Sunday, April 14, 2013

Sandeep kishan -సందీప్‌ కిషన్‌

 •  


 •  
పరిచయం (Introduction) :
 •   ప్రస్థానం తో సిని ప్రస్థానం మొదలుపెట్టి “స్నేహగీతం,రొటీన్ లవ్ స్టొరీ” లాంటి సినిమాలతో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఇప్పుడు ఇతను హీరోగా మరో సినిమా రాబోతుంది --సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్' .'స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్‌ ఇన్‌ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.'ఒక నటుడుగా అవకాశం రావడమే ఒక వరమైతే.. ఆ వచ్చిన అవకాశాన్ని నిలుపుకోవడం ఎంతో కష్టం. ఈమధ్య కాలంలో ఎంతోమంది నటీనటులు పరిశ్రమకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ వారిలో నిలబడింది కొంతమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీువుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్‌ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్‌ మన తెలుగువాడు కావడం గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం తెలుగులో 'ఎల్‌.బి.డబ్యూ'ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్‌ సంగీత దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్‌ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళ్‌లో రెడ్‌పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుటున్న 'యారుడ మహేష్‌' అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం. ఈ రెండు చిత్రాలు 70% చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో తెలుగులో మరో రెండు సంచలన చిత్రాలతో సందీప్‌ కిషన్‌ మనముందుకు రాబోతున్నాడు.


 జీవిత విశేషాలు (profile) : 
 •  పేరు : సందీప్‌ కిషన్‌
 • జన్మదినం : మార్చి 7
 • పుట్టింది : మద్రాసులో
 • ఓ కల : నేను తెలుగు కుర్రాడినే. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం.హీరో కావాలన్నది చిన్నప్పటి కల
 • తొలిమెట్టు : దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ వద్ద కొన్నాళ్లు పనిచేశాను.'సూర్య సన్నాఫ్‌ క్రిష్ణన్‌'కి అసిస్టెంట్‌గా చేశాను.
 • సినీ కష్టాలు : ఫొటోలు పట్టుకుని చాలా ఏళ్లపాటు ప్రొడక్షన్‌ ఆఫీసుల చుట్టూ తిరిగాను. అయితే... అవేవీ కష్టాలని అనుకోను. ప్రయాణంలో అదో భాగం
 • తెరంగేట్రం : 'స్నేహగీతం'లో అవకాశం వచ్చింది. నటుడిగా నాకు మంచి మార్కులే పడ్డాయి
 • పేరు తెచ్చినవి : 'ప్రస్థానం'లో నెగెటివ్‌ పాత్రలో నటించాను. అదీ మంచి గుర్తింపునే తెచ్చింది. ప్రస్తుతం 'రొటీన్‌ లవ్‌స్టోరీ' సోలో హీరోగా నన్ను నిలబెట్టింది.'గుండెల్లో గోదారి'లో నాది నటనకి మంచి ఆస్కారమున్న పాత్ర. మరో రెండు తెలుగు సినిమాలు చేస్తున్నా.
 • ఖాళీ సమయాల్లో : ఎక్కువగా సినిమాలు చూస్తుంటాను. స్నేహితులతో టైమ్‌ పాస్‌. సోషల్‌ నెట్‌వర్కింగ్‌తో టైంపాస్‌  దర్శకత్వం చేయాలని.. : అస్సలు అనుకోవడం లేదు. సినిమా గురించి తెలుసుకోవాలనే దర్శకత్వ శాఖలో చేరాను.ఒక నటుడి నుంచి దర్శకుడు ఏం  కోరుకుంటాడో ఆ కోణం నుంచీ నేర్చుకున్నాను .
 • బాలీవుడ్‌లో.. : 'షోర్‌ ఇన్‌ ద సిటీ' అనే చిత్రంలో నటించాను. అక్కడ ఆ చిత్రం బాగానే ఆడింది.
 • అభిమాన హీరోలు : రజనీకాంత్‌, రవితేజ, షారుఖ్‌ ఖాన్‌. చిన్నప్పుడు ఎక్కువగా రజనీకాంత్‌ చిత్రాలు చూసేవాణ్ని
 • నచ్చే చిత్రాలు : ఆర్య, ఇడియట్‌, కాక్క కాక్క
 • మామయ్య ప్రోత్సాహం : ప్రముఖ కెమెరామేన్‌ చోటా కె నాయుడు మా మామయ్య. ఆయన నన్ను ఎవ్వరికీ రికమండ్‌ చేయలేదు. కానీ, నా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవడానికి కావాల్సిన సలహాలు ఇస్తుంటారు
 • డ్రీమ్‌రోల్‌ : భిన్న పార్శ్వాలున్న పాత్రల్లో నటించాలనుంది. అందుకే 'ప్రస్థానం'లో విలన్‌గా నటించాను
 • నమ్మే సిద్ధాంతం : ఏ పనైనా కష్టపడి ఇష్టపడి చేయాలి. కాస్త ఆలస్యంగానైనా ఫలితం వచ్చి తీరుతుంది.
నటించిన సినిమాలు (filmography ): 
 • స్నేహగీతం,
 • రొటీన్ లవ్ స్టొరీ
 • డీకే బోస్
 • 'షోర్‌ ఇన్‌ ద సిటీ
 • 'గుండెల్లో గోదారి'
 • ===========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog