఫైనలియర్‌

కెరీర్ (Career) : 
 •  పదో తరగతి సెలవుల్లో బంధువుల ఇంటికని హైదరాబాద్‌ వస్తే తెలిసిన ఒకతను 'మీ అమ్మాయికి నటన అంటే ఆసక్తి ఉందా, అవకాశం ఇప్పిస్తా' అనడిగారు. అమ్మ కోరిక కూడా అదే కావడంతో కొన్ని ఫొటోలు తీయించి వాళ్ల ఆఫీసుకి పంపించింది. ఎంపికకావడంతో ఓ భక్తి సీరియల్‌లో నటించి తిరిగి మా ఊరు వెళ్లిపోయా. ఇంటర్లో చేరిన కొద్ది రోజులకు 'కళాంజలి' దుస్తులకు మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. మంచి అవకాశం, ఉత్సాహంగా ఒప్పుకొన్నా. ఫొటో షూట్‌ ఉన్నప్పుడల్లా హైదరాబాద్‌కి వచ్చి వెళ్లేదాన్ని. అలా రెండేళ్లు చేశా. అప్పుడే శివాజీ రాజా 'సంబరాల రాంబాబు'లో నటించే అవకాశం ఇచ్చారు.. 'మొగలిరేకులు' 'రాధా-మధు', 'రాధాకళ్యాణం', 'కృష్ణావతారాలు', 'అమృతం', 'దేవత', 'మమతల కోవెల'... ఇలా సుమారు యాభై సీరియళ్లలో నటించా. 'నేడే చూడండి', 'ఆహా... ఏమి రుచి' వంటి కార్యక్రమాలెన్నింటికో యాంకరింగ్‌ చేశా.

ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకన్నారు...
 • టీవీ కార్యక్రమాల్లో పడి చదువు వదిలేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా. అమ్మ నేను సీరియళ్లలో నటించడానికి ఒప్పుకోవడంతో బంధుమిత్రుల్లో చాలామంది 'ఆడపిల్లను ఎందుకలా పంపుతున్నావ్‌...' అన్నారు. దాంతో నాన్న అడ్డుచెప్పారు. అమ్మే సర్ది చెప్పింది. 'అన్నిచోట్లా మంచీ చెడూ ఉంటాయ్‌. అది మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అంజలి వెంట నేనుంటా. మీరేం భయపడకండి' అంటూ నచ్చజెప్పి ఒప్పించింది. అది నిజమే. ఒకప్పుడు అంత వ్యతిరేకించి, మాటలన్న వారు ఇప్పుడు నన్ను ప్రత్యేకంగా ఇంటికి పిలుస్తున్నారు. శుభకార్యాలప్పుడు 'తప్పనిసరిగా అంజలిని తీసుకురావాలి' అంటూ అమ్మకు చెబుతున్నారు. నటించడమంటే సంతోషమే. కానీ కొన్నిసార్లు ప్రమాదకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి నాకూ ఎదురైంది. 'రాధా కళ్యాణం'లో రాధనూ, పాపనూ చంపడానికి నేను దూకేసి, కారుని లోయలోకి తోసేసే సన్నివేశం ఒకటుంది. దాన్ని శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో చిత్రీకరించారు. నాకేమో కారు డ్రైవింగ్‌ బాగా రాదు. పైగా ఘాట్‌రోడ్‌, ఓ పక్క బ్రేక్‌ పడట్లేదు. నాతో పాటూ మరో ఇద్దరున్నారు ఏమవుతుందోనని భయం. అయినా దూకేశా. పైగా అక్కడి నుంచి కిందకి దొర్లుకొంటూ రావాలి. అసలే వేసవి ఆపై తారు రోడ్డు... నా పరిస్థితి నరకమే. పైగా ఒళ్లంతా దెబ్బలు. ఇప్పటికీ ఆ సీన్‌ చేయడం గుర్తొస్తే ఎంత భయమేస్తుందో!

అభిమానం అంటే అదీ...
 • నటనకు గుర్తింపు, ప్రేక్షకుల అభిమానం సంపాదించినప్పుడే కదా! అటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. చిన్నప్పుడు నాతోపాటు హాస్టల్‌లో ఉన్న ఓ అమ్మాయి టీవీలో నన్ను చూసి గుర్తుపట్టింది. మొదట ఛానల్‌ వాళ్లనూ, తరవాత సీరియల్‌ నిర్మాతనూ సంప్రదించి నా నంబరు సంపాదించడానికి ఐదారు నెలలు పట్టిందట. ఒకరోజు పొద్దున్నే ఫోన్‌ చేసి 'నేను ఆర్తీనీ.. నీతో మాట్లాడటానికి ఎంత కష్టపడ్డానో తెలుసా...' అని చెబుతుంటే స్నేహితురాలు కలిసినందుకు చాలా ఆనందం కలిగింది. తరవాత తనని కలవడం కోసం వాళ్ల ఊరు వెళ్లా. అప్పుడు ఇంట్లో వాళ్లందరికీ నన్ను పరిచయం చేసి ఎంత సంబరపడిపోయిందో చెప్పలేను! అలానే ఓసారి షూటింగ్‌ కోసం ఒక ఊరెళ్లినప్పుడు ఓ చిన్న పాప నేనొచ్చానని తెలిసి, రాత్రంతా కూర్చుని నెమలీకలతో పెయింటింగ్‌ వేసి బహుమతిగా ఇచ్చింది. చెబుతూ పోతే ఇలాంటివెన్నో!

నటించిన సీరియల్స్   (filmography ): 
 •  శివాజీ రాజా,సంబరాల రాంబాబు,
 • 'మొగలిరేకులు,
 • రాధా-మధు,
 • రాధాకళ్యాణం,
 • కృష్ణావతారాలు,
 • అమృతం,
 • దేవత,
 • మమతల కోవెల ---సుమారు యాభై సీరియళ్లలో నటించా

యాంకరింగ్‌ :
 • నేడే చూడండి,
 • ఆహా... ,
 • ఏమి రుచి , ,.............వంటి కార్యక్రమాలెన్నింటికో యాంకరింగ్‌ చేశా.

courtesy with Eenadu vasundara.

 • ==========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog