Thursday, April 21, 2011

Boddu Gopalam , బొడ్డు గోపాలం

పరిచయం (Introduction) :
 • బొడ్డు గోపాలం పాత కాలం దక్షిణ భారతదేశం సంగీత దర్శకుడు మరియు గాయకుడు . ఆల్ ఇండియా రేడిలో కొన్నాళ్లు సంగీతాన్ని అందించారు . Vocal Music and playing Violin విధ్యలను విజయవాడ ' వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి దగ్గర నేర్చుకున్నారు .
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : గోపాలం బొడ్డు ,
 • పుట్టిన ఊరు : తుల్లూరు - గుంటూరు జిల్లా ,
 • ఫుట్తిన తేదీ : 1927 - 2004
 • నాన్న : రామదాసు -- హరికథా ఆర్టిస్ట్ /సంగీత కళాకారుడు ,
రావి కొండలరావు గారి పాత బంగారం లో ఇలా వ్రాసిఉంది >
 • కళాకారుడూ గోపాలంగారు, 1927లో గుంటూరు జిల్లాలో పుట్టి, వయొలిన్‌ నేర్చుకుని, వయొలిన్‌తోపాటు గాత్రం కూడా నేర్చుకుని- ఎన్నో నాటకాల్లో పాడారు. కొన్నింటికి సంగీతం నిర్వహించారు. కొన్ని నాటకాల్లో నటించారు. ప్రజానాట్య మండలిలో కొంత కాలంపాటు సంగీతం నిర్వహిస్తూ పాటలు పాడేవారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన సంగీత రూపకాల్లో పాటలు పాడడం, పాత్రలు చదవడం చేసేవారు.
తాతినేని ప్రకాశరావుగారు 'పల్లెటూరు' (1952) డైరెక్టు చేస్తున్నప్పుడు, ఆయన పిలుపుతో గోపాలంగారు మద్రాసు చేరుకున్నాడు. ఆ సినిమాకి ఘంటసాలగారు సంగీత దర్శకుడు. ప్రకాశరావుగారు గోపాలంగారి గురించి చెప్పి, ఆయన దగ్గర సంగీత దర్శకత్వ శాఖలో చేర్పించారు. ఇది గోపాలంగారికి సినిమాల్లో మొదటి మెట్టు. తర్వాత ఘంటసాలగారి దగ్గర ఇంకో రెండు సినిమాలకీ, టి.వి. రాజుగారి దగ్గర రెండు మూడు సినిమాలకీ (తోడు దొంగలు, జయసింహ) సహాయకుడిగా చేశారాయన. మధ్యమధ్యలో సినిమాల్లో పాడారు; గ్రామఫోన్‌ రికార్డుల్లో పాడారు. నాగభూషణంగారు ముమ్మరంగా ప్రదర్శించిన 'రక్తకన్నీరు' నాటకానికి సంగీతం నిర్వహించిన ఘనత కూడా వుంది గోపాలంగారికి. బి.ఎన్‌.రెడ్డిగారికి ఒక అలవాటు వుండేది. సంగీత దర్శకుడిగా రాజేశ్వరరావుగారే వుండాలి. ''కాని, ఆ మహానుభావుడు ఎప్పుడొస్తాడో, ఎప్పుడు రాడో తెలీదు. అంచేత, కూడా ఒక అనుభవజ్ఞుడిని పెట్టుకునే వాడిని- ముందుగా ఒక 'ఐడియా' కోసం. 'మల్లీశ్వరి'కి అద్దేపల్లి రామారావు. 'రంగుల రాట్నం', 'బంగారు పంజరం' చిత్రాలకు గోపాలం వుండేవారు'' అని చెప్పేవారు రెడ్డిగారు. గోపాలంగారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్నా, చొరవ లేని కారణంగా ఎక్కువ చిత్రాలకు పని చెయ్యలేకపోయారు. ఎవరినీ అడిగేవారు కాదు; అడిగితే కాదనేవారూ కాదు. 'రంగుల రాట్నం'లో 'వెన్నెల రేయి చందమామ' (యస్‌.జానకితో) పాట, 'శ్రీకృష్ణార్జున యుద్ధం' (స్వర్ణలత)లో 'అంచెలంచెలు లేని మోక్షము' పాటలు బాగా గుర్తుంటాయి. ఆ పాట చంద్రమోహన్‌కీ, ఈ పాట అల్లురామలింగయ్యగారికీ పాడినప్పుడు, ఆ 'తేడా'తో పాత్రోచితంగా పాడారు గోపాలంగారు. 'నలదమయంతి', 'బికారి రాముడు' తర్వాత కొన్ని కన్నడ చిత్రాలకు కూడా గోపాలంగారు సంగీతం అందించారు. మధ్యమధ్యలో డబ్బింగ్‌ సినిమాలు చేశారు. తెలుగు సినిమాలుగా చెప్పుకోవాలంటే, 'అప్పగింతలు', 'రౌడీ రంగడు', 'పెద్దలు మారాలి', 'మునసబుగారి అల్లుడు', 'పుణ్యభూమి కళ్లు తెరిచింది', 'ఒక అమ్మాయి కథ', 'కరుణామయుడు' మొదలైనవి చెప్పుకోవచ్చు.
 • కొన్ని నాటకాలకీ, నాట్య ప్రదర్శనలకీ, రేడియో సంగీత రూపకాలకీ, భక్తిగీతాల డిస్క్‌ ఆల్బమ్‌లకీ ఆయన సంగీతం అందించినా, శోభన్‌బాబు, చలం, హరనాథ్‌, కన్నడ హీరో రాజ్‌కుమార్‌లకి కొన్ని సినిమాల్లో పాడినా- ఆడంబరమైన జీవితం అనుభవించలేదాయన. రానురాను సినిమా పరిశ్రమలో మార్పులు వస్తూనే వున్నాయి. అవకాశాలు అడిగితే ఇచ్చే వారేమోగాని, అడిగే స్వభావం లేదు ఆయన దగ్గర. ఇక ఇమడలేక, మంగళగిరి వెళ్లిపోతూ అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఒక పదేళ్లపాటు అక్కడే వుండి, 2005లో అక్కడే చివరి వూపిరి పీల్చుకున్నారు. చనిపోయిన విషయం కూడా చాలా రోజులవరకూ చాలామందికి తెలియలేదు. ఆయనకి వున్న 'మొహమాటం' అలా కూడా వదిలిపెట్టలేదు!
సంగీతము అందించిన సినిమాలు (filmography ):
 • శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) -- ప్లేబ్యాక్ సింగర్ గా ,
 • నలదమయంతి (1957) -- కంపోజర్ గా ,
 • పల్లెటూరు (1952 ) -- ప్లే బ్యాక్ సింగర్ గా ,
పాటలు పాడిన సినిమాలు :
 • ఆస్థిపరులు ,
 • ఇల్లాలు ,
 • శ్రీదేవి ,
 • పూలరంగడు ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog