Andrea Jeremiah - ఆండ్రియా జెరేమియా

-


పరిచయం (Introduction) :


  • తెలుగులో నాగ చైతన్య సరసన ‘భలే తమ్ముడు’ చిత్రంలో నటీస్తోంది. దీంతో తెలుగునాట కూడా ఆండ్రియామాయ ప్రారంభం కానుంది.
  •  తమిళనాడులోని ఒక ఆంగ్లో-ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫ్యామిలీలో జన్మించిన ఆండ్రియాకు చిన్ననాటి నుంచే కళలన్నా, సాహిత్యమన్నా మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే తొలుత నేపథ్యగాయకురాలిగా తెరంగేట్రం చేసి ఆ తరువాత నటిగా, వాయిస్‌ యాక్టర్‌గా తమిళ, తెలుగు భాషల్లో తనదైన శైలిలో దూసుకుపోతోంది.

- చెనై్నలోని తన బాల్యాన్ని గడిపిన ఆమె కళాశాల విద్యాభ్యాసాన్ని మహిళల క్రిస్టియన్‌ కళాశాల నుంచి పూర్తి చేసింది.
* ఆమె తండ్రి చెనై్న హైకోర్టులో న్యాయవాదిగా మంచి పేరు సంపాదించారు.
* పది సంవత్సరాల వయసులోనే జాక్సన్‌ ఫై స్టైల్‌ ట్రూప్‌ను పోలిన ‘యంగ్‌ స్టార్స్‌’ అనే బృందంలో చేరింది. అక్కడే ఆమె సింగింగ్‌ కెరీర్‌ ప్రారంభ మైంది. కళశాల విద్యాభ్యాసం సమయంలోనే రంగస్థల నట ప్రవేశం చేసి పలు డ్రామాలలో నటించింది.
* గౌతం మీనన్‌ చిత్రం ‘వెట్టైయాడు విలైయాడు’ లో ఒక పాట పాడి సినీ కెరీర్‌ను ప్రారంభించింది. వెట్టైయాడు విలైయాడు మంచి విజయం సాధించడంతో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే సింగర్‌గా కాదు... నటిగా. చిత్ర సీమను ఇందుకే కాబోలు విచిత్ర సీమ అంటారు. దర్శకుడు కావాలనుకున్న అర్జున్‌ హీరో అయ్యాడు. హీరో అవ్వాలనుకున్న శంకర్‌ స్టార్‌ దర్శకుడయ్యాడు. సింగర్‌ కావాల్సిన ఆండ్రియా యాక్టింగ్‌లో రాణించింది.

* 2005లో ‘కండనాల్‌ ముదల్‌’ చిత్రంలో అతిథి పాత్రలో తెరంగేట్రం చేసి... 2007లో ‘పచైకిలి ముత్తుచరణ్‌’ చిత్రంతో పూర్తిస్థాయి కథానాయికగా పరిచయమైంది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ తెరంగేట్ర నటిగా విజయ అవార్డుకు నామినేట్‌ అయ్యింది.
- కొంచెం గ్యాప్‌ తరువాత అంటే 2010లో ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’ చిత్రంలో నటనకు ఫిలింఫేర్‌ ఉత్తమ నటిగా నామినేట్‌ అయ్యింది.
* అనంతరం ‘ఒరుకల్‌ ఒరు కన్నాడి’, ‘శగుని’, ‘నడువుల కొంజం పక్కత కానోమ్‌’ వంటి తమిళ చిత్రాలలో నటించింది.

* ప్రస్తుతం కమల్‌హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు ‘విశ్వరూపం’లో కీలక పాత్రపోిషిస్తోంది. విశ్వరూపం త్వరలో విడుదల కానుంది.
  • * తెలుగులో నాగ చైతన్య సరసన ‘భలే తమ్ముడు’ చిత్రంలో నటీస్తోంది. దీంతో తెలుగునాట కూడా ఆండ్రియామాయ ప్రారంభం కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

 జీవిత విశేషాలు (profile) :
  • పూర్తి పేరు    : ఆండ్రియా జెరేమియా
  •     పుట్టిన తేది    : డిసెంబర్‌ 21, 1984
  •     జన్మస్థలం    : అరక్కోణం, తమిళనాడు
  •     వృత్తి    : నటి, గాయనీ, వాయిస్‌ యాక్టర్‌
  •     కెరీర్‌ ప్రారంభం: 2007
  •     తొలి చిత్రం    : కండనాల్‌ ముదల్‌ (2005)
  •     తాజా చిత్రం    : వాడ చెనై్న (ఫిల్మింగ్‌)
తెలుగులో ఆమె పాడిన కొన్ని పాటాలు

  •     జర జర (రాఖీ)
  •     గిల్లి గిల్లి (దేశముదురు)
  •     నేను నీ రాజా (కింగ్‌)
  •     అమ్మాయిలు (కరెంట్‌)
  •     దివాళి దీపాన్నీ (దడ)

నటించిన సినిమాలు (filmography ):

తమిళం  :

    2005లో ‘కండనాల్‌ ముదల్‌’ చిత్రంలో అతిథి పాత్రలో తెరంగేట్రం

    2007లో ‘పచైకిలి ముత్తుచరణ్‌’ చిత్రంతో పూర్తిస్థాయి కథానాయిక

    2010లో ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’

    ఒరుకల్‌ ఒరు కన్నాడి’,

    ‘శగుని’,

    ‘నడువుల కొంజం పక్కత కానోమ్‌’

తెలుగు :

    బలేతమ్ముడు ,

    లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ‘గుండెల్లో గోదారి’

హిందీ:

    2012 -    Vishwaroop.

మళయాలం  :

    2012     Annayum Resulum    
    

  • ====================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala