Abhinaya - అభినయ

పరిచయం (Introduction) :
  • తెలుగు "శంభో శివ శంభో " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి . ఈమెకు పుట్టుకతో మూగ , చెవుడు . తమిళ కుటు౦బానికి చె౦దిన హైద్రాబాద్ అమ్మాయి. ఆమె తల్లిద౦డ్రులు తమిళనాడును౦చి వచ్చారు. ఆమె పుట్టి౦దీ, పెరిగి౦దీ, హైద్రాబాద్ లోనే..

  • మోడల్‌గా రాణించి నటిగా వెలుగొందుతున్న అభినయ నిజంగా అభినయానికి పెట్టింది పేరుగా ప్రశంసలు అందుకొంటోంది. మూగ, చెవిటితనంతో బాధపడుతున్నప్పటికీ అవేవీ ఆమె కళాతృష్ణకు అడ్డు రాలేకపోయాయి. శశికుమార్‌ నటించిన, సముతిరకని దర్శకత్వం వహించిన నాడొదిగళ్‌ అనే తమిళ సినిమాతో ఆమె తన సినిమా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. కన్నడ లోనూ అది రీమేక్‌ కావడం విశేషం. ఆమె తండ్రి ఆనంద్‌వర్మ కూడా నటుడే. కేరళలో ఉన్నప్పుడు ఆయన పలు చిత్రాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా స్టాలిన్‌లో ఆయన సెక్యూరిటీ అధికారి పాత్ర పోషించారు. ఈమె 2009 లో "నాదోదిగల్" అనే  తమిళ చిత్రంతో రంగప్రవేశం చేసింది.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : అభినయ .
  • పూర్తిపేరు : అభినయ ఆనంద్ ,
  • పుట్టి పెరిగింది : హైదరాబాద్ లో ,
  • తండ్రి  : ఆనంద్‌వర్మ కూడా నటుడే,
కెరీర్ :
  • సినిమా షూటింగ్‌ సమయంలో తండ్రితో పాటు వచ్చే అభినయను ఆయన గమనించి ఎం.శశికుమార్‌కు ఆమె పేరును సూచించారు. నాడొదిగళ్‌, శంభో శివ శంభో సినిమాల్లో నటనకు గాను ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ సపోర్ట్‌ నటి అవార్డు కూడా పొందింది. 2010లో శశికుమార్‌ దర్శకత్వం వహించిన ఈశన్‌ చిత్రంలోనూ అభినయ నటించింది. హుదుగరు (కన్నడ), 7ఎఎం అరివు (తమిళం) చిత్రాల్లోనూ నటించింది. విలేఖరులు చేతితో రాసి అడిగే ప్రశ్నలకు ఆమె తన లాప్‌టాప్‌లో టకటకా టైప్‌ చేసి సమాధానాలివ్వడం విశేషం. ఆమె ఎక్కడికి వెళ్ళినా లాప్‌టాప్‌ను వెంట తీసుకెళ్తూ ఇతరులతో తన భావాలను పంచుకుంటుంది. సినిమా అంటే చిన్నప్పటి నుంచి కూడా తనకెంతో ఇష్టమని అభినయ చెబుతుంది. వెండితెరపై తాను ‘మాట్లాడుతుంటే’ తన తల్లి ముఖం ఆనందంతో వెలిగిపోతుందని సంతోషంగా టైపు చేసి చెబుతుంది అభినయ. మొదటి సినిమాలో కెమెరాను ఫేస్‌ చేయడం తనకెంతమాత్రం కష్టం కాలేదని, షూటింగ్‌లు చూస్తూ ఉండడం వల్ల అది అలవాటైపోయిందని అంటుంది ఆమె.
నటించిన తెలుగు సినిమాలు (filmography ):
  • శంభో శివ శంభో(2010) ,
  • దమ్ము ‌ (2012),
  • ఢమరుకం (2012),
  • జీజియస్ (2012),
  • సీతమ్మ వాకి్ట్లో సినిమల్లె చెట్తు (2013), 
  • మహంకాళి (2013), 
  • చంద్రుడు (2014),
other languages : 2009
  • -- Naadodigal Pavithra Natraj Tamil
2010---
  • Aayirathil Oruvan--- Cholan's daughter Tamil
  • Shambo Shiva Shambo --- Telugu Winner, Filmfare Award for Best Supporting Actress - Telugu
  • Easan Poorani --- Tamil
2011 --
  • Hudugaru --- Kannada
  • 7aum Arivu --- Bodhidharma's wife Tamil
  • The Reporter --- Malayalam Filming
2012--
  • Dammu--- Telugu Filming

  • ================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. ఇంత అందమైన అమ్మాయికి మాటలు రాక పోవడం దేవుడు చేసిన అన్యాయం అనిపిస్తోంది.

    ReplyDelete
  2. అభినయ కేరళ అమ్మాయి కాదు. తమిళ కుటు౦బానికి చె౦దిన హైద్రాబాద్ అమ్మాయి. ఆమె తల్లిద౦డ్రులు తమిళనాడును౦చి వచ్చారు. ఆమె పుట్టి౦దీ, పెరిగి౦దీ, హైద్రాబాద్ లోనే..

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala