Raghavacharya Ballari - రాఘవాచార్య బళ్ళారి

పరిచయం (Introduction) :
  • సినిమాలు రుచించని మహా నటుడు -రంగస్థలం మీద మహానటులనిపించుకున్న వాళ్లలో కొందరు సినిమాలకి వచ్చినా వారికి ఈ వాతావరణం నచ్చలేదు. రంగస్థలం మీద పొందే ఆనందం, అనుభవం వాళ్లకి సినిమాల్లో లభించలేదు. రంగస్థలం మీద నటిస్తున్నప్పుడు ఎదురుగా ప్రేక్షకులు మాత్రమే వుంటారు. సినిమాలకి అలా కాదు. నటులకీ ప్రేక్షకులకీ మధ్య, దర్శకుడు, ఛాయాగ్రహకుడు, ఎడిటరు, టెక్నీషియన్లూ వీళ్లందరూ 'అడ్డం'గా వుంటారు. సినిమా నటనని యాంత్రికంగా భావించారు. ఈ యంత్రాలకీ ఇక్కడి టెక్నిక్‌కీ లోబడని నటులు సినిమాలకి ఉద్వాసన చెప్పేశారు. బళ్లారి రాఘవాచార్య వంటి గొప్ప రంగస్థల నటుడికి అలాంటి ఇబ్బందే ఎదురైంది. మూడే మూడు సినిమాల్లో నటించారు. ఆ తరవాత సినిమాలు వద్దనుకున్నారు. రంగస్థలం మీద ఆయన నటించిన హిరణ్యకశిపుడు, రావణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రల్ని విశ్లేషించి, ఆయన నూతన కోణంలో ఆవిష్కరించారు. హిరణ్యకశిపుడు ఒక తండ్రి. ఏ తండ్రీ కొడుకుని బాధలుపెట్టడు. కాని, పెట్టవలసి వచ్చినందుకు హిరణ్యకశిపుడు తండ్రిగా బాధపడాలి కదా! రాఘవచార్య ఆ పాత్రని అలా తీర్చిదిద్దారు. అలాగే రావణుడు, దుర్యోధనుడూ, వీళ్లందర్నీ క్రూరులుగానే చిత్రించారు కవులు. కాని, వీళ్లకీ మనసు వుంటుందని, మానసిక విశ్లేషణ చేసుకోలేనంత మూర్ఖులు కాదనీ రాఘవచార్య ఆ పాత్రల్ని మార్చారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : బళ్ళారి రాఘవాచార్య ,
  • పుట్టిన తేదీ : 02 ఆగస్ట్ 1880. ,
  • పుట్టిన ఊరు : తాడిపత్రి ,
  • మతము : హిందూ .. శ్రీవైష్ణవ ,
  • చదువు : లాయర్ ,
  • మరణము : 16 ఏప్రిల్ 1946. ,
నటించిన సినిమాలు (filmography ):
  • రైతుబిడ్డ --(1939),
  • చండిక --(1940),
  • మానవ సంరక్షణ --లొ దుర్యోధనుడు .
బిరుదులు :
  • రాఘవాచార్యకు బ్రిటిష్‌ ప్రభుత్వం 'రావు బహదూర్‌' బిరుదు ఇచ్చి గౌరవించింది.
మూలము : రావికొండలరావు గారి పాత బంగారము ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. నేను రాఘవాచార్యగారిని స్వయంగా చూసాను.ఆయన ఒక కార్యక్రమానికి అతిథి గా వచ్చారు.1945లో ,అంటే ఆయన మరణానికి కొన్ని నెలలు ముందు అన్నమాట.అప్పుడు నేను స్కూల్ ఫైనల్ చదువుతూవుండేవాణ్ణిప.హిరణ్యకశిపుడి వంటి పాత్రలు ధరించడానికి తగిన శరీరమూ ,ఎత్తూ,లేకపోయినా నటనా,వాచికం ద్వారా మెప్పించే వారు.ఆయన నటనని రవీంద్రనాథటాగూరు మెచ్చుకొన్నారు.ఇంగ్లండు లో కూడా షేక్స్పియర్ నాటకాల్లో పాత్రలువేసి మెప్పించారు. బళ్ళారిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసేవారు. ఆయన సినిమాల్లో ,అదీ రెండోసారి విడుదల ఐనప్పుడు ,రైతుబిడ్డలో రైతు నాయకుడుగా నటించినది మాత్రం చూశాను.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala