Srinivas , Srinu Master, శ్రీనివాస్ , శ్రీనుమాష్టార్

పరిచయం (Introduction) :
  • మూడు తరాల డాన్స్‌మాస్టర్‌ 'శీనుమాస్టర్‌'--'శ్రీరామరాజ్యం' చిత్రంలో మళ్లీ చాలా కాలానికి సంప్రదాయ నృత్యాలను చూపించిన నాట్య దర్శకుడు శ్రీనివాస్‌ని అందరూ 'శీనుమాస్టర్‌' అని పిలుస్తారు. నాటి ప్రసిద్ధ డాన్స్‌ డైరక్టర్‌ హీరాలాల్‌ దగ్గర నాట్యాభ్యాసం చేసి, ఎన్నో సినిమాలకు సహాయకుడిగా పనిచేసి, నాట్య దర్శకుడైన శ్రీనివాస్‌ దాదాపు వెయ్యి చిత్రాలకు డాన్స్‌ డైరక్టరుగా పనిచేశారు. వీటిలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలి వంటి పలు చిత్రాలున్నాయి
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : శ్రీను మాష్టార్ ,శ్రీనివాస్ ,
  • ఊరు : ఆదోని ,
  • నివాసము : మద్రాస్ ,
  • బావగారు : హీరాలాల్ మస్టారు ,
కెరీర్ (career)
  • శ్రీనివాస్‌... తన మాటల్లో ..........''అసలు నాకు డాన్సు అంటే ఏమీ తెలీదు. చిన్నతనంలో అల్లరి చిల్లరగా తిరుగుతున్నానని మా అక్కయ్య నన్ను ఆదోని నుంచి మద్రాసు తీసుకొచ్చింది. హీరాలాల్‌ మాస్టారు మా బావగారు. నాకు పదహారేళ్ల వయసులో ఒకరోజు బావగారు 'ఏరా డాన్సు నేర్చుకుంటావా?' అని అడిగారు. డాన్సు రిహార్సల్సు చూశాను గనక, ఏదో ఉత్సాహం కలిగి 'అలాగే' అన్నాను. సుందర ప్రసాద్‌గారని, మా బావగారికి మేనమామ. కథక్‌ నాట్యం అభ్యసించి, ప్రదర్శనలు ఇచ్చేవారు. ఢిల్లీలో ఉంటారు. రవీంద్రభారతిలో ప్రొఫెసర్‌. ఆయన ఒక నెలరోజులపాటు నాకు నాట్యం నేర్పి, ఢిల్లీ వెళ్లిపోయారు. అంతే! నాకు ఉత్సాహం పెల్లుబికింది. బావగారి దగ్గర క్షుణ్ణంగా నేర్చుకున్నాను. నేర్చుకోడం అంటే తెల్లవారు జామున 3 గంటల నుంచి, రాత్రి 10 గంటల వరకూ అభ్యాసమే! ఒళ్లు హునమైపోయేలా నేర్పారు. ఆ కఠినమైన శిక్షణ సంవత్సరం పైగా సాగింది. 1957లో హీరాలాల్‌ మాస్టారు జెమిని స్టూడియోకి తీసుకెళ్లి తన సహాయకుడిగా నన్ను పరిచయం చేశారు. ఆ తమిళ చిత్రం పేరు 'వంజికొట్త్టె వాలిబన్‌'. 'విజయకోటవీరుడు' పేరుతో తెలుగుకి అనువదించారు''
సినిమాలు (filmography ):ఆయనకు పేరు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు :
  • తొలి సినిమా 'నేనంటే నేనే' (1968).
  • 'సింహాసనం', '
  • దేవుడు చేసిన మనషులు', '
  • పండంటి కాపురం', '
  • గాంధి పుట్టిన దేశం',
  • 'గాజుల కిష్టయ్య', '
  • దేవదాసు',
  • 'సంసారం',
  • 'రాధా గోపాలం',
  • 'పెళ్లి పుస్తకం',
  • 'సుందరకాండ',
  • 'కాంచనసీత', '
  • శ్రీనాథ కవి సార్వభౌమ',
  • 'భక్త కన్నప్ప',
  • 'అల్లూరి సీతారామరాజు',
  • 'శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి',
  • 'అగ్నిపూలు',
  • 'స్వర్ణ కమలం', '
  • శుభ సంకల్పం', '
  • ఏకలవ్య', '
  • బృందావనం',
  • 'శ్రీకృష్ణార్జున విజయం'
  • 'నిప్పులాంటి మనిషి'
అవార్డులు :
  • శ్రీనుమాస్టారుకి చాలా అవార్డులు వచ్చాయి. 1981లో 'సితార' పత్రిక ఉత్తమ నాట్య దర్శకుడిగా బహుమతి అందజేసింది. (చిత్రం: అగ్నిపూలు) జాతీయ స్థాయిలో అవార్డు దక్కలేదు గాని, నంది అవార్డులు వచ్చాయి.
మూలము : రావికొండలరావు గారి పాతబంగారం .
  • =================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala