Tuesday, September 6, 2011

రాకుల్ ప్రీత్ సింగ్ , Rakul preeth singh

పరిచయం (Introduction) :
 • అనేక ప్రధాన బ్రాండ్లకు ముద్రణామాధ్యమం లో ఎన్నో వాణిజ్యప్రకటలను చేసిన రాకుల్ ప్రీత్ సింగ్ ను చూడగానే ముఖం సుపరిచితం గానే ఉన్నట్లు అనిపిస్తుంది . మోడలింగ్‌ నుంచి వెండి తెరకు పరిచయమైన ఢిల్లీ భామ రకూల్‌ ప్రీత్‌సింగ్‌. రెబల్‌స్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన యువహీరో సిద్ధార్థ్‌ రాజ్‌కుమార్‌ సరసన ‘కెరటం’ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమ కు పరిచయమైంది ఈ సుందరి. సినిమా ద్వితీయార్థంలో వచ్చే పాత్ర అయినా.. తనదైన నటనతో ఆకట్టుకుంది ‌‌‌. ప్రస్తుతం తన తొలి సిని మా ‘కెరటం’ తమిళ్‌, మలయాళంలోకి కూడా అనువాద మవు తోంది. అక్కడ రిలీజ్‌లతో ఈ అమ్మడిని మరిన్ని అవకాశాలు వరించే అవకాశముంది. ఇప్పటికే ఓ దక్షిణాది సినిమాకి సంతకం చేసిందని సమాచారం. ‘కెరటం’ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ సోదరుడు గౌతమ్‌ పట్నాయక్‌ దర్శకుడు. ఎస్వీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్‌. వి.బాబు నిర్మించారు. టీనేజి యువతను ఆక ట్టుకునే కథాంశంతో రూపొందిన చిత్రమిది.
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : రాకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh,
 • జన్మస్థలము : న్యూడిల్లీ ,
 • పుట్టిన తేదీ : 10- Octo - 1990,
 • చదువు : బి.ఎ. హానర్స్ (మేధమెటిక్స్ ),
 • నాన్న  : రాజేంద్ర సింగ్ - ఆర్మీ లో పని , 
 • అమ్మ : కుల్విందర్ సింగ్ -గృహిణి , 
 • తోబుట్టువులు : లేరు , 
 • ఎత్తు : 5' 8'' ,
 • బరువు : 57 కి.లో.( ఆగస్ట్ 2011 నాటికి ),
 • ఫెవరెట్ నటుడు : షార్క్ ఖాన్‌ ,
 • ప్రేమంటే : ఎటర్నల్ ,
 • సృస్టిలో శరీరమంటె : ఆత్మకు దేవాలయు ,

    ఇష్టాయిష్టాలు ఇవిగో.


* నటికాకపోయుంటే...లెక్కల ప్రొఫెసర్‌, గోల్ఫ్‌ క్రీడాకారిణి, వ్యాపారవేత్త,
* అభిమాన నటులు--పవన్‌ కల్యాణ్‌,షారూఖ్‌ ఖాన్‌,అమీర్‌ఖాన్‌,
* మీ గురించి తెలియనివి---సినిమాల్లో ఏడుపు సీన్లు చూసి ఏడుస్తా. నల్లబడతానని ఆటలకు దూరమయ్యా. ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించే వాళ్లని అభిమానిస్తా.
* క్రీడాకారులు===సైనా నెహ్వాల్‌, సచిన్‌ టెండూల్కర్‌, మేరీకోమ్‌,
* ఎప్పుడూ బ్యాగులో ఉండేవి==పెన్ను, పుస్తకం, లిప్‌బామ్‌,
* నచ్చిన సినిమాలు==నమస్తే లండన్‌, కల్‌ హో న హో, హ్యాంగోవర్‌,
* పేరు తెచ్చిన ప్రకటనలు==బిగ్‌బజార్‌, వాల్‌మార్ట్‌, శామ్‌సంగ్‌,
* నటించిన భాషలు==తెలుగు, తమిళం, హిందీ,
* ఖాళీ సమయాల్లో==బాగా తాగుతా. అమ్మ వంట చేస్తుంటే గమనిస్తా. స్నేహితులతో ఛాటింగ్‌.
* చక్కని శరీరాకృతి కోసం==జిమ్‌ కెళతా, చాలాసేపు డాన్స్‌ చేస్తా, ఈత కొడతా,
* బలాలు==అమ్మా, నాన్నా, చురుకుదనం,
* ఇష్టంగా ధరించే దుస్తులు==చీర, ఈవెనింగ్‌ గౌన్‌, కుర్తా,
* కాబోయే వాడు ఎలా ఉండాలంటే...==పొడువుగా, సన్నగా, తెలివితేటలతో...,
* బాగా ఇష్టపడే పాత్రలంటే... =='బ్లాక్‌'లో రాణీ ముఖర్జీ, 'ఫ్యాషన్‌'లో ప్రియాంకా చోప్రా, 'క్వీన్‌'లో కంగన చేసిన పాత్రలు,
* చివరిగా మూడు మాటలు...==వ్యక్తిగత క్రమశిక్షణ ఎక్కడైనా నిలబెడుతుంది. ఆత్మవిశ్వాసమే అందాన్నిస్తుంది. ఎత్తుపల్లాలుంటేనే జీవితం విలువ తెలుస్తుంది.

Courtesy with : eenadu vasundara news paper 8:25 AM 12-Aug-14

నటించిన సినిమాలు (filmography ):
 • 2009 - -గిల్లి ( కన్నడ ),
 • 2012 - -తండైయెరా తాక్క (Thadaiyara Thaakka) ( తమిళం )
 • 2011 --కెరటం ( తెలుగు ),
2013-
 • -వెంకటాద్రి ఎక్షుప్రస్-Telugu , 
 • 2013- -ఆటొనగర్ సూర్య -Telugu, 
 •  2013- -రఫ్ (Rough)-Telugu,
2014 : 
          --yaariyaan (Hindi),
          --Yennamo Yedho(Tamil),

 • =================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog