Thursday, February 14, 2013

రాజేంద్రప్రసాద్‌.వి.బి.,Rajendraprasad.B.V

 •  
-
 •  
పరిచయం (Introduction) :
 •  నిర్మాణ బృందం కోసం--దక్షత గల చిత్ర నిర్మాతలలో ఒకరైన వి.బి.రాజేంద్రప్రసాద్‌ 1959 నుంచి చిత్రాలు నిర్మించారు. 'అన్నపూర్ణ' పేరుతో తొలి సినిమా తీశారు. అందరికీ అన్నంపెట్టే అన్నపూర్ణగానే తన నిర్మాణ సంస్థని నడిపారు. 1975లో శోభన్‌బాబు, మంజులతో 'పిచ్చిమారాజు'' తీశారు. విశేషం ఏమిటంటే- ఈ సినిమా ఆయన కోసం కాదు- తొలి నుంచి తన సంస్థలో పనిచేస్తున్న బృందం కోసం! ఈ చిత్రం మీద లభించే ప్రతిపైసా వారి కోసమే! ఇలా ఎవరూ మళ్లా తమ చిత్రనిర్మాణ బృందం కోసం అని, చిత్రనిర్మాణం చెయ్యలేదు!
జీవిత విశేషాలు (profile) :
 •  పేరు : రాజేంద్రప్రసాద్ బి.వి.(సినీ నిర్మాత ),
 • పుట్టినతేదీ : 04 నవంబర్ 1932,
 • పుట్టిన ఊరు : గుడివాడ (ఆంధ్రప్రదేశ్ ),
 • నివాసము : హైదరాబాద్ , 
 • మరణము : 12- జనవరి -2015.
 • పిల్లలు : కొడుడు : జగపతి బాబు (నటుడు),


Tue, January 13, 2015-    Eenadu --చిటపట చినుకులు కన్నీళ్లు పెడుతున్నాయి : died on 12-01-2015.

    కొసరి కొసరి వడ్డించే నిర్మాత. కడుపు నిండేదాకా అన్నం పెట్టే నిర్మాత. 'అన్నపూర్ణ' పేరుతో తొలి సినిమా తీశారు. అందరికీ అన్నంపెట్టే అన్నపూర్ణగానే తన నిర్మాణ సంస్థని నడిపారు. మాటల సందర్భంలో... విలువలున్న నిర్మాత, అభిరుచి గల దర్శకుడు అని అలవోకగా చెప్పేస్తుంటాం. ఆ మాటకి అసలైన నిర్వచనం ఇచ్చారు వి.బి.రాజేంద్రప్రసాద్‌. పరిశ్రమలో ఒక్కో రోజు ఒక్కో నిర్మాత కింద పనిచేస్తుంటారు నటీనటులు, కార్మికులు. ఆ నిర్మాతల్ని, సంస్థల్ని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకొంటారో తెలియదు కానీ... జగపతి ఆర్ట్స్‌లో పనిచేసిన వాళ్లు మాత్రం ఆ సంస్థని ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ సంస్థ అధిపతి వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఆత్మీయత అలా ఉండేది అంటుంటారు. సినిమాకి అమ్మానాన్న నిర్మాతే అంటుంటారు. సరిగ్గా పనిచేయలేకపోతే నాన్నలా దండించి, భోజనం దగ్గరికి వచ్చేసరికి అమ్మలా అన్నం పెట్టి అది నిజం అని చాటిచెప్పిన నిర్మాత వీబీ. తన సంస్థను నమ్ముకున్న వారి కోసం సినిమాలు నిర్మించి లాభాలు పంచిన మనసున్న నిర్మాతగా రాజేంద్రప్రసాద్‌కి పేరుంది.

నటుడు కావాలనుకొని పరిశ్రమలోకి అడుగుపెట్టారు వి.బి.రాజేంద్రప్రసాద్‌. అనుకోకుండా నిర్మాతగా మారారు. రచయితగా, దర్శకుడిగా పలు రూపాల్లో పరిశ్రమకు సేవలందించారు. తన వారసుడు జగపతిబాబు రూపంలో ఓ మంచి నటుడిని పరిశ్రమకు అందించారు. 'జీవితంలో మలుపులు చాలానే చోటు చేసుకొంటుంటాయి. అయినా భయపడకూడదు. ప్రతీ మలుపూ మన మన మంచికే అనుకోవాల'ని చెప్పేవారు వీబీ.

ఏఎన్నార్‌తో అనుబంధం: కాకినాడ పి.ఆర్‌. కళాశాలలో బీఎస్సీ చదివే రోజుల్లోనే వీబీకి నాటకాలతో అనుబంధం ఏర్పడింది. అప్పట్లో ఆత్రేయ నటించిన 'కప్పలు' నాటకంలో ఆయన కథానాయిక పంకజం పాత్రను ధరించి, ఉత్తమనటి బహుమతి పొందడం విశేషం. ఆ తర్వాత ఆయన దృష్టి సినిమాల వైపు మళ్లింది.

'దేవదాసు' చిత్రం శతదినోత్సవం కోసం అక్కినేని నాగేశ్వరరావు కాకినాడ వచ్చినప్పుడు ఆ చిత్ర బృందానికి విందు ఇచ్చారు వీబీ రాజేంద్రప్రసాద్‌. ఆ సందర్భంలోనే అక్కినేని నాగేశ్వరరావుతో అనుబంధం ఏర్పడింది. సినిమాల్లోకి వెళ్లాలనుకొన్నాక ఏఎన్నార్‌ని కలిసి నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అవకాశాలు రాలేదు. ఇంట్లోవాళ్లు ఇచ్చిన రూ: 50వేలతో మిత్రుడైన పర్వతనేని రంగారావుతో కలిసి జగపతి చిత్ర నిర్మాణ సంస్థను ఆరంభించారు. వి.మధుసూధనరావు దర్శకత్వంలో 'అన్నపూర్ణ' చిత్రాన్ని నిర్మించారు. అది ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 'ఆరాధన' తీశారు. ఆ తర్వాత రంగారావు మరణించడంతో సొంతంగా సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. ఆయన నిర్మించిన తొలి ఏడు సినిమాల పేర్లు 'అ, ఆ' అనే అక్షరాలతోనే మొదలవ్వడం విశేషం.
దర్శకుడిగా తన తొలి చిత్రమైన 'దసరాబుల్లోడు'తోనే సినీ అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన రాజేంద్రప్రసాద్‌ మొత్తం 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బంగారు బాబు (1973), మంచి మనుషులు (1974), బంగారు బొమ్మలు, ముద్దుల కొడుకు (1979) ఎస్‌.పి. భయంకర్‌ (1984), కెప్టెన్‌ నాగార్జున (1986) తదితర చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం 34 చిత్రాలను నిర్మించారు. వీటిలో 28 తెలుగు చిత్రాలు. 2003లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. నిర్మాతగా అంతస్తులు (1965) చిత్రానికి రాష్ట్రపతి నుంచి రజత పతకం పొందారు. ఆరాధన (1962), ఆత్మబలం (1964), అంతస్తులు (1965), ఆస్తిపరులు (1966), అదృష్టవంతులు (1969), అక్కాచెల్లెలు (1970) తదితర గొప్ప చిత్రాలను నిర్మించారు.
హేమాహేమీలు ఈ సంస్థ నుంచే: తన ఎనిమిదో సినిమాతో కొత్త పుంతలు తొక్కారు. ఆ చిత్రానికి రంగులద్దడంతో పాటు 'అ' వదిలిపెట్టి 'దసరాబుల్లోడు' పేరుతో ఆ సినిమా తీశారు. దానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే దర్శకుడి పాత్రనీ స్వీకరించారు. తెలుగు చలన చిత్ర సీమలో హేమాహేమీలంతా కూడా ఆయన సంస్థలోనే, ఆయన దర్శకత్వంలోనో నటించినవాళ్లే. ఏఎన్నార్‌- ఎన్టీఆర్‌ కలయికకు దర్శకత్వం వహించే అరుదైన అవకాశం పొందిన నిర్దేశకుల్లో రాజేంద్రప్రసాద్‌ ఉండటం విశేషం. నిర్మాణ సంస్థకి గ్లామర్‌ అద్దిన నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్‌ అనే చెప్పాలి. నిర్మాతగా 34 సినిమాలు తీస్తే అందులో 28 తెలుగు సినిమాలు. చాలా మటుకు విజయవంతమైనా కొన్ని నష్టాలనూ తెచ్చిపెట్టాయి. 'పది సినిమాలు విజయం సాధించడం ఒకెత్త్తెతే, ఒక సినిమా నష్టం చూడటం మరో ఎత్తు. అందుకే నేను చాలా నష్టపోవాల్సి వచ్చింది' అనేవారు వి.బి.రాజేంద్రప్రాద్‌. 'దసరాబుల్లోడు' చిత్రానికి ఏఎన్నార్‌ ప్రోద్బలంతోనే దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో 13 చిత్రాలకి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ కోరిక అలా తీరింది: కథానాయకుడిగా తనని తాను తెరపై చూసుకోవాలనుకొన్నారు వీబీ రాజేంద్రప్రసాద్‌. ఆయన కోరిక నెరవేరలేదు. కానీ తన కుమారుడు జగపతిబాబు కథానాయకుడు కావడంతో 'నా కోరిక నా కొడుకు రూపంలో నెరవేరింది' అనేవారు వీబీ రాజేంద్రప్రసాద్‌.


 • దైవసన్నిధిలో..: హైదరాబాద్‌లో ఫిలింనగర్‌ సొసైటీకి పదిహేనేళ్లపాటు సేవలందించారు వీబీ రాజేంద్రప్రసాద్‌. ఫిలింనగర్‌ అభివృద్ధిలోనూ, ఫిలింనగర్‌ దైవసన్నిధానం నిర్మాణంలోనూ వీబీ పాత్ర చాలా కీలకమైనది. ఫౌండర్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా ఉంటూ దైవ సన్నిధానం అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేశారు. అక్కడ 16 దేవాలయాలు ఏర్పాటు కావడంలో వీబీ కీలక పాత్ర పోషించారు. విశ్రాంత జీవితం అంతా ఆయన దైవసన్నిధానంలోనే గడిపారు. వీబీ రాజేంద్రప్రసాద్‌ మరణానికి సంతాప సూచికంగా మంగళవారం ఫిలింనగర్‌ సొసైటీని, దైవసన్నిధాన్ని మూసేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.


 సినిమాలు (filmography ):
 •  Filmography--Producer | Director | Writer

 • Producer (14 titles)

 • 1991 కిల్లర్ , Killer (producer)
 • 1988 ఖత్రోన్‌ కీ కిలాడీ ,Khatron Ke Khiladi (producer)
 • 1988 భార్యా భర్తల భందం ,Bharyabhartala Bandam (producer)
 • 1986 కెప్టెన్‌ నాగార్జున ,Captain Nagarjuna (producer)
 • 1983 బెరార్ ,Bekaraar (producer)
 • 1983 ఎస్.పి.భయంకర్ -SP Bhayankar (short) (producer)
 • 1982 రాస్తె ప్యార్ కీ-Raaste Pyar Ke (producer - as V.B. Rajendra Prasad)
 • 1971 దసరా బుల్లోడు -Dasara Bullodu (producer)
 • 1970 అక్కా చెల్లెల్లు-Akka Chellelu (producer)
 • 1969 అదృష్టవంతులు -Adrushtavanthalu (producer)
 • 1966 ఆస్తిపరులు-Aastiparulu (producer)
 • 1965 అంతస్తులు-Antastulu (producer)
 • 1964 ఆత్మబలం-Aatma Balam (producer)
 • 1962 ఆరాధన-Aradhana (producer)

-Director (14 titles)

 • 1988 భా్ర్యా భర్తల బంధం -Bharyabhartala Bandam
 • 1986 కెప్టెన్‌ నాగార్జున్‌ -Captain Nagarjuna
 • 1983 బెకరార్-Bekaraar
 • 1983 ఎస్.పి. భయంకర్-SP Bhayankar (short)
 • 1982 రాస్తే ప్యార్ కి -Raaste Pyar Ke (as V.B. Rajendra Prasad)
 • 1979 పట్టక్కట్టి బైరవన్‌-Pattakkatti Bairavan
 • 1978 రామక్రిష్ణులు-Ramakrishnulu
 • 1977 బంగారు బొమ్మలు-Bangaru Bommalu
 • 1976 ఉత్తమన్‌-Uthaman
 • 1975 పిచ్చిమారాజు-Pichimaraju
 • 1974 మంచిమనషులు-Manchi Manushulu
 • 1973 ఎంగల్ తంగ రాజ-Engal Thanga Raja
 • 1972 బంగారు బాబు-Bangaru Babu
 • 1971 దసరా బుల్లోడు-Dasara Bullodu

-Writer (1 title)
 • 1986 కెప్టెన్‌ నాగార్జున్‌(story & screenplay)
అవార్డులు : 

National Film Awards.
    National Film Award for Best Feature Film in Telugu - Antastulu (1965).

Filmfare Awards.
    Filmfare Award for Best Film – Telugu - Antastulu (1965).
    Filmfare Award for Best Film – Telugu - Aastiparulu (1966).

Nandi Awards.
    Raghupathi Venkaiah Award (2003) - Lifetime achievement.

Other honors.
    K. V. Reddy memorial Award (2000).

 • ======================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog